For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

CSK vs DC Playing 11: ఢిల్లీతో ఢీ: చెన్నై సూపర్ కింగ్స్‌లో కీలక మార్పు: తుదిజట్ల అంచనాలివే

IPL 2022: CSK vs DC Playing 11: Dwayne Bravo likely to replace Dwaine Pretorius

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌ సెకెండ్ హాఫ్‌లో భాగంగా ఈ సాయంత్రం చెన్నై సూపర్ కింగ్స్-ఢిల్లీ కేపిటల్స్ తలపడనున్నాయి. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. ఈ రెండు జట్లకూ ఈ మ్యాచ్ డు ఆర్ డై టైప్. చివరి అయిదు మ్యాచ్‌లల్లో చెన్నై మూడింట్లో ఓడిపోగా.. ఢిల్లీ రెండింట్లో పరాజయం పాలైంది. మొత్తంగా- 10 పాయింట్లతో కేపిటల్స్ పాయింట్ల పట్టికలో అయిదో స్థానంలో ఉంది. తొమ్మిదో ప్లేస్ నుంచి చెన్నై పైకి లేవట్లేదు. ఆ జట్టు ఖాతాలో ఉన్నవి ఆరు పాయింట్లే.

 సన్‌రైజర్స్‌పై అద్భుత విజయం.. ఆ వెంటే

సన్‌రైజర్స్‌పై అద్భుత విజయం.. ఆ వెంటే

మహేంద్ర సింగ్ ధోనీ కేప్టెన్సీలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై తిరుగులేని విజయం సాధించిన తరువాత మళ్లీ తుస్సుమంది ఎల్లో ఆర్మీ. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓటమిపాలైంది. ఒక్క పరుగుతో సెంచరీ మిస్ అయిన రుతురాజ్ గైక్వాడ్- బెంగళూరుపై ఆ స్థాయిలో ఆడలేదు. 28 పరుగులే చేశాడు. డెవాన్ కాన్వే ఒక్కడే ఈ రెండింట్లోనూ భారీ స్కోర్ చేశాడు. హాఫ్ సెంచరీలను నమోదు చేశాడు. మిడిలార్డర్‌లో మొయిన్ అలీ ఫర్వాలేదనిపించుకున్నాడు.

నిలకడలేమితనంతో సతమతం..

నిలకడలేమితనంతో సతమతం..

రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ తక్కువ పరుగులకే అవుట్ కావడం.. నిలకడలేమిని సూచిస్తోంది. దాని వల్ల పరాజయాలను చవి చూస్తూ వస్తోంది చెన్నై. రాబిన్ ఉతప్ప మొదట్లో భారీ ఇన్నింగ్స్ ఆడాడు. అంబటి రాయుడిదీ అదే పరిస్థితి. రవీంద్ర జడేజా అటు బ్యాట్‌తో గానీ, ఇటు బంతితో గానీ ఏ మాత్రం రాణించట్లేదు. ఈ సమస్యను అధిమించాల్సి ఉంది సూపర్ కింగ్స్‌కు. టోర్నమెంట్ ముగింపుదశకు వచ్చిన ప్రస్తుత పరిస్థితుల్లో మిగిలిన మ్యాచ్‌లల్లోనయినా నెట్‌ రన్‌రేట్ మెరుగుపర్చుకునేలా విజయాలను అందుకోగలిగితే ప్లేఆఫ్స్ ఆశలు కొద్దో గొప్పో మెరుగుపడతాయి.

 బౌలింగ్‌లో మార్పు

బౌలింగ్‌లో మార్పు

ఈ పరిణామాల మధ్య ఢిల్లీ కేపిటల్స్‌ను ఢీ కొట్టబోతోంది సూపర్ కింగ్స్. తుదిజట్లులో ఓ మార్పు చేసే అవకాశం ఉంది. డ్వైన్ ప్రిటోరియస్‌కు బదులుగా డ్వేన్ బ్రావోను తీసుకోవచ్చు. గాయం వల్ల రాయల్ ఛాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్రావో ఆడలేదు. ఇప్పుడతను అందుబాటులో ఉన్నాడని మేనేజ్‌మెంట్ ధృవీకరించింది. ప్రిటోరియస్‌ పెద్దగా ప్రభావాన్ని చూపలేదు బెంగళూరుపై. మూడు ఓవర్లల్లో 42 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ తీసుకున్నాడు.

కేపిటల్స్.. క్యా కరేగా

కేపిటల్స్.. క్యా కరేగా

ఢిల్లీ కేపిటల్స్ పరిస్థితి సూపర్ కింగ్స్ కంటే మెరుగ్గా ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అయిదో స్థానంలో ఉందీ జట్టు. పదింట్లో అయిదు మ్యాచ్‌లల్లో గెలిచి, 10 పాయంట్లను సాధించింది. ప్లేఆఫ్స్ అవకాశాలు మరింత మెరుగుపడాలంటే ఈ మ్యాచ్‌లో గెలవాల్సి ఉంటుంది. అదే జరిగితే 12 పాయింట్లతో తొలి నాలుగులో నిలవగులుగుతుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు గట్టి పోటీ ఇవ్వగలుగుతుంది.

పృథ్వీ షా రిటర్న్

పృథ్వీ షా రిటర్న్

గాయం వల్ల ఇదివరకటి మ్యాచ్‌కు దూరంగా ఉన్న ఓపెనర్ పృథ్వీ షా.. జట్టుకు అందుబాటులోకి వచ్చాడు. అతణ్ని తీసుకోవడానికి అవకాశం ఉంది. డేవిడ్ వార్నర్ చెలరేగితే- ఎలా ఉంటుందనేది ఇప్పటికే చూశాం. ఈ మ్యాచ్‌లో కూడా అతను విజృంభించడం ఖాయంగా కనిపిస్తోంది. మిఛెల్ మార్ష్, రిషభ్ పంత్, రౌమన్ పావెల్ భారీ స్కోరును సాధించే సత్తా ఉన్న వారే. అందుకే తన బౌలింగ్ విభాగాన్ని చెన్నై బలోపేతం చేసుకుంటోంది. బ్రావోను జట్టులోకి తీసుకోనుంది.

సీఎస్‌కే తుదిజట్టులో

సీఎస్‌కే తుదిజట్టులో

సీఎస్‌కే తుదిజట్టులో- డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, రాబిన్ ఉతప్ప, మొయిన్ అలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ (కేప్టెన్ వికెట్ కీపర్), డ్వేన్ బ్రావో/డ్వైన్ ప్రిటోరియస్, మహీష్ తీక్షణ, సిమర్‌జిత్ సింగ్, ముఖేష్ చౌదరి ఆడొచ్చు. ఢిల్లీ కేపిటల్స్‌లో- డేవిడ్ వార్నర్, పృథ్వీ షా/మన్‌దీప్ సింగ్, మిఛెల్ మార్ష్, రిషభ్ పంత్ (కేప్టెన్ వికెట్ కీపర్), రౌమన్ పావెల్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్/రిపల్ పటేల్, శార్దుల్ ఠాకూర్, కుల్‌దీప్ యాదవ్, ఎన్రిచ్ నోర్ట్జె, ఖలీల్ అహ్మద్ ఆడొచ్చు.

Story first published: Sunday, May 8, 2022, 7:56 [IST]
Other articles published on May 8, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+