For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రవీంద్ర జడేజ..మరో సురేష్ రైనా: పొమ్మనకుండా పొగబెట్టారా?: సీఎస్‌కే అన్ ఫాలోకు అర్థమేంటీ?

IPL 2022: CSK unfollows Ravindra Jadejas Instagram after he ruled out, says reports

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌‌ దాదాపు ముగింపు దశకు వచ్చిన ప్రస్తుత పరిస్థితుల్లో చెన్నై సూపర్ కింగ్స్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. టోర్నమెంట్ ఆరంభానికి కొద్ది రోజుల ముందు ఫ్రాంఛైజీ తీసుకున్న నిర్ణయమే ఈ జట్టు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసిందనే అభిప్రాయాలు ఉన్నాయి. దీనికి అనుగుణంగా- ఫ్రాంఛైజీ తీసుకుంటోన్న నిర్ణయాలు ఈ వివాదాన్ని మరింత ముదిరేలా చేస్తున్నాయి. ఫ్రాంఛైజీ వ్యవహారశైలి ఇప్పుడు విమర్శకుల నోటికి పని చెప్పినట్టయింది.

కేప్టెన్సీ మార్పు వల్ల..

కేప్టెన్సీ మార్పు వల్ల..

ప్రారంభంలో చెన్నై సూపర్ కింగ్స్ రవీంద్ర జడేజా కేప్టెన్సీలో కొన్ని మ్యాచ్‌లను ఆడిన విషయం తెలిసిందే. టోర్నమెంట్ ప్రారంభం కావడానికి కొద్దిరోజుల ముందు మహేంద్ర సింగ్ ధోనీకి బదులుగా రవీంద్ర జడేజకు కేప్టెన్సీ పగ్గాలను ఇవ్వడం.. జట్టు పరాజయాలకు బీజం వేసిందనే అభిప్రాయాలు ఉన్నాయి. ఈ మార్పు వల్ల సంభవించిన దుష్పరిణామాలు జట్టును ప్రభావితం చేశాయని, రాత్రికి రాత్రి కేప్టెన్సీ మార్పు వల్ల ప్రతికూల ప్రభావమే అధికంగా ఉందని అంటున్నారు అభిమానులు.

 ధోనీ తిరిగి పగ్గాలు అందుకున్నా..

ధోనీ తిరిగి పగ్గాలు అందుకున్నా..

కేప్టెన్సీ మళ్లీ మహేంద్ర సింగ్ ధోనీ చేతుల్లోకి వచ్చిన తరువాత కొంత సానుకూల ఫలితాలొచ్చాయి గానీ.. అప్పటికే పరిస్థితులు పూర్తిగా చేజారి పోయాయి. చేతులు పూర్తిగా కాలిన దశలో తన తప్పును గ్రహించింది చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ. జట్టు పగ్గాలను మళ్లీ ధోనీకే అప్పగించింది. ఆ తరువాత కూడా పెద్దగా మార్పులేమీ రాలేదు గానీ.. గెలిచిన మ్యాచ్‌ల సంఖ్యను స్వల్పంగా పెంచుకోగలిగింది చెన్నై సూపర్ కింగ్స్.

జడేజకు బ్యాడ్ లక్..

జడేజకు బ్యాడ్ లక్..

అటు రవీంద్ర జడేజా వ్యక్తిగత ఫామ్‌ను కూడా కోల్పోయాడు. బౌలింగ్‌లో పదును బాగా తగ్గింది. బ్యాటింగ్‌లో భారీ షాట్లను ఆడలేక ఒత్తిడికి గురయ్యాడు. కేప్టెన్సీ భారాన్ని అతను మోయలేకపోయాడు. ఇక తాజాగా- ఐపీఎల్ మొత్తానికీ దూరం అయ్యే పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. గాయం వల్ల ఇప్పటికే రెండు మ్యాచ్‌లను అతను ఆడలేదు. డగౌట్‌కే పరిమితం అయ్యాడు. ఇక తాజాగా మిగిలిన మ్యాచ్‌లకు కూడా జడేజా దూరం అయ్యాడు.

వైదొలగడానికి కారణమేంటీ?

వైదొలగడానికి కారణమేంటీ?

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో జడేజా గాయపడ్డ విషయం తెలిసిందే. క్యాచ్ పట్టుకుంటున్న సమయంలో బంతి నేరుగా అతని ఛాతీని తాకింది. ఆ తరువాత ఢిల్లీ కేపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడలేదు. గురువారం ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌కేకాదు.. ఏకంగా టోర్నమెంట్ నుంచే తప్పుకొన్నాడు. కీలక దశలో రవీంద్ర జడేజ వైదొలగడానికి చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ కారణమనే వాదనలు వినిపిస్తోన్నాయి.

నాడు సురేష్ రైనా..

నాడు సురేష్ రైనా..

ఇదివరకు సురేష్ రైనాను సాగనంపినట్టుగానే రవీంద్ర జడేజ విషయంలోనూ ప్రవర్తిస్తోందని చెబుతున్నారు. టోర్నమెంట్ నుంచి తప్పుకొంటున్నట్లు రవీంద్ర జడేజ నుంచి అధికారిక ప్రకటన వెలువడిన కొద్ది సేపటికే- చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ.. అతని అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌కు అన్ ఫాలో చేసింది. ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చిందీ వ్యవహారం. ఫ్రాంఛైజీ మేనేజ్‌మెంట్ దీన్ని కొట్టేసింది గానీ.. అనుమానాలను నివృత్తి చేయట్లేదు.

Story first published: Thursday, May 12, 2022, 12:01 [IST]
Other articles published on May 12, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+