
ప్లేఆఫ్స్ చేరకుండానే నిష్క్రమణ..
చెన్నై సూపర్ కింగ్స్‌కు మాత్రం గెలవాల్సిన మ్యాచ్. ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి.. ఈ సీజన్‌ను కాస్త తల ఎత్తుకునేలా ముగించాలని భావిస్తోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగిన ఐపీఎల్ 2020 సీజన్‌ను పునరావృతం చేసిందీ టీమ్. ప్లేఆఫ్స్ చేరకుండానే మరోసారి ఈ మెగా టోర్నమెంట్ నుంచి వైదొలగింది. ఇవ్వాళ్టి మ్యాచ్ నామమాత్రమే. రాజస్థాన్ రాయల్స్‌పై గెలిస్తే పాయింట్లు డబల్ డిజిట్‌కు చేరుతాయి. 10 పాయింట్లతో సీజన్‌కు గడ్‌బై చెప్పే వీలు ఉంటుంది.

నాలుగింట్లోనే గెలుపు..
ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మొత్తం గందరగోళంగా కనిపించిన విషయం తెలిసిందే. టోర్నమెంట్ ఆరంభం నుంచి చివరి వరకూ దాన్ని తొలగించుకోలేకపోయింది. కేప్టెన్సీ మార్పు దెబ్బకొట్టింది. జట్టు ఆటగాళ్ల ఆత్మస్థైర్యాన్ని ప్రభావితం చేసినట్టయింది. దాని ఫలితమే ఈ వరుస అపజయాలు. రవీంద్ర జడేజకు కేప్టెన్సీ పగ్గాలను అప్పగించడం వల్ల- అటు అతను కూడా ఫామ్‌ను కోల్పోయాడు. కేప్టెన్‌గా తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కొన్నాడు. ఆల్‌రౌండర్ ప్రతిభ మరుగునపడింది. బ్యాట్‌తో, బంతితో రాణించలేకపోయాడు. క్యాచ్‌లను సైతం వదిలిన మ్యాచ్‌లు ఉన్నాయి.

ధోనీ చేతుల్లోకి వెళ్లినా..
రవీంద్ర జడేజ బాధ్యతలను ధోనీకి అప్పగించినా పెద్దగా ఫలితం రాలేదు. అప్పటికే ఇల్లంతా కాలిపోయింది మరి. ధోనీ- కేప్టెన్సీ పగ్గాలను అందుకున్న తొలి మ్యాచ్‌లోనే సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. ఆ తరువాత ఢిల్లీ కేపిటల్స్‌ను చిత్తు చేసింది. ధోనీ సారథ్యంలో అయిదు మ్యాచ్‌లు ఆడిన ఎల్లో ఆర్మీ- నమోదు చేసిన విజయాలు ఈ రెండే. ఇవ్వాళ్టి మ్యాచ్‌లో పింక్ టీమ్‌ను ఎదుర్కొనబోతోంది.

రాయల్‌గా రాజస్థాన్
రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి దీనికి పూర్తి భిన్నం. రాయల్‌గా ప్లేఆఫ్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిందీ జట్టు. ఈ మ్యాచ్ గెలిచినా, గెలవకపోయినా ప్లేఆఫ్స్‌లో ప్రవేశించడం మాత్రం ఖాయం. 13 మ్యాచ్‌ల్లలో ఎనిమిదింట్లో ఘన విజయాన్ని సాధించింది. 16 పాయింట్లతో ప్లేఆఫ్స్ స్థానాన్ని ఖాయం చేసుకుంది. గెలిస్తే- అదే ఊపును ఎలిమినేటర్స్‌లల్లో కొనసాగించడానికి వీలు ఉంటుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్..ఇలా అన్ని విభాగాల్లో సత్తా చాటింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది.

సీఎస్‌కే తుదిజట్టులో
సీఎస్‌కే తుదిజట్టులో- డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, ఎన్ జగదీశన్, శివం దుబే, మిఛెల్ శాంట్నర్, ఎంఎస్ ధోనీ (కేప్టెన్-వికెట్ కీపర్), ప్రశాంత్ సోలంకి, సిమర్‌జిత్ సింగ్, ముఖేష్ చౌదరి, మతీష పాథిరణ ఆడొచ్చు. రాజస్థాన్ రాయల్స్‌లో యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (కేప్టెన్), దేవ్‌దత్ పడిక్కల్, షిమ్రోన్ హెట్మెయిర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, జేమ్స్ నీషమ్/ఒబెద్ మెక్‌కే, ట్రెంట్ బౌల్ట్, యజువేంద్ర చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ ఆడొచ్చు.


Click it and Unblock the Notifications
