For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

CSK vs RCB Playing 11: అత్యంత ప్రమాదకారిగా ధోనీ సేన: ఆర్సీబీకి అగ్నిపరీక్ష: తుదిజట్లివే

IPL 2022: CSK Playing 11 vs RCB: Here is the details of the both teams

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా ఈ సాయంత్రం మరో ఆసక్తికరమైన, అంతకుమించి కీలక మ్యాచ్ జరుగనుంది. చెన్నై సూపర్ కింగ్స్- ఫాఫ్ డుప్లెసిస్ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. రెండు జట్లకూ కీలకమైన మ్యాచ్ ఇది. ప్రస్తుతం ఈ రెండు జట్ల పరిస్థతేమీ బాగుండట్లేదు. పాయింట్ల పట్టికలో 6,9 స్థానాల్లో కొనసాగుతున్నాయి.

1
53658
1
53658
1
4-2022
ఆర్సీబీకి అగ్నిపరీక్ష..

ఆర్సీబీకి అగ్నిపరీక్ష..

ఈ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్‌కు అగ్నిపరీక్ష. గెలవక తప్పని పరిస్థితి. టోర్నమెంట్ కీలక దశకు చేరుకున్న సమయంలో విఫలమౌతోంది. వరుసగా మూడు మ్యాచ్‌లల్లో ఓటమి పాలైంది. చెన్నైపైనా అదే జరిగితే- ప్లేఆఫ్స్ ద్వారాలు మూసుకుపోతాయి. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌లల్లో అయిదింట్లో ఓడింది. 10 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది. మొదట్లో దూకుడుగా ఆడుతూ వచ్చిన రాయల్ ఛాలెంజర్స్.. వరుసగా మూడింట్లో ఓడటం పిడుగుపాటులా మారింది. ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలనుకుంటే చెన్నైపై గెలవడం అసవరం.

చెన్నై విధ్వంసకారిగా..

చెన్నై విధ్వంసకారిగా..

మహేంద్రసింగ్ ధోనీ చేతుల్లోకి చెన్నై సూపర్ కింగ్స్ వెళ్లిన తరువాత ఆ జట్టు విధ్వంసకారిగా తయారైంది. ప్రత్యర్థి ప్లేఆఫ్స్ ఆశలను గండి కొడుతోంది. ధోనీ కేప్టెన్సీ పగ్గాలను అందుకున్న తొలి మ్యాచ్‌లోనే సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తు చేసింది. సన్‌రైజర్స్ జట్టు ఖాతాలో పాయింట్ల సంఖ్య అధికంగా ఉండటం, నెట్ రన్‌రేట్ బాగుండటంతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కంటిన్యూ అవుతోంది. రాయల్ ఛాలెంజర్స్ పరిస్థితి అలాక్కాదు. భారీ రన్‌రేట్‌తో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించాల్సి ఉంటుంది.

గైక్వాడ్ ఫామ్‌లోకి రావడం..

గైక్వాడ్ ఫామ్‌లోకి రావడం..

ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే ఫామ్‌లోకి రావడం చెన్నై సూపర్ కింగ్స్‌ బ్యాటింగ్ కష్టాలను సగం దూరం చేసింది. సన్‌రైజర్స్‌పై 99 పరుగులు చేశాడు. ఇవ్వాళ్టి మ్యాచ్‌లో కూడా గైక్వాడ్‌పై అంచనాలు ఉన్నాయి. అతనితో పాటు కాన్వే ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని కంటిన్యూ చేయించవచ్చు. టాప్ ఆర్డర్ బ్యాటర్ మొయిన్ అలీకి బదులుగా రాబిన్ ఉతప్ప బరిలోకి దిగే అవకాశాలే అధికంగా ఉన్నాయి. మొయిన్ అలీ స్థానంలో మిఛెల్ శాంట్నర్‌ను తుది జట్టులోకి తీసుకుంది మేనేజ్‌మెంట్.

మిడిలార్డర్‌లో

మిడిలార్డర్‌లో

ఈ సాయంత్రం నాటి మ్యాచ్‌ కోసం కూడా శాంట్నర్‌నే కొనసాగించే అవకాశం ఉంది. మొయిన్ అలీ/డ్వేన్ బ్రావో/శాంట్నర్‌లల్లో ఒకరికి అవకాశం దక్కుతుందనే అంచనాలు ఉన్నాయి. మిడిలార్డర్‌లో అంబటి రాయుడు, కేప్టెన్ ఎంఎస్ ధోనీ, రవీంద్ర జడేజాలతో బలంగా ఉంది చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ ఆర్డర్. శివం దుబే ఈ మ్యాచ్ మిస్ అవ్వొచ్చు. డ్వైన్ ప్రిటోరియస్, మహీష్ తీక్షణ, సిమర్‌జిత్ సింగ్, ముఖేష్ చౌదరిలతో బౌలింగ్ డిపార్ట్‌మెంట్ బలంగా ఉంది.

దిగజారుతున్న బెంగళూరు..

దిగజారుతున్న బెంగళూరు..

రాయల్ ఛాలెంజర్స్ పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. సీజన్ మొదట్లో మెరుగ్గా రాణించిన ఈ టీమ్.. క్రమంగా చతికిలపడింది. మొదట్లో టాప్‌లో కొనసాగిన ఈ జట్టు ఇప్పుడు ఆరో స్థానానికి పడిపోయింది. బౌలర్లు, బ్యాటర్లు విఫలమౌతుండటం ఆర్సీబీని వేధిస్తోంది. ఓపెనర్లు భారీ భాగస్వామ్యాన్ని అందించట్లేదు. మిగిలిన బ్యాటర్లు కూడా ఎక్కువసేపు క్రీజ్‌లో నిలదొక్కుకోవట్లేదు. బౌలింగ్ అటాక్ బలహీనపడింది. రాను రాను రాజు గుర్రం.. అనే టైప్‌లో ఆడుతోందీ రాయల్ ఛాలెంజర్స్. ఈ మ్యాచ్ గెలవడం తప్పనిసరి కావడం వల్ల

సీఎస్‌కే తుదిజట్టులో

సీఎస్‌కే తుదిజట్టులో

సీఎస్‌కే తుదిజట్టులో- రాబిన్ ఉతప్ప, రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ (కేప్టెన్-వికెట్ కీపర్), రవీంద్ర జడేజా (కేప్టెన్), మొయిన్ అలీ/డ్వేన్ బ్రావో/శాంట్నర్, డ్వైన్ ప్రిటోరియస్, మహీష్ తీక్షణ, సిమర్‌జిత్ సింగ్, ముఖేష్ చౌదరి ఆడొచ్చు. రాయల్ ఛాలెంజర్స్‌లో- ఫాఫ్ డుప్లెసిస్ (కేప్టెన్), విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, మహిపాల్ లోమ్రార్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), వనిందు హసరంగ, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్‌కు చోటు కల్పించే అవకాశం ఉంది.

Story first published: Wednesday, May 4, 2022, 7:20 [IST]
Other articles published on May 4, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+