For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

CSK vs PBKS Playing 11: ముంబైని చూసి గుణపాఠం: నిలవాలంటే గెలవాల్సిందే: చెన్నైలో కీలక మార్పు

IPL 2022: CSK Playing 11 vs PBKS: Here is the details of the both teams

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా ఈ సాయంత్రం మరో ఆసక్తికరమైన మ్యాచ్ జరుగనుంది. చెన్నై సూపర్ కింగ్స్- మయాంక్ అగర్వాల్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. ముంబైలోని వాంఖెడె స్టేడియంలో ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. రెండు జట్లకూ కీలకమైన మ్యాచ్ ఇది. ప్రస్తుతం ఈ రెండు జట్ల పరిస్థతేమీ బాగుండట్లేదు. పాయింట్ల పట్టికలో 8,9 స్థానాల్లో కొనసాగుతున్నాయవి.

గెలవడం అవసరం..

గెలవడం అవసరం..

ఆడిన ఏడు మ్యాచ్‌లల్లో అయిదింట్లో ఓడిన చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ వరకూ వెళ్లగలగాలంటే పంజాబీయులపై గెలవడం అత్యవసరం. అదే పరిస్థితిని పంజాబ్ కూడా ఎదుర్కొంటోంది. మొదట్లో దూకుడుగా ఆడుతూ వచ్చిన పంజాబ్ కింగ్స్.. ఆ తరువాత నిర్వీర్యమైంది. చివరి అయిదు మ్యాచ్‌లల్లో రెండింట్లో గెలిచింది. చివరి రెండింటినీ ప్రత్యర్థులకు కోల్పోయింది. ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలనుకుంటే చెన్నైపై గెలవడం అసవరం.

గైక్వాడ్ ఫామ్‌పై ఆందోళన..

గైక్వాడ్ ఫామ్‌పై ఆందోళన..

ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఫామ్.. చెన్నై సూపర్ కింగ్స్‌ను ఆందోళనకు గురి చేస్తోంది. గుజరాత్ టైటాన్స్‌పై తప్ప ఇప్పటివరకు ఒక్క భారీ ఇన్నింగ్ కూడా ఆడలేదు. ఆ ఒక్క మ్యాచ్‌లో 73 పరుగులు చేశాడు గానీ టీమ్ ఓడిపోయింది. డేవిడ్ మిల్లర్ బ్యాటింగ్ దెబ్బకు కుదేల్ అయింది. ఇవ్వాళ్టి మ్యాచ్‌లో కూడా అతణ్నే నమ్ముకున్నట్టు కనిపిస్తోంది చెన్నై మేనేజ్‌మెంట్. గైక్వాడ్-రాబిన్ ఉతప్పల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని కంటిన్యూ చేయించవచ్చు.

మొయిన్ అలీని పక్కన పెడతారా?

మొయిన్ అలీని పక్కన పెడతారా?

టాప్ ఆర్డర్ బ్యాటర్ మొయిన్ అలీ పరిస్థితి కూడా దాదాపు ఇంతే. ఫామ్‌లో ఉండట్లేదు. అయిదు మ్యాచ్‌లకు కలిపి అతను చేసింది 87 పరుగులే. ఇందులో హయ్యెస్ట్ స్కోర్ 48. బ్యాటింగ్ యావరేజ్ 17.40. ఈ మ్యాచ్‌లో కూడా ఈ ఆల్‌రౌండర్‌ను పక్కన పెట్టొచ్చు. ముంబై ఇండియన్స్‌పై మొయిన్ ఆడలేదు. అతని స్థానంలో మిఛెల్ శాంట్నర్‌ను తుది జట్టులోకి తీసుకుంది మేనేజ్‌మెంట్. ఈ సాయంత్రం నాటి మ్యాచ్‌ కోసం కూడా శాంట్నర్‌నే కొనసాగించే అవకాశం ఉంది. చెన్నై తొలి ముగ్గురు బ్యాటర్లు కలిసి చేసిన పరుగులు 436. మిగిలిన జట్లతో పోల్చి చూస్తే.. ఇదే లోయెస్ట్.

 మిడిలార్డర్‌లో

మిడిలార్డర్‌లో

మిడిలార్డర్‌లో అంబటి రాయుడు, శివందుబేతో బలంగా ఉంది చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ ఆర్డర్. తొలి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించిన తరువాత రాయుడు మళ్లీ ఆ స్థాయిలో ఆడలేదు. అతను బౌన్స్ బ్యాక్ కావాలని చెన్నై కోరుకుంటోంది. శివం దుబే మరోసారి భారీ ఇన్నింగ్‌పై కన్నేసే అవకాశాలు లేకపోలేదు. రాయల్ ఛాలెంజర్స్‌పై చేసిన 95 పరుగుల భారీ ఇన్నింగ్‌ను పునరావృతం చేస్తే మాత్రం గుజరాత్‌కు భారీ టార్గెట్ తప్పకపోవచ్చు. క్రిస్ జోర్డాన్, రవీంద్ర జడేజా, మహీష్ తీక్షణ, డ్వేన్ బ్రావోలతో బౌలింగ్ డిపార్ట్‌మెంట్ బలంగా ఉంది.

పేలవంగా పంజాబ్..

పేలవంగా పంజాబ్..

పంజాబ్ కింగ్స్ పరిస్థితి పేలవంగా తయారైంది. సీజన్ మొదట్లో మెరుగ్గా రాణించిన ఈ టీమ్.. క్రమంగా చతికిలపడుతోంది. మొదట్లో టాప్‌లో కొనసాగిన ఈ జట్టు ఇప్పుడు ఎనిమిదో స్థానానికి పడిపోయింది. బౌలర్లు విఫలమౌతుండటం పంజాబ్‌ను వేధిస్తోంది. పంజాబ్ పేస్ బౌలింగ్ అటాక్ బలహీనపడింది. ఫాస్ట్ బౌలర్లు ఇప్పటివరకు తీసుకున్న వికెట్లు.. 18 మిగిలి జట్లన్నింటితో కంపేర్ చేస్తే.. అతి తక్కువ వికెట్ టేకర్స్ పంజాబ్ పేసర్లే. దీన్ని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

సీఎస్‌కే తుదిజట్టులో

సీఎస్‌కే తుదిజట్టులో

సీఎస్‌కే తుదిజట్టులో- రాబిన్ ఉతప్ప, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ/మిఛెల్ శాంట్నర్, శివం దుబే, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా (కేప్టెన్), డ్వేన్ బ్రావో, డ్వైన్ ప్రిటోరియస్, మహీష్ తీక్షణ, ముఖేష్ చౌదరి ఆడొచ్చు. పంజాబ్ కింగ్స్‌లో మయాంక్ అగర్వాల్ (కేప్టెన్), శిఖర్ ధవన్, జానీ బెయిర్‌స్టో/భానుక రాజపక్స, లియామ్ లివింగ్‌స్టొన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), షారుఖ్ ఖాన్, ఒడియన్ స్మిత్, కగిసొ రబడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్, వైభవ్ అరోరాలకు చోటు కల్పించే అవకాశం ఉంది.

Story first published: Monday, April 25, 2022, 7:36 [IST]
Other articles published on Apr 25, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+