IPL 2022 CSK Playing 11: ఆల్‌రౌండర్లకు పెద్ద పీట.. రైనా స్థానం అతడితో భర్తీ.. సీఎస్కే తుది జట్టు ఇదే!

భారత్, శ్రీలంక టెస్ట్ సిరీస్ ముగిసింది. దీంతో ఇక అందరి చూపు త్వరలో ప్రారంభం కాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022పై పడింది. ఈ లీగ్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 26 నుంచి మే 29 వరకు క్రికెట్ అభిమానులను ఐపీఎల్ అలరించనుంది. తొలి మ్యాచ్ గతేడాది ఫైనల్ ఫైట్‌లో తలపడిన చెన్నైసూపర్ కింగ్స్, కోల్‌కతానైట్ రైడర్స్ మధ్యనే జరగనుంది. ఈ నేపథ్యంలో తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చెన్నైసూపర్ కింగ్స్ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
సీఎస్కే పూర్తి జట్టు ఇదే
మహేంద్ర సింగ్ ధోనీ (12 కోట్లు), రవీంద్ర జడేజా(16 కోట్లు), మొయిన్ అలీ 8 కోట్లు), రుతురాజ్ గైక్వాడ్( 6 కోట్లు), దీపక్ చాహర్( 14 కోట్లు), అంబటి రాయుడు(6.75 కోట్లు), డ్వేన్ బ్రావో (ఓవర్సీస్-4.40 కోట్లు), శివమ్ దూబే( 4 కోట్లు), క్రిస్ జొర్డాన్( 3.60 కోట్లు), రాబిన్ ఉతప్ప(2 కోట్లు), మిచెల్ సాంట్నర్ (ఓవర్సీస్ 1.90కోట్లు), ఆడమ్ మిల్నే (ఓవర్సీస్- 1.90 కోట్లు), విక్రమ్ సోలంకి(1.20 కోట్లు), రాజ్‌వర్థన్(1.50 కోట్లు), డేవన్ కాన్వే (ఓవర్సీస్- రూ. కోటి), మహీష్ తీక్షణ (ఓవర్సీస్ 70 లక్షలు), ప్రిటోరియస్ (ఓవర్సీస్ 50 లక్షలు), కేఎమ్ అసిఫ్, తుషార్ దేశ్‌పాండే, సిమర్‌జీత్ సింగ్, శుభ్రాన్ష్ సేనాపతి, ముకేశ్ చౌధరి, జగదీశన్, హరి నిషాంత్( వీరందరికీ 20 లక్షలు)

ఓపెనర్లుగా వీళ్లే
రిటైన్ చేసుకున్న నలుగురు ఆటగాళ్లు, మెగా వేలంలో కొనుగోలు చేసిన 20 మంది ఆటగాళ్లు కలిసి చెన్నైసూపర్ కింగ్స్ వద్ద మొత్తం 24 మంది ఆటగాళ్లు ఉన్నారు. ఇక కోల్‌కతానైట్ రైడర్స్‌తో తలపడబోయే మొదటి మ్యాచ్‌లో టీమిండియా యువ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్, న్యూజిలాండ్ సంచలన బ్యాటర్ డేవాన్ కాన్వే ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. రుతురాజ్ గైక్వాడ్ గత సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక డేవాన్ కాన్వే ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో దుమ్ములేపే ఆట తీరుతో అదరగొడుతున్నాడు.

మిడిలార్డర్‌లో..
ఇక మూడో స్థానంలో రాబిన్ ఊతప్ప ఆడగనుండగా.. నాల్గో స్థానంలో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ బ్యాటింగ్ చేయనున్నాడు. గతేడాది మూడో స్థానంలో ఆడిన అలీ రాణించాడు. దీంతో అలీని మూడో స్థానంలో పంపి, ఊతప్పను నాల్గో స్థానంలో ఆడించే అవకాశాలు కూడా ఉన్నాయి. దీనిని బట్టి సురేష్ రైనా స్థానాన్ని ఊతప్ప లేదా అలీతో భర్తీ చేస్తున్నారని అర్థమవుతుంది. ఇక తెలుగు బ్యాటర్ అంబటి రాయుడు ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయనుండగా.. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు రానున్నాడు.

బౌలర్లు వీళ్లే
ఇక బౌలర్ల జాబితాలో వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ డీజే బ్రావో స్థానం ఖరారు కాగా, గాయం నుంచి పూర్తిగా కోలుకుంటే దీపక్ చాహర్ ఆడనున్నాడు. వీరిద్దరు బ్యాటింగ్‌లోనూ రాణించగలరు. లేదంటే అతని స్థానంలో తుషార్ పాండేను బరిలోకి దించే అవకాశాలు ఉన్నాయి. ఇక మరో పేసర్‌గా కేఎమ్ అసిఫ్ లేదా అండర్ 19 ప్రపంచకప్ హిరో రాజ్‌వర్దన్‌ను ఆడించే అవకాశాలు ఉన్నాయి. ఇక మరో పేస్ బౌలర్‌గా మిల్నే లేదా జోర్దాన్‌లలో ఒకరిని ఆడించనున్నారని తెలుస్తోంది.

ఆల్‌రౌండర్లకు పెద్ద పీట
ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, మొయిన్ అలీ స్పిన్ కోటాను పంచుకోనున్నారు. టీంలో మొత్తం నలుగురు ఆల్‌రౌండర్లు ఉన్నారు. వారిలో రవీంద్ర జడేజా, మొయిన్ అలీ, డీజే బ్రావో, దీపక్ చాహర్ ఉన్నారు. దీనిని బట్టి తుది జట్టులో ఆల్‌రౌండర్లకు పెద్ద పీట వేశారిన అర్థమవుతుంది. దీంతో మంచి ఆల్‌రౌండర్లతోపాటు బ్యాటింగ్, బౌలింగ్‌లో సీఎస్కే బలంగా కనిపిస్తోంది. అలాగే చెన్నైసూపర్ కింగ్స్ బెంచ్ కూడా బలంగా కనిపిస్తోంది.

తుది జట్టు
రుతురాజ్ గైక్వాడ్, డేవాన్ కాన్వే, రాబిన్ ఊతప్ప, మొయిన్ అలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోని (కెప్టెన్ & వికెట్ కపీర్), డిజే బ్రావో, దీపక్ చాహర్/తుషార్, కిమీ ఆసిఫ్/రాజవర్ధన్, మిల్నే / జోర్డాన్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications