Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

లుంగి డాన్స్‌లో అదరగొట్టిన చెన్నై సూపర్ కింగ్స్: ఆ ఫారిన్ ప్లేయర్ ప్రీ వెడ్డింగ్ పార్టీ

IPL 2022: CSK players Lungi dance at Devon Conway’s pre wedding party

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌.. చెన్నై సూపర్ కింగ్స్‌కు ఏ మాత్రం కలిసి రావట్లేదు. గత సీజన్‌లో ఛాంపియన్ ఆవిర్భవించిన ఈ జట్టు.. ఇప్పుడు తన మనుగడ కోసం పోరాడాల్సిన దుస్థితిని ఎదుర్కొంటోంది. మరోసారి ప్లేఆఫ్స్‌కు చేరకుండానే ఇంటిముఖం పట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. మ్యాచ్‌లను గెలవకపోవడం వల్ల టీమ్‌లో ఓ రకమైన నిర్వేదం.. నిరాశావాదం అలముకున్నాయి. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌లల్లో ఒకదాంట్లో మాత్రమే గెలిచందీ రవీంద్ర జడేజా సారథ్యంలోని ఎల్లో ఆర్మీ.

గురువారం తన తదుపరి మ్యాచ్‌ను ఆడబోతోంది. తనకంటే అధ్వాన్నంగా ఉన్న ముంబై ఇండియన్స్‌ను ఢీ కొట్టబోతోంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో సాయంత్రం 7:30 గంటలకు ఈ మ్యాచ్‌ జరుగనుంది. ఇందులో విజయం సాధించడం ద్వారా టోర్నమెంట్‌లో ముందడుగు వేయడానికి కసరత్తు చేస్తోంది.. కఠోరంగా శ్రమిస్తోంది. వరుస ఓటములను అధిగమించడానికి అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించుకుంటోంది.

అపజయాలతో సతమతమౌతోన్న చెన్నై సూపర్ కింగ్స్ క్యాంప్‌లో జోష్ నింపింది.. ఆ జట్టు ప్లేయర్ డెవాన్ కాన్వే ప్రీ వెడ్డింగ్ పార్టీ. ముంబైలోని ట్రైడెంట్ హోటల్‌లో లాన్‌లో ఈ పార్టీ ఏర్పాటైంది. లుంగి డాన్స్‌లో అదరగొట్టారు ప్లేయర్లు. తమిళ సంప్రదాయబద్ధమైన దుస్తుల్లో కనిపించారు. పట్లు పంచె, లాల్చీల్లో కొత్తగా కనిపించారు. హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్, వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ మహేంద్రసింగ్ ధోనీ, ఆల్‌రౌండర్ మొయిన్ అలీ, ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్, బౌలర్ ఆడమ్ మిల్నె.. ఇలా జట్టు ప్లేయర్లందరూ సరదాగా గడిపారు. చాలామంది ప్లేయర్ల కుటుంబ సభ్యులు కూడా దీనికి హాజరయ్యారు.

అనంతరం డెవాన్ కాన్వే కేక్ కట్ చేశాడు. అతని ఫియాన్సీ కిమ్ వాట్సన్ పసుపురంగు పట్టు చీరెలో మెరిసిపోయింది.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 2020లో డెవాన్ కాన్వే-కిమ్ వాట్సన్ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ఈ సంవత్సరమే వారిద్దరూ పెళ్లి పీటలు ఎక్కనున్నారు. వచ్చే సంవత్సరం ఐపీఎల్ నాటికి అతను ఒకింటి వాడవుతాడు. అందుకే- ఈ సీజన్‌లోనే తన తోటి ప్లేయర్లకు ప్రీ వెడ్డింగ్ పార్టీ ఇచ్చాడు. ఇదివరకు గ్లెన్ మ్యాక్స్‌వెల్.. తమిళ సంప్రదాయంలో తన ఫియాన్సీని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

Story first published: Wednesday, April 20, 2022, 12:28 [IST]
Other articles published on Apr 20, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+