IPL 2022: షాకింగ్! మెగా వేలంలో అమ్ముడుపోని ఆటగాడిగా సురేష్ రైనా.. అందుకు కారణాలు ఇదిగో!

బెంగళూరు: ఐపీఎల్ 2022 మెగా వేలంలో టీమిండియా మాజీ ఆటగాడు, వెటరన్ బ్యాటర్ సురేష్ రైనాకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఇప్పటికే తొలి విడత వేలంలో అమ్ముడుపోని సురేష్ రైనా పేరు రెండవ యాక్సిలరేషన్ జాబితాలో కూడా లేదు. వేలంలో మొదటి సారి అమ్ముడు పోని ఆటగాళ్లకు చివరన మరోసారి అవకాశం ఇస్తారు. ఫ్రాంచైజీలు ఎంచుకున్న ఆటగాళ్లకు మళ్లీ వేలం నిర్వహిస్తారు. కానీ దురదృష్టవశాత్తూ రైనాను ఏ ఫ్రాంచైజీ ఎంచుకోలేదు. దీంతో అతను చివరను నిర్వహించే వేలం జాబితాలో చోటు కోల్పోయాడు. దీంతో ఈ సీజనల్‌లో సురేష్ రైనా ఇక కనిపించడు. అమ్ముడుపోని ఆటగాడిగా నిలిచాడు.

నిరాశలో రైనా ఫ్యాన్స్
గతేడాది వరకు ఐపీఎల్‌లో సురేష్ రైనా చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు రైనా ఒక్క సీఎస్కే తరఫున మాత్రమే ఆడాడు. ఈ క్రమంలో మిస్టర్ ఐపీఎల్‌గా కూడా పేరు తెచ్చుకున్నాడు. ఆ జట్టు లేని రెండు సీజన్లు మాత్రం గుజరాత్ లయన్స్ తరఫున ఆడాడు. సీఎస్కే విజయాల్లో రైనా కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ సారి రైనాను ఆ జట్టు రిటైన్ చేసుకోక పోవడంతో మెగా వేలంలోకి వచ్చాడు. 2 కోట్ల రూపాయల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి రాగా ఏ జట్టు కూడా కొనుగోలు చేయలేదు. సీఎస్కే కూడా పట్టించుకోలేదు. వేలంలోకి వచ్చినప్పటికీ సీఎస్కే మళ్లీ కొనుగోలు చేస్తుందని అంతా భావించారు. కానీ అది జరగకపోవడంతో రైనా అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు.

కారణమిదేనే
ఐపీఎల్ మెగా వేలంలో సురేష్ రైనాను ఏ జట్టు కొనుగోలు చేయకపోవడానికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సురేష్ రైనా ఫాంలో లేడు. దీనికి తోడు ఇటీవల ఎలాంటి క్రికెట్ ఆడలేదు. ఇక గత సీజన్లో కూడా రైనా దారుణంగా విఫలమయ్యాడు. అలాగే ఈ సీజన్లో రాణిస్తాడనే నమ్మకాన్ని కూడా ఫ్రాంచైజీలకు కల్పించలేకపోయాడు. దీనికి తోడు 2020లో ఇండియాలో కరోనా కారణంగా యూఏఈలో లీగ్ జరిగినప్పుడు రైనా మ్యాచ్‌లు మొదలవకుండానే స్వదేశానికి తిరిగొచ్చేశాడు. దీంతో ఈ సారి కూడా అలాంటి పరిస్థితులు ఏర్పడితే రైనా జట్టుకు అందుబాటులో ఉండడని కూడా ఫ్రాంచైజీలు భావించాయని తెలుస్తోంది. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ నుంచి కూడా తప్పుకున్నాడు. ఈ కారణాలన్నింటిని దృష్టిలో పెట్టుకునే రైనాను ఏ ఫ్రాంచైజీ దక్కించుకోలేదని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.

రైనా రికార్డులు
ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన ఆటగాళ్లలో సురేష్ రైనా ఒకడు. ఈ లీగ్‌లో ఇప్పటివరకు 205 మ్యాచ్‌లు ఆడిన రైనా 32 సగటుతో 5528 పరుగులు చేశాడు. ఇందులో 39 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ కూడా ఉన్నాయి. ఈ క్రమంలో 506 ఫోర్లు బాదిన రైనా, 203 సిక్సులు కొట్టాడు. బౌలర్‌గానూ 13 వికెట్లు తీశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications