Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2022: DC vs GT మ్యాచ్ జరుగుతుండగా లిప్ కిస్‌లో మునిగిపోయిన జంట.. నెట్టింట వైర‌ల్‌!

IPL 2022: Couple lip-kissing during DC vs GT match goes viral on social media

మ్యాచ్‌ల‌ను వీక్షించ‌డానికి వ‌చ్చే ప్రేమికులు మైదానాల్లోనే ఒక‌రికొక‌రు ప్ర‌పోజ్ చేసుకోవ‌డం, ముద్దులు పెట్టుకోవ‌డం వంటికి ఫుట్‌బాల్ లీగ్‌ల్లో క‌నిపిస్తుంటాయి. కానీ ప్ర‌స్తుతం ఈ సాంప్ర‌దాయం క్రికెట్‌కు కూడా పాకింది. అది కూడా సాంప్ర‌దాయ దేశ‌మైనా ఇండియాలో జ‌రుగుతున్న ఐపీఎల్‌లో ఇటువంటి ఘ‌ట‌న ఒక‌టి క‌నిపించ‌డం ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఐపీఎల్ 2022లో భాగంగా శ‌నివారం జ‌రిగిన మ్యాచ్‌లో ఓ జంట చేసిన ప‌ని ప్ర‌స్తుతం సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇది చూసిన నెటిజ‌న్లు ర‌క‌ర‌కాల మీమ్స్ చేస్తూ స‌ద‌రు జంట‌ను ట్రోల్ చేస్తున్నారు.

ఓ జంట లిప్ కిస్‌

గుజ‌రాత్ టైటాన్స్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్ మ‌ధ్య శ‌నివారం పుణే వేదిక‌గా మ్యాచ్ జ‌రిగింది. అయితే ఈ మ్యాచ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో ఓ జంట స్టాండ్స్‌లో లిప్ కిస్ పెట్టుకున్నారు. మైదానంలో అంత మంది ఉన్నా, వారి చుట్టు ప‌క్క‌ల చాలా మంది ఉన్న వారినెవ‌రిని ప‌ట్టించుకోకుండా ఆ జంట కాసేపు ముద్దులాట‌లో మునిగిపోయింది.

అంత అల్ల‌రిలో, అంత శ‌బ్దంలో, అంత‌మందిలోని ఎవ‌రిని ప‌ట్టించుకోకుండా ఆ జంట కొంత సేప్‌ లిప్ కిస్ పెట్టుకున్నారు. ఈ లోకంతో త‌మ‌కు సంబంధం లేద‌న్న‌ట్టుగా త‌మ ముద్దుల ప‌రువ‌శంలో తేలియాడారు. వారిని చూసి చుట్టు ప‌క్క‌ల వాళ్లైనా ప‌క్క‌కు వెళ్లారు త‌ప్పితే వాళ్లు మాత్రం అక్క‌డే ఉండి త‌మ ముద్దులాట‌ను కొన‌సాగించారు. అయితే ఈ సంఘ‌న‌ను ఓ కెమెరామెన్ ఫోటో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా ప్ర‌స్తుతం నెట్టింట తెగ చ‌క్క‌ర్లు కొడుతోంది.

సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్‌

సోష‌ల్ మీడియాలో ఆ జంట ముద్దులాట చూసిన నెటిజ‌న్లు ర‌క‌ర‌కాలుగా కామెంట్ల‌తో మీమ్స్ వ‌ర్షం కురిపిస్తున్నారు. ఈ జంట ఐపీఎల్ స్థాయిని మ‌రో లెవ‌ల్‌కు తీసుకెళ్లింద‌ని ఓ నెటిజ‌న్‌ కామెంట్ చేశాడు. ఒక జంట ఐపీఎల్‌లో వివిధ జ‌ట్ల‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని అప్పుడు వారు ప్ర‌తి బంతికి ఇలా ముద్దుల‌తో సెల‌బ్రేట్ చేసుకోవ‌చ్చని మరొక‌రు రాసుకొచ్చారు.

ఇక మ‌రొక‌రు అయితే బ్రేకింగ్ న్యూస్‌: ఐపీఎల్‌లో కిస్ క్యామ్ కొత్త‌గా ప్ర‌వేశ‌పెట్ట‌బ‌డింద‌ని ఫ‌న్నీగా రాసుకొచ్చారు. ఇక మ‌రొకొంద‌రైతే ఈ జంట ముద్దులాట‌ను క‌వ‌ర్ చేసిన కెమెరామెన్ ప‌ని త‌నాన్ని మెచ్చుకుంటున్నారు.

గుజ‌రాత్ గెలుపు

ఇక ఆ మ్యాచ్ విష‌యానికొస్తే ఢిల్లీ క్యాపిట‌ల్స్‌పై గుజ‌రాత్ టైటాన్స్ 14 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. మొద‌ట బ్యాటింగ్ చేసిన గుజ‌రాత్ టైటాన్స్ 6 వికెట్ల న‌ష్టానికి 171 ప‌రుగులు చేసింది. ఆ జ‌ట్టు బ్యాట‌ర్ల‌లో శుభ్‌మాన్ గిల్ 84 ప‌రుగుల‌తో చెల‌రేగాడు. హార్దిక్ పాండ్యా 31 ప‌రుగుల‌తో ప‌ర్వాలేద‌నిపించ‌గా.. మిల్ల‌ర్ 20 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు.

ఢిల్లీ బౌల‌ర్ల‌లో ముస్తఫిజ‌ర్ ర‌హ్మాన్‌ 3, ఖ‌లీల్ అహ్మ‌ద్ 2, కుల్దీప్ యాద‌వ్ ఒక వికెట్ తీశారు. అనంత‌రం ల‌క్ష్య చేధ‌న‌లో ఢిల్లీ 157 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. ఆ జ‌ట్టు బ్యాట‌ర్ల‌లో కెప్టెన్ రిష‌బ్ పంత్ ఒక్క‌డే 43 ప‌రుగుల‌తో రాణించాడు. గుజరాత్ బౌల‌ర్ల‌లో ఫెర్గ్యూస‌న్ 4 వికెట్లతో చెల‌రేగాడు. ష‌మీ 2, హార్దిక్ పాండ్యా, ర‌షీద్ ఖాన్ త‌లో వికెట్ తీశారు.

Story first published: Sunday, April 3, 2022, 11:56 [IST]
Other articles published on Apr 3, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+