IPL 2022: పర్పుల్ క్యాప్‌ల్లో భువి, బ్రావో డబుల్ ధమాకా.. ఏ సీజన్లో ఎవరు గెలిచారు? పూర్తి లిస్ట్ ఇదిగో!

ప్రతి ఐపీఎల్ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లకు పర్పుల్ క్యాప్ ఇస్తుంటారు. అలా ఇప్పటివరకు ముగిసిన 14 సీజన్లలో 13 మంది పర్పుల్ క్యాప్‌లు అందుకున్నారు. ఇందులో టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ వరుసగా రెండు సీజన్లలో పర్పుల్ క్యాప్ అందుకోవడం గమనార్హం. డ్వేన్ బ్రావో కూడా పర్పుల్ క్యాప్‌ను రెండు సార్లు గెలుచుకున్నాడు. ఐపీఎల్‌లో వీరిద్దరు మాత్రమే రెండు సార్లు పర్పల్ క్యాప్ గెలుచుకుని డబుల్ ధమాకా పొందారు. మొత్తంగా ఈ శనివారం నుంచి ఐపీఎల్ 15వ ఎడిషన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటివరకు పర్పుల్ క్యాప్ అందుకున్న ఆటగాళ్ల జాబితాను ఓ సారి పరిశీలిద్దాం.

మొదటి సీజన్లో పర్పుల్ క్యాప్ విజేత అతనే
2008లో జరిగిన ఐపీఎల్ మొదటి సీజన్లో రాజస్థాన్ రాయల్స్ బౌలర్ సోహైల్ తన్వీర్ పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు. ఆ సీజన్లో 11 మ్యాచ్‌లు ఆడిన సోహైల్ 22 వికెట్లు తీశాడు. ఇక రెండో సీజన్లో డెక్కన్ చార్జర్స్ బౌలర్ ఆర్పీ సింగ్ పర్పుల్ క్యాప్‌ను గెలుచుకున్నాడు. ఆ సీజన్లో ఆర్పీ సింగ్ 16 మ్యాచ్‌లాడి 23 వికెట్లు తీశాడు. ఇక మూడో సీజన్లో డెక్కన్ చార్జర్స్ స్పిన్ బౌలర్ ప్రజ్ఙాన్ ఓజా పర్పుల్ క్యాప్‌ను అందుకున్నాడు. ఆ సీజన్లో 16 మ్యాచ్‌లాడిన ఆడిన ఓజా 21 వికెట్లు తీశాడు.

2011లో లసిత్ మలింగ
ఇక 2011లో జరిగిన ఐపీఎల్ నాల్గో సీజన్లో ముంబై ఇండియన్స్ పేసర్ లసిత్ మలింగ అత్యధిక వికెట్లు తీసి పర్పుల్ క్యాప్‌ను గెలుచుకున్నాడు. ఆ సీజన్లో 16 మ్యాచ్‌లకుగాను మలింగ 28 వికెట్లు తీశాడు. ఇక ఐదో సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ పేస్ బౌలర్ మోర్నీ మోర్కెల్ పర్పుల్ క్యాప్‌ను అందుకున్నాడు. ఆ సీజన్లో మోర్నీ మోర్కెల్ 16 మ్యాచ్‌లాడి 25 వికెట్లు తీశాడు. ఇక ఆరో సీజన్లో చెన్నైసూపర్ కింగ్స్ పేస్ బౌలర్ డ్వేన్ బ్రావో పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు. ఆ సీజన్లో 18 మ్యాచ్‌ల్లో బ్రావో 32 వికెట్లు తీశాడు.

భువి డబుల్ ధమాకా
ఏడో సీజన్లో చెన్నైసూపర్ కింగ్స్ బౌలర్ మోహిత్ శర్మ పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు. ఆ సీజన్లో 16 మ్యాచ్‌లాడిన మోహిత్ శర్మ 23 వికెట్లు తీశాడు. ఇక ఎనిమిదో సీజన్లో మళ్లీ డ్వేన్ బ్రావో పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు. ఆ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బరిలోకి దిగిన బ్రావో 26 వికెట్లు తీశాడు. తొమ్మిదో సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు.
ఆ సీజన్లో భువి 17 మ్యాచ్‌ల్లో 23 వికెట్లు తీశాడు. ఆ మరుసటి ఏడాది అంటే పదో సీజన్లో కూడా భువనేశ్వర్ కుమారే పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు. 2017లో 14 మ్యాచ్‌లాడిన భువి 26 వికెట్లు తీశాడు. ఇలా ఐపీఎల్‌లో వరుసగా రెండు సీజన్లలో పర్పుల్ క్యాప్ గెలుచుకున్న తొలి బౌలర్‌గా భువనేశ్వర్ కుమార్ రికార్డు సృష్టించాడు.

గత సీజన్లో ఎవరంటే..
ఇక 11వ సీజన్లో పర్పుల్ క్యాప్‌ను ఆండ్రూ టై గెలుచుకున్నాడు. ఆ సీజన్లో టై 14 మ్యాచ్‌ల్లో 24 వికెట్లు తీశాడు. 12వ సీజన్లో చెన్నైసూపర్ కింగ్స్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్ పర్పుల్ క్యాప్‌ను అందుకున్నాడు. ఆ సీజన్లో 17 మ్యాచ్‌ల్లో తాహీర్ 26 వికెట్లు తీశాడు. ఇక 13వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ పేస్ బౌలర్ కగిసో రబాడ పర్పుల్ క్యాప్‌ను అందుకున్నాడు. ఆ సీజన్లో 13 మ్యాచ్‌లాడిన రబాడ 30 వికెట్లు తీశాడు. చివరగా 2021లో జరిగిన 15వ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు హర్షల్ పటేల్ పర్పుల్ క్యాప్‌ను గెలుచుకున్నాడు. గత సీజన్లో హర్షల్ పటేల్ 32 వికెట్లు తీశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications