IPL 2022: రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ అద్భుతం.. ఆ ఒక్కటి అధిగమిస్తే తిరుగుండదు: మలింగ

సీనియర్లు, జూనియర్ల కలయికతో తమ జట్టు బౌలింగ్ యూనిట్ బలంగా ఉందని రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ కోచ్ లసిత్ మలింగ చెబుతున్నాడు. కాగా ముంబై ఇండియన్స్ మాజీ పేసరైనా లసిత్ మలింగ ఈ సారి ఐపీఎల్‌లో సరికొత్త అవతారంలో కనిపించనున్నాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టు విజయవంతం కావడంలో ఆటగాడిగా కీలక పాత్ర పోషించిన మలింగ ఇకపై కొచ్ అవతారంలో కనిపించబోతున్నాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ కోచ్‌గా ఐపీఎల్ 2022లో మలింగ కనిపించనున్నాడు.

సీనియర్లు, జూనియర్లతో బలంగా బౌలింగ్
అంతర్జాతీయ పేసర్లతో తమ జట్టు పేస్ బౌలింగ్ యూనిట్ బలంగా ఉందని రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ కోచ్ లసిత్ మలింగ పేర్కొన్నాడు. ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా మెరుగ్గా రాణించేలా తమ బౌలర్లను తీర్చిదిద్దనున్నట్లు చెప్పుకొచ్చాడు. జట్టులో ట్రెంట్ బోల్ట్, కౌల్టర్ నైల్ వంటి సీనియర్ పేసర్లతోపాటు ప్రసిద్ధ్ కృష్ణ, నవదీప్ సైనీ వంటి యువ పేసర్లు కూడా ఉన్నారని తెలిపాడు. అయితే చాలా మంది ప్రత్యర్థి జట్టులోని బలహీనతలపై దృష్టి పెడుతుంటారని, కానీ అలా కాకుండా తన అనుభవం ప్రకారం తమలోని బలహీనతంలను అధిగమించి బౌలింగ్ చేస్తే అత్యుత్తమ ఫలితాలని రాబట్టవచ్చని ఆయన చెప్పాడు.

వారికి మార్గనిర్దేశం చేయడమే నా పని
ఐపీఎల్‌లో బౌలర్లు ఇచ్చే కొన్ని అనవసర పరుగులే మ్యాచ్ ఫలితాన్ని మార్చేస్తాయని, కోచ్‌గా బౌలర్లు ఆ తప్పులు చేయకుండా వారికి మార్గ నిర్దేశం చేయడమే తన పని అని మలింగ తెలిపాడు. ఐపీఎల్‌లో దాదాపు అన్ని జట్లు సమతూకంగా ఉంటాయని, తాము ఆటను ఎలా అర్థం చేసుకుంటామనేది కీలకంగా ఉంటుందని ఆయన చెప్పాడు. కోచ్‌గా బాధ్యతలు చేపట్టడం, బౌలర్‌గా తనకున్న అనుభవాన్ని యువ ప్లేయర్లతో పంచుకోవడం కొత్తగా ఉందని అన్నాడు. యువ ఆటగాళ్లతో కలిసి పని చేయడాన్ని ఆస్వాదిస్తున్నట్లు తెలిపాడు. నిజానికి గతేడాదే హెడ్ కోచ్ సంగక్కర ఆసక్తి ఉంటే రాజస్థాన్ రాయల్స్‌కు బౌలింగ్ కోచ్‌గా చేరాలని కోరినట్టు తెలిపాడు. కానీ కరోనా కారణంగా చేరలేకపోయానని మలింగ వివరించాడు.

మలింగ రికార్డులు
ఐపీఎల్‌లో 122 మ్యాచ్‌లాడిన లసిత్ మలింగ్ 170 వికెట్లు తీశాడు. అత్యుత్తమ గణాంకాలు 5/13గా ఉన్నాయి. ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో 30 టెస్టుల్లో 101 వికెట్లు, 226 వన్డేల్లో 338 వికెట్లు, 84 టీ20 మ్యాచ్‌ల్లో 107 వికెట్లు తీశాడు.

రాజస్థాన్ రాయల్స్ పూర్తి జట్టు
సంజూ శాంసన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్, రియాన్ పరాగ్, కెసి కరియప్ప, ఒబెద్ సైని, నవ్‌దీప్ సైని సింగ్, కుల్దీప్ సేన్, కరుణ్ నాయర్, ధృవ్ జురెల్, తేజస్ బరోకా, కుల్దీప్ యాదవ్, శుభమ్ గర్వాల్, జేమ్స్ నీషమ్, నాథన్ కౌల్టర్-నైల్, రాస్సీ వాన్ డెర్ డుసెన్, డారిల్ మిచెల్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications