Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2022: చైనామ‌న్ ఇజ్ బ్యాక్‌.. ముంబై ఇండియ‌న్స్‌ను ముప్ప‌తిప్ప‌లు పెట్టిన కుల్దీప్ యాద‌వ్‌

IPL 2022: Chinaman Spinner Kuldeep yadav Is Back.. 3-18 VS Mumbai Indians

ముంబై: టీమిండియా చైనామ‌న్ స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్ చాలా రోజుల త‌ర్వాత త‌న‌దైన స్టైల్‌లో చెల‌రేగాడు. ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌ర‌ఫున బ‌రిలోకి దిగిన కుల్దీప్ యాద‌వ్‌.. త‌న క‌ట్టుదిట్ట‌మైన బంతుల‌తో ప్ర‌త్య‌ర్థుల‌కు ప‌రుగులు రాకుండా క‌ట్ట‌డి చేయ‌డంతోపాటు కీల‌క వికెట్లు తీశాడు. దీంతో మ్యాచ్ మొత్తంలో ముంబై ఇండియ‌న్స్ బ్యాట‌ర్ల‌ను కుల్దీప్ యాద‌వ్ ముప్ప‌తిప్ప‌లు పెట్టాడ‌ని చెప్పుకోవాలి. కాగా ఫిట్‌నెస్ స‌మ‌స్యల‌తో కొంత‌కాలం టీమిండియాకు దూరంగా కుల్దీప్ యాద‌వ్ జ‌ట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన‌ప్ప‌టికీ తుది జ‌ట్టులో స‌రైన అవ‌కాశాలు రావ‌డం లేదు. దీనికి తోడు కుల్దీప్ గ‌తంలో మాదిరిగా రాణించ‌లేక‌పోతున్నాడు. అయితే తాజా ఫ‌ర్‌ఫామెన్స్‌తో మ‌ళ్లీ కుల్దీప్ యాద‌వ్ ఇజ్ బ్యాక్ అనిపించాడు.

రోహిత్‌ను ఔట్ చేసిన కుల్దీప్‌

రోహిత్‌ను ఔట్ చేసిన కుల్దీప్‌

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియ‌న్స్‌కు ఓపెన‌ర్లు రోహిత్ శ‌ర్మ‌, ఇషాన్ కిష‌న్ శ‌భారంభాన్ని అందించారు. వీరిద్ద‌రు తొలి వికెట్‌కు హాఫ్ సెంచ‌రీ భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. దూకుడుగా ఆడుతూ రోహిత్ శ‌ర్మ హాఫ్ సెంచ‌రీకి చేరువ‌య్యాడు. ఈ క్ర‌మంలో బౌలింగ్‌కు వ‌చ్చిన కుల్దీప్ యాద‌వ్ ముంబై దూకుడుకు క‌ళ్లెం వేశాడు. క్రీజులో చ‌క్క‌గా కుదురుకున్న రోహిత్ శ‌ర్మ‌ను ఫెమిలియ‌న్ చేర్చాడు. కుల్దీప్ యాద‌వ్ వేసిన బంతిని భారీ షాట్ ఆడే క్ర‌మంలో బౌండ‌రీ లైన్ వ‌ద్ద ఫీల్డింగ్ చేస్తున్న రోవ్మాన్ పావెల్‌కు హిట్‌మ్యాన్ దొరికిపోయాడు. దీంతో ఢిల్లీకి తొలి వికెట్ ల‌భించింది. హిట్‌మ్యాన్ 32 బంతులు ఎదుర్కొని 41 ప‌రుగులు చేశాడు.

డెత్ ఓవ‌ర్ల‌లో పొలార్డ్ వికెట్‌

అదే దూకుడును క‌న‌బ‌రుస్తూ ముంబై బ్యాట‌ర్లకు ప‌రుగులు రానీయ‌కుండా కుల్దీప్ యాద‌వ్ క‌ట్ట‌డి చేశాడు. అదే దూకుడుతో ఆ త‌ర్వాతి ఓవ‌ర్లోనే అన్మోల్‌ప్రీత్ సింగ్‌ను ఫెమిలియ‌న్ పంపాడు. 9 బంతులు ఎదుర్కొని 8 ప‌రుగులు చేసిన అన్మోల్‌ప్రీత్ సింగ్‌.. ఇన్నింగ్స్ 11వ ఓవ‌ర్లో ల‌లిత్ యాద‌వ్‌కు క్యాచ్ ఇచ్చి ఔట‌య్యాడు. కుల్దీప్ యాద‌వ్‌పై న‌మ్మ‌కం ఉంచిన ఢిల్లీ కెప్టెన్ రిష‌బ్ పంత్ డెత్ ఓవ‌ర్ల‌లో అత‌నికి బౌలింగ్ ఇచ్చాడు. ఇంకేముందు అప్ప‌టికే రెండు వికెట్ల‌తో ఊపు మీదున్న కుల్దీప్ యాద‌వ్ అదే ఊపుతో

ముంబై ఇండియ‌న్స్ డెత్ ఓవ‌ర్ల స్పెష‌లిస్ట్ కీర‌న్ పొలార్డ్‌ను ఔట్ చేశాడు. 6 బంతులు ఎదుర్కొన్న పొలార్డ్ 3 ప‌రుగులు మాత్ర‌మే చేసి సీఫెర్ట్‌కు క్యాచ్ ఇచ్చి ఔట‌య్యాడు. దీంతో పొలార్డ్ సాయంతో డెత్ ఓవ‌ర్ల‌లో భారీగా ప‌రుగులు సాధించాల‌ని భావించిన ముంబై ఆశ‌ల‌కు కుల్దీప్ యాద‌వ్ గండికొట్టాడు.

క‌ట్ట‌డి చేసిన కుల్దీప్ యాద‌వ్

మొత్తంగా 4 ఓవ‌ర్ల‌లో 18 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చిన కుల్దీప్ యాద‌వ్ 3 కీల‌క వికెట్లు తీసుకోని ముంబై ఇండియ‌న్స్‌ను దెబ్బ కొట్టాడు. మిగ‌తా బౌల‌ర్లంతా భారీగా ప‌రుగులు ఇచ్చిన‌ప్ప‌టికీ కుల్దీప్ యాదవ్ మాత్రం ముంబై బ్యాట‌ర్ల‌ను ముప్ప‌తిప్ప‌లు పెట్టాడు. అయితే ముంబై ఓపెన‌ర్ ఇషాన్ కిష‌న్ రాణించ‌డంతో ఆ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 177 ప‌రుగులు చేసింది. 81 ప‌రుగుల అజేయ ఇన్నింగ్స్‌తో ఇషాన్ కిష‌న్ దుమ్ములేపాడు.

Story first published: Sunday, March 27, 2022, 17:57 [IST]
Other articles published on Mar 27, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+