Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2022: మెగా వేలంలో ఐదుగురు స్టార్‌ ఆట‌గాళ్ల‌పై సీఎస్కే క‌న్ను! ధ‌ర ఎంతంటే..

IPL 2022: Chennai Super Kings will buy five star players in a mega auction.

బెంగ‌ళూరు: ఐపీఎల్ మెగా వేలానికి స‌మయం ఆస‌న్న‌మైంది. ఈ శ‌నివారం, ఆదివార‌మే వేలం జ‌ర‌గ‌నుంది. ఫ్రాంచైజీల‌న్నీ కూడా తాము కొనుగోలు చేయాల్సిన ఆట‌గాళ్ల జాబితాను సిద్ధం చేసి పెట్టుకున్నాయి. ఈ క్ర‌మంలో ఆయా ప్రాంచైజీలు క‌చ్చితంగా కొనుగోలు చేయాల‌ని ఫిక్స్ అయినా ప‌లువురు ఆట‌గాళ్ల వివ‌రాలు బ‌య‌టికి వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే చెన్నైసూప‌ర్ కింగ్స్ క‌చ్చితంగా కొనుగోలు చేయాల‌ని నిర్ణ‌యించుకున్న ఐదుగురు ఆట‌గాళ్ల వివారాలు ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారాయి.

వార్న‌ర్‌, ప‌డిక్క‌ల్‌పై క‌న్ను

వార్న‌ర్‌, ప‌డిక్క‌ల్‌పై క‌న్ను

మెగా వేలంలో ఇద్ద‌రు స్టార్ ఓపెన‌ర్లను కొనుగోలు చేయాల‌ని చెన్నైసూప‌ర్ కింగ్స్ యజ‌మాన్యం నిర్ణ‌యించుకుంద‌ని స‌మాచారం. ఈ క్ర‌మంలో ఆస్ట్రేలియా డ్యాషింగ్ ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్‌, గ‌త సీజ‌న్లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు త‌ర‌ఫున రాణించిన దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్‌ను వేలంలో కొనుగోలు చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు స‌మాచారం. ఈ ఇద్ద‌రికీ ఐపీఎల్‌లో మంచి రికార్డులు ఉన్నాయి. ఐపీఎల్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 150 మ్యాచ్‌లు ఆడిన వార్న‌ర్ 41 స‌గటుతో 5449 ప‌రుగులు చేశాడు. ఇక ఐపీఎల్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 29 మ్యాచ్‌లాడిన ప‌డిక్క‌ల్‌ 31 స‌గ‌టుతో 884 ప‌రుగులు చేశాడు.

ర‌బాడ‌, ప్ర‌సిద్ధ్ కృష్ణ కొనుగోలు

ర‌బాడ‌, ప్ర‌సిద్ధ్ కృష్ణ కొనుగోలు

అలాగే ఇద్ద‌రు స్టార్ పేస‌ర్ల‌ను కూడా మెగా వేలంలో క‌చ్చితంగా కొనుగోలు చేయాల‌ని చెన్నైసూప‌ర్‌కింగ్స్ నిర్ణ‌యించుకుంద‌ట‌. ఈ క్ర‌మంలోనే సౌతాఫ్రికా పేస‌ర్ క‌గిసో ర‌బాడ‌, టీమిండియా యువ పేస‌ర్ ప్ర‌సిద్ధ్ కృష్ణ‌ను కొనుగోలు చేయ‌నుంద‌ట‌. ఇప్ప‌టికే ర‌బాడ తాను ఎంటో నిరూపించుకోగా.. ఇటీవ‌ల అంత‌ర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన భార‌త యువ పేస‌ర్ ప్ర‌సిద్ధ్ కృష్ణ వెస్టిండీస్‌తో సిరీస్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. దీంతో వీరిద్ద‌రిని మెగా వేలంలో చెన్నైసూప‌ర్ కింగ్స్ కొనుగోలు చేయ‌నుంద‌ని స‌మాచారం. ఐపీఎల్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 50 మ్యాచ్‌లు ఆడిన ర‌బాడ 76 వికెట్లు తీశాడు. ఇప్ప‌టివ‌ర‌కు 34 మ్యాచ్‌లు ఆడిన ప్ర‌సిద్ధ్ కృష్ణ 30 వికెట్లు తీశాడు.

వాషింగ్ట‌న్ సుంద‌ర్‌పై క‌న్ను

వాషింగ్ట‌న్ సుంద‌ర్‌పై క‌న్ను

ఇటీవ‌ల భార‌త జ‌ట్టులో రాణిస్తున్న యువ ఆల్‌రౌండ‌ర్ వాషింగ్ట‌న్ సుంద‌ర్‌ను మెగా వేలంలో కొనుగోలు చేయ‌డానికి సీఎస్కే ఆస‌క్తి క‌న‌బ‌రుస్తోంద‌ట‌. సుంద‌ర్ జ‌ట్టులో ఉంటే బ్యాటింగ్‌, బౌలింగ్‌లో ఆల్‌రౌండ‌ర్‌గా ఉప‌యోగ‌ప‌డ‌తాడ‌ని భావిస్తోంద‌ట‌. దీనికి తోడు సుంద‌ర్ ప్ర‌స్తుతం అంత‌ర్జాతీయ క్రికెట్‌లో రాణిస్తున్నాడు. కెరీర్‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఐపీఎల్‌లో 42 మ్యాచ్‌లు ఆడిన సుంద‌ర్ 217 ప‌రుగులు చేశాడు. బౌలింగ్‌లో 27 వికెట్లు తీశాడు.

ధ‌ర ఎంతంటే..

ధ‌ర ఎంతంటే..

మెగా వేలంలో డేవిడ్ వార్న‌ర్ కోసం 12 కోట్ల రూపాయ‌ల‌కు పైగా వెచ్చించ‌డానికి చెన్నైసూప‌ర్ కింగ్స్ సిద్ధంగా ఉంద‌ట‌. అలాగే యువ ఓపెన‌ర్ ప‌డిక్క‌ల్ కోసం 8 కోట్ల రూపాయ‌లు వెచ్చించ‌నుంద‌ట‌. పేస్ బౌల‌ర్లు ర‌బాడ‌కు 8 కోట్ల రూపాయ‌లు, ప్ర‌సిద్ధ్ కృష్ణ‌కు 8 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు చెల్లించాల‌ని సీఎస్కే నిర్ణ‌యించుకుంద‌ట‌. అలాగే ఆల్‌రౌండ‌ర్ వాషింగ్ట‌న్ సుంద‌ర్ కోసం 6 కోట్ల‌ నుంచి 8 కోట్ల రూపాయ‌లు చెల్లించాని చెన్నైసూప‌ర్ కింగ్స్ నిర్ణయించుకుంద‌ని స‌మాచారం.

Story first published: Thursday, February 10, 2022, 22:01 [IST]
Other articles published on Feb 10, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+