Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2022: CSK vs PBKS హెడ్ టూ హెడ్ రికార్డుల్లో తోపు ఎవ‌రంటే..

IPL 2022: Chennai super kings vs Punjab kings Head to Head Records

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2022లో నేడు మ‌రో ఆస‌క్తిర పోరు జ‌ర‌గ‌బోతుంది. డిఫెండింగ్ ఛాంపియ‌న్‌ చెన్నై సూప‌ర్ కింగ్స్‌, పంజాబ్ కింగ్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. ముంబైలోని బ్ర‌బోర్న్ స్టేడియం వేదిక‌గా రాత్రి 7:30 గంట‌ల‌కు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేప‌థ్యంలో ఐపీఎల్‌లో ఇరు జ‌ట్ల హెడ్ టూ హెడ్‌ రికార్డుల‌ను ఒక‌సారి ప‌రిశీలిద్దాం.

ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌, చెన్నైసూప‌ర్ కింగ్స్ ఇప్ప‌టివ‌ర‌కు 25 సార్లు త‌ల‌ప‌డ్డాయి. ఇందులో చెన్నైసూప‌ర్ కింగ్స్ అత్య‌ధికంగా 15 మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించింది. ఇక పంజాబ్ కింగ్స్ 10 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఇరు జ‌ట్లు త‌ల‌ప‌డిన‌ప్పుడు ఓ మ్యాచ్‌లో అత్య‌ధికంగా చెన్నైసూప‌ర్ కింగ్స్ 240 ప‌రుగులు సాధిస్తే.. పంజాబ్ కింగ్స్ 231 ప‌రుగులు చేసింది. ఇక అత్య‌ల్పంగా చెన్నై 107, పంజాబ్ 92 ప‌రుగులు చేశాయి.

ఇక గ‌త చివ‌రి 5 మ్యాచ్‌ల్లోనూ పంజాబ్‌పై చెన్నైదే పైచేయిగా ఉంది. గ‌త 5 మ్యాచ్‌ల్లో చెన్నై 4 గెల‌వ‌గా.. పంజాబ్ ఒక‌టే గెలిచింది. గ‌తేడాది త‌ల‌ప‌డిన రెండు మ్యాచ్‌ల్లో ఇరు జ‌ట్లు చెరోటి గెల‌వ‌గా.. 2020లో మాత్రం రెండు సార్లు సీఎస్కేనే గెలిచింది. ఇక నేటి మ్యాచ్ విష‌యానికొస్తే ఇరు జ‌ట్లు గెలుపే ల‌క్ష్యంగా బ‌రిలోకి దిగుతున్నాయి. సీజ‌న్లో ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క మ్యాచ్ కూడా గెల‌వ‌ని చెన్నై ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి బోణి చేయాల‌ని భావిస్తోంది. పంజాబ్ మాత్రం చెన్నైని ఓడించి త‌మ రికార్డును మెరుగు ప‌రచుకోవాల‌ని వ్యూహాలు ర‌చిస్తోంది.

IPL 2022: Chennai super kings vs Punjab kings Head to Head Records

తుది జ‌ట్లు (అంచ‌నా)
చెన్నైసూప‌ర్ కింగ్స్‌: రాబిన్ ఊత‌ప్ప‌, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, శివ‌మ్ దూబే, అంబ‌టి రాయుడు, ర‌వీంద్ర జ‌డేజా (కెప్టెన్), మ‌హేంద్ర సింగ్ ధోని (వికెట్ కీప‌ర్), డ్వైన్ ప్రిటోరియస్, డ్వేన్ బ్రావో, తుషార్ పాండే, రాజవర్ధన్ హంగర్గేకర్‌.

పంజాబ్ కింగ్స్‌: మ‌యాంక్ అగ‌ర్వాల్, శిఖ‌ర్ ధావ‌న్, బెయిర్‌స్టో, భానుక రాజ‌ప‌క్స, రాజ్ బవా, షారూక్ ఖాన్‌, హర్‌ప్రీత్ బ్రార్, ఓడియ‌న్ స్మిత్, రాహుల్ చాహ‌ర్, క‌గిసో రబాడ‌, అర్ష్‌దీప్ సింగ్.

Story first published: Sunday, April 3, 2022, 13:04 [IST]
Other articles published on Apr 3, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+