
చెన్నై పరిస్థితేంటీ..?
ముంబై ఇండియన్స్‌తో పోల్చుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి కొంత బెటర్. 11 మ్యాచ్‌ల్లలో నాలుగింట్లో విజయాలను అందుకుంది. అదే 11 మ్యాచ్‌లను ఆడిన ముంబై ఇండియన్స్ గెలిచింది రెండే. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ ఖాతాలో ఎనిమిది పాయింట్లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిస్తే 10 పాయింట్లతో ప్లేఆఫ్స్ రేసులో దూసుకొచ్చేస్తుంది. ఏకంగా ఆరో స్థానానికి ఎగబాకుతుంది. ప్రస్తుతం ధోనీ సేన తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది. ఆరో స్థానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఉంది.

గెలిస్తే.. నిలిచినట్టే
తన చివరి మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్‌పై ఏకంగా 91 పరుగుల తేడాతో విజయం సాధించిన అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ ఆశలు కొంత మెరుగుపడ్డాయి. ముంబై ఇండియన్స్‌తో పాటు మిగిలిన మ్యాచ్‌లల్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్‌పై అదే రేంజ్ రన్‌రేట్‌తో విజయం సాధించగలిగితే అద్భుతం జరిగే అవకాశాలు లేకపోలేదు. ఈ మూడింట్లో నెగ్గడం వల్ల మొత్తం 14 పాయింట్లు ప్లస్ మెరుగైన రన్‌రేట్‌తో సీఎస్‌కే ప్లేఆఫ్స్‌లో చేరుతుందనడంలో సందేహాలు అక్కర్లేదు.

అలా జరిగితే..
చెన్నై సూపర్ కింగ్స్ గెలిస్తే.. ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ అవకాశాలకు తెరపడుతుంది. ఈ సీజన్ నుంచి వైదొలగిన మొట్టమొదటి జట్టుగా ఆవిర్భవిస్తుంది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ గెలిస్తే- చెన్నై సూపర్ కింగ్స్ కథ కంచికి చేరినట్టే. ప్లేఆఫ్స్ అవకాశాలకు తెర పడినట్టే అవుతుంది. ముంబైపై ఓడిపోయి.. తన తరువాతి మ్యాచ్‌లల్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్‌పై గెలిచినా.. పాయింట్ల సంఖ్య 12కే పరిమితమౌతుంది.

ముంబైకి ఒరిగేదేమీ ఉండదు..
ముంబై ఇండియన్స్ గెలిచినా పెద్దగా ఒరిగేదేమీ ఉండదు. ముంబై ఖాతాలో ఉన్నవి నాలుగు పాయింట్లు.. చెన్నైతో కలుపుకొని చేతిలో ఉన్న మ్యాచ్‌లు మూడు. సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ కేపిటల్స్‌తో ఆడాల్సి ఉంది. ఈ మూడింట్లో గెలిచినా గానీ 10 పాయింట్ల వద్దే దాని ప్రస్థానం ఆగిపోతుంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్.. ఈ టోర్నమెంట్‌లో తన జర్నీని ముందుకు కొనసాగించేలా ముంబై ఇండియన్స్ హెల్ప్ చేస్తుందా? లేక ఆ అవకాశాలను డెస్ట్రాయ్ చేస్తుందా? అనేది ఈ రాత్రికి తేలిపోతుంది.


Click it and Unblock the Notifications
