For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

CSK vs GT Playing 11: చెన్నై సూపర్ కింగ్స్ జైత్రయాత్ర కొనసాగించేనా: తుదిజట్టు అంచనాలివే

IPL 2022: Chennai Super Kings Playing 11 vs Gujarat Titans: Here is the details of the both teams

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా ఈ సాయంత్రం మరో ఆసక్తికరమైన మ్యాచ్ జరుగనుంది. చెన్నై సూపర్ కింగ్స్- హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. నాలుగు వరుస పరాజయాల తరువాత అయిదో మ్యాచ్‌లో ఎట్టకేలకు ఓ విజయాన్ని అందుకుంది చెన్నై సూపర్ కింగ్స్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించింది.

గైక్వాడ్ ఫామ్‌పై ఆందోళన..

గైక్వాడ్ ఫామ్‌పై ఆందోళన..

ఇవ్వాళ్టి మ్యాచ్‌లో గుజరాత్‌పై విజయం సాధించడం ద్వారా తన జైత్రయాత్రను కొనసాగించాలని భావిస్తోంది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఫామ్.. చెన్నై సూపర్ కింగ్స్‌ను ఆందోళనకు గురి చేస్తోంది. స్టార్ ఓపెనర్‌గా గుర్తింపు పొందిన గైక్వాడ్ ఇప్పటివరకు ఒక్క భారీ ఇన్నింగ్ కూడా ఆడలేదు. అయిదు మ్యాచ్‌లల్లో అతను చేసింది 35 పరుగులు మాత్రమే. బ్యాటింగ్ యావరేజ్ ఏడు పరుగులు. ఇవ్వాళ్టి మ్యాచ్‌లో కూడా అతణ్నే నమ్ముకుంది చెన్నై. మార్పులు చేయకపోవచ్చు. గుజరాత్ టైటాన్స్ బౌలింగ్‌ను అతను ఎలా ఎదుర్కొంటాడనేది ఆసక్తికరం.

ఫుల్ స్వింగ్‌లో ఉతప్ప..

ఫుల్ స్వింగ్‌లో ఉతప్ప..

గైక్వాడ్‌కు పూర్తి భిన్నంగా సత్తా చాటుతున్నాడు మరో ఓపెనర్ రాబిన్ ఉతప్ప. భారీ షాట్లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై జరిగిన మ్యాచ్‌లో అతను ఎలా ఆడాడో ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. 50 బంతుల్లో 88 పరుగులు చేశాడు. శివం దుబేతో కలిసి 165 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ ఇద్దరి దెబ్బకు చెన్నై సూపర్ కింగ్స్ స్కోర్ బోర్డు 216 పరుగుల వద్దకు వెళ్లి ఆగింది. ఇప్పుడు కూడా రాబిన్ ఉతప్ప అలాంటి ఇన్నింగ్ ఆడే అవకాశాలు లేకపోలేదు.

మిడిలార్డర్‌లో వారిద్దరూ..

మిడిలార్డర్‌లో వారిద్దరూ..

మిడిలార్డర్‌లో అంబటి రాయుడు, శివందుబేతో బలంగా ఉంది చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ ఆర్డర్. తొలి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించిన తరువాత రాయుడు మళ్లీ ఆ స్థాయిలో ఆడలేదు. అతను బౌన్స్ బ్యాక్ కావాలని చెన్నై కోరుకుంటోంది. అదే సమయంలో శివం దుబే మరోసారి భారీ ఇన్నింగ్‌పై కన్నేసే అవకాశాలు లేకపోలేదు. రాయల్ ఛాలెంజర్స్‌పై చేసిన 95 పరుగుల భారీ ఇన్నింగ్‌ను పునరావృతం చేస్తే మాత్రం గుజరాత్‌కు భారీ టార్గెట్ తప్పకపోవచ్చు. క్రిస్ జోర్డాన్, రవీంద్ర జడేజా, మహీష్ తీక్షణ, డ్వేన్ బ్రావోలతో బౌలింగ్ డిపార్ట్‌మెంట్ సైతం బలంగా ఉంది.

ధీటుగా ఉన్న గుజరాత్..

ధీటుగా ఉన్న గుజరాత్..

గుజరాత్ టైటాన్స్ పరిస్థితి చెన్నై కంటే మెరుగ్గా ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉందీ జట్టు. అయిదు మ్యాచ్‌లల్లో ఓడింది ఒక్కటే. నాలుగింట్లో విజయం సాధించడం ద్వారా ఎనిమిది పాయంట్లను సాధించింది. టేబుల్‌ టాపర్‌గా ఉంది. శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా, మాథ్యూవేడ్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాతియా, లోకీ ఫెర్గూసన్, రషీద్ ఖాన్‌ వంటి మెరికల్లాంటి ప్లేయర్లు గుజరాత్‌లో ఉన్నారు. జట్టు మొత్తం సమష్టిగా రాణిస్తోంది. దీని ఫలితంగానే ఈ జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోంది. చెన్నై సూపర్ కింగ్స్‌పై ఎలా ఆడుతుందనేది రాత్రికి తేలిపోతుంది.

సీఎస్‌కే తుదిజట్టులో

సీఎస్‌కే తుదిజట్టులో

సీఎస్‌కే తుదిజట్టులో రాబిన్ ఉతప్ప, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, శివం దుబే, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా (కేప్టెన్), డ్వేన్ బ్రావో, క్రిస్ జోర్డాన్, తీక్షణ, ముఖేష్ చౌదరి ఆడొచ్చు. గుజరాత్ టైటాన్స్‌లో మాథ్యూవేడ్ (వికెట్ కీపర్), శుభ్‌మన్ గిల్, విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యా (కేప్టెన్), డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, యష్ దయాళ్, మహ్మద్ షమీ, లోకీ ఫెర్గూసన్ ఆడటం ఖాయంగా కనిపిస్తోంది.

Story first published: Sunday, April 17, 2022, 15:15 [IST]
Other articles published on Apr 17, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+