For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2022: చ‌రిత్ర సృష్టించ‌డానికి అడుగు దూరంలో బ్రావో.. నేడు మ‌లింగ రికార్డులు బ‌ద్ద‌లు!

IPL 2022: Chennai Super Kings bowler Dwayne Bravo will overtake Lasith Malinga as the highest wicket-taker in the IPL with one wicket.

చెన్నైసూప‌ర్ కింగ్స్ స్టార్ బౌల‌ర్ డ్వేన్ బ్రావో ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌)లో చ‌రిత్ర సృష్టించ‌డానికి అడుగు దూరంలో ఉన్నాడు. ఈ లీగ్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 170 వికెట్లు తీసిన బ్రావో ఇంకొక వికెట్ తీస్తే ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌల‌ర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టివ‌రకు అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్‌గా ఉన్న ల‌సిత్ మ‌లింగ రికార్డును డ్వేన్ బ్రావో బ‌ద్ద‌లు కొడ‌తాడు.

బ్రావో రికార్డు

బ్రావో రికార్డు

కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌తో జ‌రిగిన ఐపీఎల్ 2022 ఆరంభ మ్యాచ్‌లో చెన్నైసూప‌ర్ కింగ్స్ బౌల‌ర్ డ్వేన్ బ్రావో 3 వికెట్ల‌తో చెల‌రేగాడు. త‌ద్వారా ఐపీఎల్‌లో అత్య‌ధిక వికెట్లు ల‌సిత్ మ‌లింగ రికార్డును స‌మం చేశాడు. వీరిద్ద‌రు ఐపీఎల్‌లో 170 వికెట్లు తీశారు. అయితే నేడు ల‌క్నోసూప‌ర్ జెయింట్స్‌తో చెన్నైసూప‌ర్ కింగ్స్ ఆడ‌బోయే మ్యాచ్‌లో బ్రావో ఒక వికెట్ తీస్తే ఐపీఎల్‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్‌గా రికార్డు సృష్టిస్తాడు. కాగా ల‌సిత్ మలింగ్, డ్వేన్ బ్రావో ఇద్ద‌రు క‌లిసి గ‌తంలో ముంబై ఇండియ‌న్స్ త‌ర‌ఫున ఆడారు. 2009, 2010 సీజ‌న్ల‌లో బ్రావో, మ‌లింగ ముంబై ఇండియ‌న్స్‌కు ప్రాతినిధ్యం వ‌హించారు.

 మ‌లింగ‌, బ్రావో గ‌ణాంకాలు

మ‌లింగ‌, బ్రావో గ‌ణాంకాలు

ఐపీఎల్‌లో 2009 నుంచి 2019 వ‌ర‌కు ఆడిన ల‌సిత్ మ‌లింగ.. అన్ని సీజ‌న్ల‌లో ముంబై ఇండియ‌న్స్‌కే ప్రాతినిధ్యం వ‌హించాడు. ఈ క్ర‌మంలో 122 మ్యాచ్‌ల ఆడి 19.79 సగటుతో 170 వికెట్లు పడగొట్టాడు. ఎకాన‌మీ 7.14గా ఉంది. ఇక ఐపీఎల్‌లో 2008 నుంచి ఆడుతున్న డ్వేన్ బ్రావో ఇప్ప‌టివ‌ర‌కు 152 మ్యాచ్‌లాడి 24 స‌గ‌టుతో 170 వికెట్లు తీశాడు. ఎకాన‌మీ 8.33గా ఉంది. దీనిని బ‌ట్టి చూస్తే బ్రావో కంటే మలింగ గ‌ణాంకాలే మెరుగ్గా ఉన్నాయ‌ని చెప్పకోవాలి. పొదుపుగా బౌలింగ్ చేయ‌డంతోపాటు త‌క్కువ మ్యాచ్‌ల్లోనే ఈ మార్క్‌ను అందుకున్నాడు.

రెండు సార్లు ప‌ర్పుల్ క్యాప్‌

రెండు సార్లు ప‌ర్పుల్ క్యాప్‌

ఇక ఐపీఎల్‌లో బ్రావో రెండు సార్లు ప‌ర్పుల్ క్యాప్ అందుకున్నాడు. 2013లో 32 వికెట్ల‌తో, 2015లో 26 వికెట్ల‌తో అత‌ను ప‌ర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు. కాగా ఐపీఎల్‌లో భువ‌నేశ్వ‌ర్ కుమార్, డ్వేన్ బ్రావో మాత్ర‌మే రెండు సార్లు ప‌ర్పుల్ క్యాప్ అందుకున్నారు. 2006 నుంచి టీ20 క్రికెట్ ఆడుతున్న బ్రావో అంత‌ర్జాతీయ క్రికెట్‌తోపాటు అనేక లీగ్‌ల్లో పాల్గొన్నాడు. మొత్తంగా 523 మ్యాచ్‌లు ఆడిన బ్రావో 24.08 సగటుతో 574 వికెట్లు తీశాడు.

బ్రావో ప్రాతినిధ్యం వ‌హించిన జ‌ట్లు

బ్రావో ప్రాతినిధ్యం వ‌హించిన జ‌ట్లు

త‌న 16 ఏళ్ల క్రికెట్ కెరీర్లో బ్రావో చెన్నై సూపర్ కింగ్స్, చిట్టగాంగ్ కింగ్స్, కొమిల్లా విక్టోరియన్స్, ఢాకా డైనమైట్స్, డాల్ఫిన్స్, ఎసెక్స్, ఫార్చ్యూన్ బారిషల్, గుజరాత్ లయన్స్, కెంట్, లాహోర్ క్వాలండర్స్, మెల్బోర్న్ రెనెగేడ్స్, మెల్బోర్న్ స్టార్స్, ముంబై ఇండియన్స్, మిడిల్‌సెక్స్, క్వెట్టా గ్లాడియేటర్స్, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్, సర్రే, సిడ్నీ సిక్సర్స్, ట్రిన్‌బాగో నైట్ రైడర్స్, ట్రినిడాడ్ & టొబాగో, ట్రినిడాడ్ & టొబాగో రెడ్ స్టీల్, విక్టోరియా, వెస్ట్ ఇండియన్స్, వెస్టిండీస్ జ‌ట్ల‌కు టీ20ల్లో ప్రాతినిధ్యం వ‌హించాడు.

Story first published: Thursday, March 31, 2022, 15:09 [IST]
Other articles published on Mar 31, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+