Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చెన్నై కింగ్స్ స్టార్ బౌలర్ కేరీర్‌ను దెబ్బతీసిన గాయం: టీ20 ప్రపంచ కప్‌కూ దూరం

IPL 2022: Chennai Super Kings bowler Deepak Chahar out of the T20 World Cup as well
Deepak Chahar టీ20 ప్రపంచ కప్‌ ఆడటం డౌటే ..! | IPL 2022 | CSK | Oneindia Telugu

ముంబై: చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ గాయపడటం.. అతని కేరీర్‌ను దెబ్బతీసేలా కనిపిస్తోంది. ఇప్పటికే ఐపీఎల్ 2022 సీజన్‌కు దూరం అయ్యాడు. ఇక ఈ సంవత్సరం చివరలో ఆరంభం అయ్యే టీ20 ప్రపంచకప్‌కు సైతం అతను అందుబాటులో ఉండే అవకాశాలు ఏ మాత్రం లేవు. గాయం నుంచి కోలుకోవడానికి కనీసం నాలుగు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. అక్టోబర్-నవంబర్ మధ్యకాలంలో ఆస్ట్రేలియా టీ20 ప్రపంచకప్‌ను నిర్వహించనుంది.

దీపక్ చాహర్ ప్రస్తుతం మోకాలి గాయంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. క్వాడ్రిసెప్స్‌ ఫ్రాక్చర్ అయింది. దీనితో ఐపీఎల్ 2022 సీజన్ మొత్తానికీ దూరం అయ్యాడు. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ ఆడుతున్న సమయంలో అతని మోకాలికి గాయమైంది. దీనితో అతను బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో అతను ఫిట్‌నెస్ సాధిస్తున్నాడు. క్వాడ్రిసెప్స్ ఫ్రాక్చర్ నుంచి కోలుకున్న తరువాత వెన్నునొప్పి బారిన పడ్డాడు.

మోకాలి నొప్పి నుంచి ఉపశమనం లభించడంతో ఈ నెల చివరి నాటికి అతను జట్టుతో కలుస్తాడని చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్‌మెంట్ అంచనా వేసింది. దీని నుంచి కోలుకున్న తరువాత దీపక్ చాహర్ వెన్నునొప్పికి గురయ్యాడు. ఇది అతని కేరీర్ మీద తీవ్ర ప్రభావాన్ని చూపించే అవకాశాలు లేకపోలేదు. వెన్నునొప్పి ప్రభావం వల్ల కనీసం నాలుగు నెలల పాటు క్రికెట్‌కు దూరం కావాల్సి ఉంటుందని ఎన్సీఏ వర్గాలు చెబుతున్నాయి. విశ్రాంతి నుంచి కోలుకున్న తరువాత మళ్లీ ఫిట్‌నెస్ కోసం దీపక్ చాహర్ శ్రమించాల్సి ఉంటుంది.

ఐపీఎల్ 2022 మెగా వేలంపాట సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ 14 కోట్ల రూపాయలతో అతన్ని జట్టులోకి తీసుకుంది. ఇదివరకు కూడా అతను ఇదే జట్టుతో అసోసియేట్ అయి ఉన్నాడు. మెగా వేలం కోసం అతన్ని టీమ్ నుంచి విడుదల చేసింది. వేలంపాటలో మళ్లీ దీపక్ చాహర్‌ను తీసుకుంది. దీనికోసం 14 రూపాయలను సైతం ఖర్చు పెట్టడానికి వెనుకాడలేదు. గాయం అతణ్ని దెబ్బతీసింది. ఈ సీజన్ మొత్తానికీ అందుబాటులో లేకుండా పోయాడు.

Story first published: Thursday, April 14, 2022, 12:48 [IST]
Other articles published on Apr 14, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+