Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2022: సీఎస్కేకు కొత్త త‌ల‌నొప్పి.. వీసా స‌మ‌స్య‌ల‌తో తొలి మ్యాచ్‌కు స్టార్ ఆల్‌రౌండ‌ర్ దూరం!

IPL 2022: Chennai Super Kings all-rounder Moeen Ali is likely to miss the first match due to visa issues

మ‌రో 5 రోజుల్లో ఇండియన్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2022 ప్రారంభం కానుంద‌నే స‌మయంలో డిఫెండింగ్ ఛాంపియ‌న్ చెన్నైసూప‌ర్ కింగ్స్‌కు కొత్త త‌ల‌నొప్పి వ‌చ్చి ప‌డింది. ఇప్ప‌టికే ఆ జ‌ట్టు స్టార్ ఆట‌గాడు దీప‌క్ చాహ‌ర్ ఆరంభ మ్యాచ్‌ల‌కు దూరం కాగా, తాజాగా ఆ జ‌ట్టు స్టార్ ఆల్ రౌండ‌ర్ మొయిన్ అలీ కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌తో జ‌ర‌గ‌నున్న తొలి మ్యాచ్‌కు అందుబాటులో ఉండ‌డం అనుమానంగానే మారింది. ఎందుకంటే మొయిన్ అలీ ఇండియా రావ‌డానికి ఇప్ప‌టివ‌ర‌కు వీసా ల‌భించ‌లేదు. దీంతో అత‌ను ఇండియా ఎప్పుడొస్తాడ‌నే విష‌యంపై సందిగ్దం నెల‌కొంది.

అలీకి వీసా స‌మ‌స్యలు

అలీకి వీసా స‌మ‌స్యలు

ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండ‌ర్ మొయిన్ అలీకి 20 రోజులుగా ఇండియా రావ‌డానికి వీసా ల‌భించ‌డం లేదు. దీంతో అత‌ను ఇంకా ఇంగ్లండ్‌లోనే ఉన్నాడు. దీంతో మొయిన్ అలీ వీసా స‌మ‌స్య‌ల‌పై చెన్నై సూప‌ర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథ్ స్పందించారు. మొయిన్ అలీ ఫిబ్ర‌వ‌రి 28నే వీసా కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ట్లు చెప్పారు. 20 రోజులు గ‌డిచిన‌పోయినప్ప‌టికీ అత‌నికి ఇంకా వీసా రాలేద‌ని, దీనికి గ‌ల కార‌ణ‌మెంటో తెలియ‌ద‌ని ఆయ‌న తెలిపారు. నిజానికి అలీ త‌రచుగా ఇండియాకు వ‌స్తుంటాడ‌ని చెప్పారు. అయితో టోర్న‌మెంట్ ప్రారంభ‌మ‌వడానికి ముందే అలీ జ‌ట్టుతో చేరుతాడ‌ని ఆశిస్తున్న‌ట్లు తెలిపారు.

బీసీసీఐ ప్ర‌య‌త్నాలు

బీసీసీఐ ప్ర‌య‌త్నాలు

దీని కోసం బీసీసీఐ కూడా త‌న వంతు ప్ర‌య‌త్నాలు చేస్తుంద‌ని విశ్వ‌నాథ్ వివ‌రించారు. సోమ‌వారం నాటికి మెయిన్ అలీ వీసా స‌మ‌స్య ప‌రిష్కార‌మ‌వుతంద‌ని ఆశిస్తున్న‌ట్లు సీఎస్కే సీఈఓ తెలిపారు. కాగా అలీకి వీసా రావ‌డం మ‌రింత ఆల‌స్య‌మైతే అత‌ని ఆరంభ మ్యాచ్‌కు దూర‌మ‌య్యే అవ‌కాశాలు ఉన్నాయి. ఎందుకంటే నిబంధ‌న‌ల ప్ర‌కారం విదేశాల నుంచి వ‌చ్చే ఆట‌గాళ్లు 3 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలి. ఇది పూర్తి చేసుకోని అలీ జ‌ట్టులో చేరే స‌మ‌యానికి కోల్‌క‌తానైట్‌రైడ‌ర్స్‌తో చెన్నైసూప‌ర్ కింగ్స్ తొలి మ్యాచ్ అయిపోయే అవ‌కాశం ఉంది. దీంతో చెన్నైసూప‌ర్ కింగ్స్ అభిమానులు తెగ టెన్ష‌న్ ప‌డిపోతున్నారు. అలీ వీసా స‌మ‌స్య‌లు తొల‌గిపోయి త్వ‌ర‌గా ఇండియా రావాల‌ని కోరుకుంటున్నారు. కాగా మొయిన్ అలీని మెగా వేలానికి ముందే చెన్నైసూప‌ర్ కింగ్స్ జ‌ట్టు 8 కోట్ల రూపాయ‌ల‌కు రిటైన్ చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

 గుజరాత్‌ కోచింగ్ స్టాఫ్‌కు కూడా వీసా స‌మ‌స్య‌

గుజరాత్‌ కోచింగ్ స్టాఫ్‌కు కూడా వీసా స‌మ‌స్య‌

కొత్త జ‌ట్టు గుజ‌రాత్ టైటాన్స్ కోచింగ్ సిబ్బందిలోని మొయిన్, అబ్దుల్ నయీమ్ కూడా వీసా స‌మ‌స్య‌లను ఎదుర్కొంటున్నారు. ప్ర‌స్తుతం యూకేలో ఉన్న వీరిద్ద‌రు యూకేలో వీసా క్లియ‌రెన్స్ కోసం ఎదురుచూస్తున్నారు. త్వ‌రలోనే స‌మ‌స్య ప‌రిష్కార‌మై ఇండియా చేరుకుంటామ‌ని వారు ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు. కాగా న‌యీమ్ గ‌తంలో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌ కోచింగ్ స్టాఫ్‌లో కూడా ప‌నిచేశాడు. ఇక ఐపీఎల్ 15 ఎడిష‌న్ ఈ నెల 26 నుంచి ప్రారంభంకానుంద‌ని తెలిసిందే.

చెన్నైసూప‌ర్ కింగ్స్ పూర్తి జ‌ట్టు

చెన్నైసూప‌ర్ కింగ్స్ పూర్తి జ‌ట్టు

మ‌హేంద్ర సింగ్‌ ధోనీ (12 కోట్లు), రవీంద్ర జడేజా(16 కోట్లు), మొయిన్‌ అలీ 8 కోట్లు), రుతురాజ్‌ గైక్వాడ్‌( 6 కోట్లు), దీపక్‌ చాహర్‌( 14 కోట్లు), అంబటి రాయుడు(6.75 కోట్లు), డ్వేన్ బ్రావో (ఓవర్సీస్‌-4.40 కోట్లు), శివమ్ దూబే( 4 కోట్లు), క్రిస్‌ జొర్డాన్‌( 3.60 కోట్లు), రాబిన్ ఉతప్ప(2 కోట్లు), మిచెల్ సాంట్నర్ (ఓవర్సీస్ 1.90కోట్లు), ఆడమ్ మిల్నే (ఓవర్సీస్‌- 1.90 కోట్లు), విక్రమ్‌ సోలంకి(1.20 కోట్లు), రాజ్‌వర్థన్‌(1.50 కోట్లు), డేవన్‌ కాన్వే (ఓవర్సీస్‌- రూ. కోటి), మహీష్ తీక్షణ (ఓవర్సీస్ 70 లక్షలు), ప్రిటోరియస్ (ఓవర్సీస్ 50 లక్షలు), కేఎమ్‌ అసిఫ్, తుషార్‌ దేశ్‌పాండే, సిమర్‌జీత్‌ సింగ్, శుభ్రాన్ష్‌ సేనాపతి, ముకేశ్‌ చౌధరి, జగదీశన్‌, హరి నిషాంత్‌( వీరంద‌రికీ 20 లక్షలు)

Story first published: Sunday, March 20, 2022, 11:00 [IST]
Other articles published on Mar 20, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+