నేటి మ్యాచ్‌లో ఆండ్రూ సైమండ్స్‌కు నివాళిగా.. చెన్నై, గుజరాత్ ప్లేయర్లు ఏం చేశారంటే?

ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా 62వ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతోంది. 3.30గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కాగా తొలుత బ్యాటింగ్ ఎంచుకుని చెన్నై ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. ఇక గత మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిన చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఇప్పటికే తప్పుకోగా.. లక్నో సూపర్ జెయింట్స్‌పై అద్భుత విజయంతో గుజరాత్ టైటాన్స్ అన్ని జట్ల కన్నా ముందు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. 12మ్యాచ్‌ల్లో నాలుగు మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్‌లో చివరి నుంచి రెండో స్థానంలో ఉన్న చెన్నై మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిచి లీగ్‌ను కాస్త గౌరవప్రదంగా ముగించాలనుకుంటుంది.
మరోవైపు గుజరాత్ మాత్రం తమ లోపాలను సరిదిద్దుకుని మిగిలిన లీగ్ మ్యాచ్‌లు గెలిచి ప్లేఆఫ్ స్థానాల్లో టాప్ 2పొజిషన్లోకి వెళ్లాలని చూస్తోంది. ఇప్పటికే తొమ్మిది మ్యాచ్‌లు గెలిచిన గుజరాత్ 18 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఇక తాజా మ్యాచ్‌లో దివంగత ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం ఆండ్రూ సైమండ్స్‌కు నివాళిగా చెన్నై, గుజరాత్ జట్ల ఆటగాళ్లు చేతికి నల్లబ్యాండ్‌లు ధరించి మైదానంలోకి దిగారు. ఈ సందర్భంగా సైమండ్స్‌కు ప్రత్యేక నివాళులర్పించారు. సైమండ్స్ ఐపీఎల్లో డెక్కన్ ఛార్జర్స్ తరఫున ఆడిన సంగతి తెలిసిందే.

దిగ్భ్రాంతికి గురైన క్రికెట్ ప్రపంచం
ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ క్రికెటర్లలో ఒకరైన సైమండ్స్ శనివారం రాత్రి విషాదకరమైన రీతిలో కారు ప్రమాదంలో మరణించాడు. రెండుసార్లు ప్రపంచ కప్ గెలిచిన జట్టులో ప్లేయర్‌గా ఉన్న సైమండ్స్ మరణం పట్ల క్రికెట్ ప్రపంచం దిగ్ర్భాంతికి గురయ్యింది. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి 10:30గంటలకు హెర్వీ రేంజ్‌లో బోల్తా పడ్డ కారులో ఉన్న ఆండ్రూ సైమండ్స్ తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించి సైమండ్స్‌ను రక్షించేందుకు ప్రయత్నించినా ప్రమాదంలో తీవ్ర గాయాలైన సైమండ్స్ తుది శ్వాస విడిచారు.

ఆస్ట్రేలియా అత్యుత్తమ ఆల్ రౌండర్లలో సైమండ్స్ ఒకడు
ఆస్ట్రేలియా జట్టు ఇప్పటివరకు చూసిన అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో సైమండ్స్ ఒకడు. జట్టుకు అన్ని విభాగాల్లో కీలక ఆటగాడిగా ఉంటూ తాను ఆడే రోజుల్లో ఎన్నో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. సైమండ్స్ 1998లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. అతను 26 టెస్ట్ మ్యాచ్‌లు, 198 వన్డేలు, 14 టీ20లు ఆడాడు. అలాగే 165 వికెట్లు, 6887పరుగులు చేశాడు. 2003, 2007లో ఆస్ట్రేలియా ప్రపంచ కప్ గెలుపొందిన జట్టులో ఆల్రౌండర్‌గా ఉన్నాడు.

టీం భవిష్యత్తు దృష్ట్యా ధోనీ ప్రయోగాలు
ఇక తాజాగా జరుగుతున్న గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌లో చెన్నై జట్టులో ఏకంగా నాలుగు మార్పులు చోటుచేసుకున్నాయి. జట్టులోకి జగదీషన్, ప్రశాంత్ సోలంకి, సాంట్నర్, మతీషా రాగా.. రాబిన్ ఊతప్ప, అంబటి రాయుడు, డ్వేన్ బ్రావో, తీక్షణలను జట్టు నుంచి తప్పించి వారికి రెస్ట్ ఇచ్చినట్లు చెన్నై కెప్టెన్ ధోనీ తెలిపాడు. టీమ్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ఈ ప్రయోగాలు చేస్తున్నట్లు ధోనీ వెల్లడించారు.

తుది జట్లు(అంచనా)
సీఎస్‌కే: రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, మొయిన్ అలీ, ఎన్ జగదీషన్, శివం దూబే, ఎంఎస్ ధోనీ(కెప్టెన్), మిచెల్ సాంట్నర్, ప్రశాంత్ సోలంకి,, సిమ్రన్‌జిత్ సింగ్, మతీశ పత్రీణ, ముఖేశ్ చౌదరి
గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్, వృద్దిమాన్ సాహా(కీపర్), మాథ్యూ వేడ్, హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్ మహమ్మద్ షమీ, సాయి కిషోర్, యశ్ దయాల్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications