
ఐపీఎల్ 2022కు ఎక్కువగా టైం లేకపోవడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు మైదానంలో శ్రమిస్తున్నారు. గత సీజన్లో పాయింట్ల టేబుల్‌లో చివరన నిలిచి నిరాశ పరిచిన సన్‌రైజర్స్ ఈ సారి ఎలాగైనా సత్తా చాటాలనే లక్ష్యంతో శ్రమిస్తోంది. ఇందులో భాగంగానే జట్టు రెండు టీంలుగా వీడిపోయి ఓ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. ఈ రెండు టీంలకు కేన్ విలియమ్సన్, భువనేశ్వర్ కుమార్ కెప్టెన్లుగా వ్యవహరించారు. ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లో కేన్ మామ కొట్టిన ఓ సిక్సర్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. టి. నటరాజన్ బౌలింగ్‌లో కేన్ విలియమ్సన్ ఓ భారీ సిక్సు బాదాడు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడు చేయగా ప్రస్తుతం అది నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సిక్సర్‌తో కేన్ మామ ఫిట్‌నెస్‌పై ఉన్న అనుమానాలు కూడా తొలగిపోయాయి. కాగా గాయం కారణంగా కేన్ విలియమ్సన్ కొంత కాలంగా క్రికెట్‌కు దూరంగా ఉన్న సంగతి తెలసిందే. గాయం నుంచి కోలుకుని నేరుగా ఐపీఎల్‌లోనే ఆడనున్నాడు.
ఇక ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ టీం ఆటగాళ్లు రెండు టీంలుగా విడిపోయి తలపడ్డారు. మొదటి టీంకు కేన్ విలియమ్సన్ నాయకత్వం వహించగా.. మరో టీంకు భువనేశ్వర్ కుమార్ నాయకత్వం వహించాడు. మొదట బ్యాటింగ్ చేసిన విలియమ్సన్ టీం 146 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యాన్ని భువనేశ్వర్ కుమార్ 15 ఓవర్లలోనే చేధించి 6 వికెట్లు తేడాతో ఘనవిజయం సాధించింది. 30 బంతుల్లోనే 45 పరుగులతో నికోలస్ చెలరేగాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి టీం
కేన్ విలియంసన్, రాహుల్ త్రిపాఠి, నికోలస్ పూరన్, అయిడిన్ మాక్రమ్, వాషింగ్టన్ సుందర్, అబ్దుల్ సమద్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, కార్తీక్ త్యాగి, టి నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, ప్రియమ్ గార్గ్, జె సుచిత్, శ్రేయాస్ గోపాల్, అభిషేక్ శర్మ, రొమారియో షెఫర్డ్, సీన్ అబ్బాట్, ఆర్ సమర్థ్, శశాంక్ సింగ్, సౌరబ్ దూబే, విష్ణు వినోద్, గ్లెన్ ఫిలిప్స్, ఫజల్‌హక్ ఫరూకీ.