స్టేడియంలో వైల్డ్ సెలబ్రేషన్స్‌తో ఊగిపోయిన బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్

ఈ ఐపీఎల్ సీజన్లో సరిగ్గా ఒక నెల క్రితం ముంబై ఇండియన్స్ ప్లేయర్ డానియల్ సామ్స్ బౌలింగ్లో కోల్ కతా ఆల్ రౌండర్ పాట్ కమ్మిన్స్ ఒక ఓవర్‌లో 35పరుగులు బాది అద్భుత ఫినిషింగ్ ఇచ్చి కోల్‌కతాను గెలిపించాడు. ఓ వరల్డ్ క్లాస్ బౌలర్‌గా సామ్స్‌కు ఆ ఓవర్ ఓ పీడకలలాంటిదే. ముంబై ఇండియన్స్ ఈ సీజన్ ఓటములన్నింటిలో మరచిపోలేని ఓవర్ అది. ఆస్ట్రేలియా బౌలర్ అయిన డానియల్ సామ్స్ మీద మాత్రం ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ నమ్మకముంచాడు. క్రికెట్లో ఒక్కోసారి ఎంత మంచి బౌలర్ అయినా భారీగా పరుగులు సమర్పించుకునే రోజు ఉంటుంది. ఆ ఓవర్‌ను మర్చిపోయి నీ లయను అందుకుని బౌలింగ్ చేయాలని రోహిత్.. సామ్స్ వెన్నుతట్టాడు. రోహిత్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సామ్స్ నిన్నటి మ్యాచ్‌లో అద్భుతం చేశాడు.

అత్యుత్తమ జట్టుపై అద్భుత బౌలింగ్
చివరి ఓవర్లో 9పరుగులు అవసరమైన దశలో రోహిత్ బంతిని సామ్స్‌కు ఇచ్చి పలు సూచనలు చేశాడు. వైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్ మాత్రమే వేయాలంటూ సామ్స్‌కు చెప్పాడు. రోహిత్ సూచనలతో పాటు తన మెలకువలతో బౌలింగ్ చేసిన ఈ ఆస్ట్రేలియన్.. ఆఖరి ఓవర్‌లో తొమ్మిది పరుగులు డిఫెండ్ చేయడాన్ని సమర్థంగా పూర్తి చేశాడు. ఈ సీజన్లనే అత్యుత్తమ జట్టైన గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లను.. అది కాకుండా ఈ టోర్నమెంట్‌లో అత్యుత్తమ ఫినిషింగ్ స్టార్లు అయిన రాహుల్ తెవాతీయా, మిల్లర్, రషీద్ ఖాన్ లాంటి ప్లేయర్ల నుంచి పరుగులు రాకుండా అడ్డుకున్నాడు.
స్టేడియంలో సంబరాలు
ఆఖరి ఓవర్లో సామ్స్ రాహుల్ తెవాతీయా వికెట్ తీయడంతో పాటు చివరి ఓవర్‌లో కేవలం మూడు సింగిల్స్ మాత్రమే ఇచ్చాడు. దీంతో ముంబై 5పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. ఈ విజయం అనంతరం ముంబై ప్లేయర్లు, అభిమానులు ఎనలేని సంతోషంతో సంబరాలు చేసుకున్నారు. స్టేడియం మొత్తం ముంబై నామస్మరణతో మారుమ్రోగింది.
రణవీర్ సింగ్ సందడే సందడి
ఇక ఈ మ్యాచ్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన బాలీవుడ్ సూపర్ స్టార్ రణవీర్ సింగ్ ఆద్యంతం మ్యాచ్ వీక్షిస్తూ ముంబై జట్టును ఉత్సాహపరుస్తూనే ఉన్నాడు. బౌండరీలు కొట్టినప్పుడు సిక్సర్లు కొట్టినప్పడు సెలబ్రేట్ చేసుకుంటూ సందడి చేశాడు. ఇక చివరి ఓవర్లో ఉత్కంఠకర పరిస్థితుల్లో రణవీర్ సైతం నరాలు బిగపట్టి మ్యాచ్ వీక్షించాడు. తెవాతీయా ఔటయినప్పుడు, ఇక చివరి బంతికి గెలిచినప్పుడు కమాన్ అంటూ వైల్డ్ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఊగిపోయాడు.
రోహిత్, ఇషాన్, డేవిడ్ రాణించడంతో..
ఇక గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ముంబై ఇండియన్స్ ముందుగా బ్యాటింగ్ చేయగా.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 177 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(28 బంతుల్లో5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43), ఇషాన్ కిషన్(29 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 45), టీమ్ డేవిడ్ (21 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 44 నాటౌట్) రాణించారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 173 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. వృద్దిమాన్ సాహా(40 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 55), శుభ్‌మన్ గిల్(36 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 52) హాఫ్ సెంచరీలతో రాణించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications