For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బెన్ స్టోక్స్‌కు బెస్ట్ ఆఫర్: గుజరాత్ టైటాన్స్ కోచ్‌కు కూడా

IPL 2022: Ben Stokes is set to be the Test captain and Gary Kirsten is to be the coach of England

లండన్: ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌కు ఓ మంచి అవకాశం లభించబోతోంది. టెస్ట్ కేప్టెన్‌గా అపాయింట్ కాబోతోన్నాడు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడటమే ఆలస్యం. జో రూట్ వారసుడిగా బెన్ స్టోక్స్‌ను ఎంపిక చేస్తూ ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనుంది. కొత్త కేప్టెన్‌తో పాటు కొత్త కోచ్‌ను కూడా నియమించుకోనుంది ఇంగ్లాండ్. ఆ అవకాశాన్ని గ్యారీ కిర్‌స్టెన్‌కు కల్పించనుంది. ఇప్పటికే- కిర్‌స్టెన్ నియామకం పూర్తయినట్లు సమాచారం.

జో రూట్‌ కొద్ది రోజుల కిందటే తన టెస్టు కెప్టెన్సీ బాద్యతల నుంచి తప్పుకొన్న విషయం తెలిసిందే. యాషెస్‌ సిరీస్‌లో పరాభవం, వెస్టిండీస్‌ పర్యటనలో ఓటమికి బాధ్యత వహిస్తూ అతను ఈ నిర్ణయం తీసుకున్నాడు. అయిదు సంవత్సరాల పాటు రూట్.. ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. 64 టెస్ట్ మ్యాచ్‌లకు సారథ్యాన్ని వహించాడు జో రూట్. 27 మ్యాచ్‌లల్లో జట్టును గెలిపించాడు. 5,295 పరుగులు చేశాడు. ఇందులో 14 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

జో రూట్ కేప్టెన్సీలో వెస్టిండీస్‌తో 1-0 తో సిరీస్ ఓడింది ఇంగ్లాండ్‌. ఆస్ట్రేలియా చేతిలో యాషెష్ సిరీస్ వైట్ వాష్‌కు గురైంది. ఈ రెండు ఘోర పరాభవాలు అతని కేప్టెన్సీకి ఎసరు పెట్టాయి. తీవ్ర విమర్శలు చెలరేగడంతో కేప్టెన్సీని వదులుకున్నాడు. ప్రస్తుతం టెస్ట్ కేప్టెన్సీ స్థానం ఖాళీగా ఉంది. ఈ ఖాళీని బెన్ స్టోక్స్‌తో భర్తీ చేయాలని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు నిర్ణయించింది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అదే సమయంలో కొత్త కోచ్‌గా గ్యారీ కిర్‌స్టెన్‌ను సెలెక్ట్ చేసింది.

కాగా- గ్యారీ కిర్‌స్టెన్ ప్రస్తుతం ఐపీఎల్‌లో ఉన్నాడు. ఈ సీజన్‌లో అతను గుజరాత్ టైటాన్స్‌కు హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తోన్నాడు. ఈ సీజన్‌లోనే ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ వరుస విజయాలను సాధించడంలో కిర్‌స్టెన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌‌లను ఆడిన హార్దిక్ పాండ్యా టీమ్.. ఆరింట్లో ఘన విజయం సాధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో మాత్రమే ఓడింది. పాయింట్ల పట్టికలో ఈ టీమ్ రెండో స్థానంలో ఉంది. ఈ స్థానానికి ఎగబాకడంలో కిర్‌స్టెన్ కీలకంగా మారాడు.

Story first published: Wednesday, April 27, 2022, 13:45 [IST]
Other articles published on Apr 27, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+