For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2022 Schedule : క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. ఐపీఎల్ 2022 అధికారిక‌ షెడ్యూల్ వ‌చ్చేసింది!

IPL 2022: BCCI has officially announced the full schedule of IPL 15
IPL 2022 Schedule : Complete Fixtures And Full Details | Oneindia Telugu

క్రికెట్ అభిమానుల నిరీక్ష‌ణ‌కు తెర‌ప‌డింది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2022 పూర్తి షెడ్యూల్‌ను బీసీసీఐ అధికారికంగా ప్ర‌క‌టించింది. ఈ నెల 26 నుంచి ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంఫియ‌న్ చెన్నైసూప‌ర్ కింగ్స్‌తో కోల్‌క‌తానైట్ రైడ‌ర్స్ త‌ల‌ప‌డ‌నుంది. ముంబైలోని వాంఖ‌డే స్టేడియం వేదిక‌గా ఈ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. మే 22న స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్, పంజాబ్ కింగ్స్ మ‌ధ్య‌ జ‌రిగే మ్యాచ్‌తో లీగ్ ద‌శ ముగియ‌నుంది. మొత్తం 70 లీగ్ మ్యాచ్‌లు, 4 ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. మొత్తంగా 65 రోజుల‌పాటు క్రికెట్ అభిమానుల‌ను ఐపీఎల్ 15 ఎడిష‌న్ అల‌రించ‌నుంది.

పూర్తి షెడ్యూల్‌

రాత్రి జ‌రిగే మ్యాచ్‌ల‌న్నీ 7:30 గంట‌ల‌కు ప్రారంభం కానుండ‌గా.. సాయంత్రం జరిగే మ్యాచ్‌ల‌న్నీ 3:30 గంట‌ల‌కు ప్రారంభం కానున్నాయి. చెన్నైసూప‌ర్ కింగ్స్‌, కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ మ‌ధ్య ముంబైలోని వాంఖ‌డే స్టేడియం వేదిక‌గా జ‌ర‌గ‌నున్న‌ ఆరంభ మ్యాచ్‌తో ఐపీఎల్ మ‌హా సంగ్రామానికి తెర‌లేవ‌నుంది. ఈ లీగ్‌లో మొత్తం 12 డ‌బుల్ హెడర్ మ్యాచ్‌ల జ‌ర‌గ‌నున్నాయి. ఈ సారి కొత్తగా రెండు జ‌ట్లు చేర‌డంతో డ‌బుల్ హెడర్‌ మ్యాచ్‌ల సంఖ్య పెరిగింది. ఈ డ‌బుల్ హెడర్‌ మ్యాచ్‌ల‌న్నీ వారాంతంలో జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే.

తొలి డ‌బుల్ హెడర్ అప్పుడే

తొలి డ‌బుల్ హెడర్ మ్యాచ్ మార్చి 27న జ‌ర‌గ‌నుంది.సాయంత్రం 3:30 గంట‌ల‌కు జ‌ర‌గ‌నున్న ఈ తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌, ముంబై ఇండియ‌న్స్ త‌ల‌ప‌డ‌నున్నాయి. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో ఈ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఇక రాత్రి 7:30 గంట‌కు జ‌ర‌గ‌నున్న రెండో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌, రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు త‌ల‌ప‌డ‌నున్నాయి. డీవై పాటిల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

చివ‌రి మ్యాచ్ అప్పుడే

చివ‌రి మ్యాచ్ అప్పుడే

మొత్తం 70 లీగ్ మ్యాచ్‌ల జ‌ర‌గ‌నున్నాయి. మే 22న ముంబైలోని వాంఖ‌డే స్టేడియం వేదిక‌గా జ‌ర‌గ‌నున్న చివ‌రి లీగ్ మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, పంజాబ్ కింగ్స్ త‌ల‌ప‌డ‌నున్నాయి. కాగా ప్లేఆఫ్ మ్యాచ్‌ల షెడ్యూల్ బీసీసీఐ త‌ర్వాత ప్ర‌క‌టించనుంది. అయితే ప్లేఆఫ్ మ్యాచ్‌ల‌న్నీ కూడా అహ్మ‌దాబాద్ వేదిక‌గా నిర్వ‌హించ‌నున్న‌ట్లు బీసీసీఐ ఇప్ప‌టికే ఓ క్లారిటీ ఇచ్చింది. ఇక మే 29న జ‌రిగే ఫైన‌ల్ మ్యాచ్‌తో ఐపీఎల్ 15 ఎడిష‌న్ ముగియ‌నుంది.

కొత్త ఫార్మాట్‌లో లీగ్

కొత్త ఫార్మాట్‌లో లీగ్

ఈ సారి లీగ్‌లో జ‌ట్ల సంఖ్య పెర‌గ‌డంతో గ‌త సీజ‌న్ల మాదిరిగా కాకుండా ఈ సారి కొత్త ఫార్మాట్లో ఐపీఎల్ జ‌ర‌గ‌నుంది. ఇందుకోసం బీసీసీఐ లీగ్‌లో ఆయా జ‌ట్లు గెలిచిన టైటిళ్లు, ఫైనల్స్ చేరిన జ‌ట్ల ఆధారంగా 10 జ‌ట్ల‌ను రెండు గ్రూపులుగా విభ‌జించింది. దీని ప్రకారం గ్రూప్ ఏలో ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఉన్నాయి. మిగతా ఐదు జట్లైనా చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ గ్రూప్ బీలో భాగంగా ఉన్నాయి.

నాలుగు వేదిక‌ల్లో మ్యాచ్‌లు

నాలుగు వేదిక‌ల్లో మ్యాచ్‌లు

ముందుగా ధృవీకరించినట్లుగా ఐపీఎల్ 2022 అన్ని లీగ్ మ్యాచ్‌లు నాలుగు వేదికలలో జ‌ర‌గ‌నున్నాయి. పూణే, వాంఖడే, డీవై పాటిల్, బ్రబౌర్న్ స్టేడియం మెగా లీగ్‌కు అతిథ్యం ఇవ్వ‌నున్నాయి. కాగా మ్యాచ్‌ల‌ను చూడ‌డానికి బీసీసీఐ ప్ర‌స్తుతానికి 25 శాతం ముందిని స్టేడియంలోకి అనుమ‌తించింది. ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ఈ సంఖ్య‌ను 50 శాతానికి పెంచ‌నుంది.

Story first published: Sunday, March 6, 2022, 17:56 [IST]
Other articles published on Mar 6, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+