న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2022: సీఎస్కేలోకి ఆస్ట్రేలియా స్టార్ ప్లేయ‌ర్లు ఫించ్‌, ఖ‌వాజా, క‌మిన్స్‌! ధ‌ర ఎంతంటే..

IPL 2022: Australian players Aaron Finch, Usman Khawaja and Pat Cummins will play for Chennai Super Kings.
IPL 2022 Mega Auction: MS Dhoni కోసం CSK VS MI హోరాహోరీ, ఎగబడ్డ ఫ్రాంచైజీలు | Oneindia Telugu

బెంగ‌ళూరు: క్రికెట్‌ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ మెగా వేలానికి స‌మ‌యం ఆస‌న్న‌మైంది. ఈ శ‌నివారం, ఆదివార‌మే బెంగ‌ళూరు వేదిక‌గా వేలం జ‌ర‌గ‌నుంది. దీంతో క్రికెట్ అభిమానులంతా త‌మ అభిమాన జ‌ట్టు ఏ ఏ ఆట‌గాళ్ల‌ను వేలంలో కొనుగోలు చేస్తోందోన‌ని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్ర‌మంలో ఐపీఎల్‌లోని ప్ర‌ముఖ టీంల‌లో ఒక‌టైనా చెన్నైసూప‌ర్‌కింగ్స్ గురించి అభిమానులు ఎక్కువ‌గా చ‌ర్చించుకుంటున్నారు.

 సీఎస్కేలోకి ఆస్ట్రేలియా ప్లేయ‌ర్లు

సీఎస్కేలోకి ఆస్ట్రేలియా ప్లేయ‌ర్లు

ఈ క్ర‌మంలో మెగా వేలంలో మ‌హేంద్ర‌సింగ్ ధోని నేతృత్వంలోని చెన్నైసూప‌ర్ కింగ్స్ కొనుగోలు చేయ‌బోయే ఆట‌గాళ్లు గురించి ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది. బ‌య‌టికి వ‌స్తున్న వార్త‌ల ప్ర‌కారం మెగా వేలంలో ముగ్గురు ఆస్ట్రేలియా ప్లేయ‌ర్లు కొనుగోలు చేయాల‌ని సీఎస్కే భావిస్తోంద‌ట‌. సీఎస్కే కొనుగోలు చేయ‌బోయే ఆ ఆట‌గాళ్లు ఆస్ట్రేలియా కెప్టెన్లు ఆరోన్ ఫించ్‌, పాట్ క‌మిన్స్, ఉస్మాన్ ఖవాజా అని తెలుస్తోంది. ఈ ముగ్గురిని వేలంలో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ కొనుగోలు చేయాల‌ని సీఎస్కే నిర్ణ‌యించుకుంద‌ట‌.

 ఎందుకంటే..

ఎందుకంటే..

ఆస్ట్రేలియా ప‌రిమిత ఓవ‌ర్ల కెప్టెన్‌ ఆరోన్ ఫించ్‌ను జ‌ట్టులో చేర్చుకోవ‌డం ద్వారా త‌మ ఓపెనింగ్ విభాగం బ‌ల‌ప‌డుతుంద‌ని సీఎస్కే భావిస్తుంద‌ని స‌మాచారం. కాగా అంత‌ర్జాతీయ స్థాయిలో మంచి ఓపెన‌ర్‌గా ఫించ్ పేరు తెచ్చుకున్న సంగ‌తి తెలిసిందే. ఇక ఉస్మాన్ ఖ‌వాజా ద్వారా త‌మ మిడిల్ ఆర్డ‌ర్ బ్యాటింగ్ బ‌ల‌ప‌డుతుంద‌ని అనుకుంటుంద‌ట‌. ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ పాట్ క‌మిన్స్ ద్వారా త‌మ పేస్ విభాగం బ‌లంగా మారుతుంద‌ని సీఎస్కే భావిస్తోంద‌ని స‌మాచారం. కాగా ప్ర‌స్తుతం అంత‌ర్జాతీయ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో పాట్ క‌మిన్స్ అగ్ర స్థానంలో ఉన్న సంగ‌తి తెలిసిందే.

రికార్డులు

రికార్డులు

ఐపీఎల్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 85 మ్యాచ్‌లు ఆడిన ఆరోన్ ఫించ్ 25 స‌గ‌టుతో 2005 ప‌రుగులు చేశాడు. ఇందులో 14 హాఫ్ సెంచ‌రీలు ఉండ‌గా.. అత్య‌ధిక స్కోర్ 88 ప‌రుగులు. లీగ్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 37 మ్యాచ్‌లు ఆడిన క‌మిన్స్ 38 వికెట్లు తీశాడు. అత్యుత్త‌మ గ‌ణాంకాలు 4/34 గా ఉన్నాయి. ఐపీఎల్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 6 మ్యాచ్‌లు మాత్ర‌మే ఆడిన ఖ‌వాజా 21 స‌గ‌టుతో 127 ప‌రుగులు చేశాడు. అత్య‌ధిక స్కోర్ 30 ప‌రుగులు.

 ధ‌ర ఎంతంటే

ధ‌ర ఎంతంటే

మెగా వేలంలో పాట్ క‌మిన్స్ ఈ సారి 2 కోట్ల రూపాయ‌ల బేస్ ప్రైజ్‌తో ఉన్నాడు. గ‌త వేలంలో భారీ ధ‌ర ప‌లికిన క‌మిన్స్‌కు ఈ సారి అంత రేటు ద‌క్కే అవ‌కాశం లేద‌ని క్రికెట్ విశ్లేష‌కులు అంటున్నారు. ఎందుకంటే గత సీజ‌న్లో క‌మిన్స్ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగా రాణించ‌క‌పోవ‌డ‌మే కార‌ణంగా చెబుతున్నారు. అయితే క‌మిన్స్‌కు 5 కోట్ల రూపాయ‌ల నుంచి 8 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు చెల్లించాల‌ని చెన్నైసూప‌ర్ కింగ్స్ భావిస్తోంద‌ని స‌మాచారం. ఇక 1.5 కోట్ల రూపాయ‌ల బేస్ ప్రైజ్‌తో ఉన్నా ఆరోన్ ఫించ్‌ను 5 కోట్ల రూపాయ‌ల నుంచి 8 కోట్ల రూపాయ‌ల‌కు కొనుగోలు చేయాల‌ని సీఎస్కే భావిస్తోంద‌ని సమాచారం. అలాగే 1.5 కోట్ల రూపాయ‌ల బేస్ ప్రైజ్‌తో ఉన్న ఉస్మాన్ ఖ‌వాజాను 4 కోట్ల రూపాయ‌ల నుంచి 7 కోట్ల రూపాయ‌ల‌కు కొనుగోలు చేయాల‌ని చెన్నైసూప‌ర్ కింగ్స్ భావిస్తోంద‌ట‌.

Story first published: Wednesday, February 9, 2022, 16:10 [IST]
Other articles published on Feb 9, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X