Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రాయల్ ఛాలెంజర్స్‌లో ఆసీస్ ఆల్‌రౌండర్: రెండు గంటల్లో ఏడుమంది ప్లేయర్లు: ఇంట్రెస్టింగ్ పికప్స్

 IPL 2022: Australian cricketer Jason Behrendorff sold to RCB at Rs 75 Lakh.

బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్.. 15వ ఎడిషన్ వేలంపాట బెంగళూరు వేదికగా రసవత్తరంగా సాగుతోంది. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం ఈ ఈవెంట్ పునఃప్రారంభమైంది. ఈ సెషన్‌లో రాయల్ ఛాలెంజర్స్ కొన్ని ఇంట్రెస్టింగ్ సెలెక్షన్లతో హాట్ టాపిక్‌గా మారింది. లంచ్ బ్రేక్ తరువాత తొలిసారిగా మహిపాల్ లొమ్రార్‌ను జట్టులోకి తీసుకుంది. 95 లక్షల రూపాయలతో అతణ్ని తీసుకుంది. రాయల్ ఛాలెంజర్స్ రెండో రోజు వేలం పాట సందర్భంగా జట్టులోకి తీసుకున్న తొలి ప్లేయర్ అతనే.

అన్‌క్యాప్డ్ బౌలర్ల కేటగిరీలో వరుసగా ప్లేయర్లను తీసుకుంది. యష్ దయాళ్‌, ఫిన్ అలెన్‌ను తీసుకుంది. అనంతరం కోటి రూపాయలతో షెర్ఫానె రూథర్‌ఫర్డ్‌ను కొనుగోలు చేసింది. ఆ తరువాత 75 లక్షలకు జేసన్ బెహ్రెన్‌డార్ఫ్‌ను హైర్ చేసింది. అదే దూకుడును కొనసాగించింది. ప్రవీణ్ దుబె, సుయాష్‌, చామా మిలింద్‌ను తీసుకుంది. ప్రవీణ్ దుబే-రూ.30 లక్షలు, సుయాష్-20, చాయా మిలింద్‌-25 లక్షలకు కొనుగోలు చేసింది.

ఈ సెషన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తీసుకున్న ప్లేయర్లందరూ బౌలర్లే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వేలంపాట ప్రారంభమైన తొలి రోజు కూడా బౌలర్లకే అధిక ప్రాధాన్యత ఇచ్చింది బెంగళూరు ఫ్రాంఛైజీ. వనిందు హసరంగ, హర్షల్ పటేల్‌‌ను తీసుకుంది. దినేష్ కార్తీక్, షాబాజ్ అహ్మద్, అనూజ్ రావత్, జోష్ హేజిల్‌వుడ్, అక్ష్‌దీప్‌ను తొలి రోజే హైర్ చేసుకుంది. ఇప్పుడు తాజాగా సెలెక్ట్ చేసుకున్న ఆరు మందితో జట్టు మొత్తం 13కు చేరింది.

Story first published: Sunday, February 13, 2022, 17:19 [IST]
Other articles published on Feb 13, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+