
ముంబై: కోల్‌కతా నైట్ రైడర్స్ అభిమానులకు గుడ్‌న్యూస్. ఆ జట్టు ప్రధాన బౌలర్, ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ పాట్ కమిన్స్ జట్టులో చేరాడు. శుక్రవారం ఇండియా చేరుకున్న కమ్మిన్స్ కేకేఆర్ క్యాంప్‌తో కలిశాడు. అయితే నిబంధనల ప్రకారం కమిన్స్ 3 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండనున్నాడు. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ ఆడే మ్యాచ్‌కు దూరంగా ఉండనున్నాడు. కాగా పాట్ కమిన్స్ ప్రస్తుతం ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. ఇక మెగా వేలంలో పాట్ కమిన్స్‌ను 7 కోట్ల 25 లక్షల రూపాయలు వెచ్చించి కోల్‌కతా నైట్ రైడర్స్ మరోసారి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు 2020లో కమిన్స్‌కు కోల్‌కతా ఏకంగా 15 కోట్ల 50 లక్షల రూపాయల భారీ వెచ్చించి కొనుగోలు చేసింది. కాగా కమిన్స్ జట్టు క్యాంప్‌లో చేరిన వీడియోను కేకేఆర్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.
అలాగే కోల్‌కతా దక్కించుకున్న మరో ఆస్ట్రేలియా ఆటగాడు, ఆ జట్టు వన్డే కెప్టెన్ ఆరోన్ ఫించ్ కూడా త్వరలోనే టీంలో చేరనున్నాడు. ప్రస్తుతం ఫించ్ పాకిస్థాన్‌తో ఆస్ట్రేలియా ఆడుతున్న వన్డే సిరీస్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. దీంతో ఆ సిరీస్ ముగిసిన వెంటనే ఫించ్ భారత్‌లో అడుగుపెట్టనున్నాడు. కాగా మెగా వేలంలో ఫించ్‌ను ఏ జట్టు కొనుగోలు చేయలేదు. అయితే కోల్‌కతా కొనుగోలు చేసిన ఇంగ్లండ్ ఆటగాడు అలెక్స్ హేల్స్ తప్పుకోవడంతో అతని స్థానంలో ఫించ్‌నుకోల్‌కతా జట్టులోకి తీసుకుంది.

కోల్‌కతానైట్ రైడర్స్ పూర్తి జట్టు
అజింక్య రహానే, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), సామ్ బిల్లింగ్స్, షెల్డన్ జాక్సన్(వికెట్ కీపర్), ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, టిమ్ సౌతీ, ఉమేష్ యాదవ్, వరుణ్ చకరవర్తి, శివమ్ మావి, మహ్మద్ నబీ, చమికా కరుణరత్నే , రింకు సింగ్, అనుకుల్ రాయ్, ప్రథమ్ సింగ్, అభిజీత్ తోమర్, రసిఖ్ సలామ్, అమన్ హకీమ్ ఖాన్, అశోక్ శర్మ, రమేష్ కుమార్