IPL 2022: బంగ్లాదేశ్ బౌలర్ కాదు, జింబాబ్వే బౌలర్ కాదు.. లక్నోలోకి ఆస్ట్రేలియా స్టార్ బౌలర్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 మెగా వేలంలో భారీ ధర వెచ్చించి లక్నోసూపర్ జెయింట్స్ కొనుగోలు చేసిన ఇంగ్లండ్ స్టార్ బౌలర్ మార్క్‌వుడ్ గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో అతని స్థానంలో ఆస్ట్రేలియా స్టార్ బౌలర్‌ను లక్నో సూపర్ జెయింట్స్ తమ జట్టులోకి తీసుకుంది. ఈ విషయాన్ని సదరు ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది.

లక్నోలోకి ఆండ్రూ టై
గాయం కారణంగా ఐపీఎల్ 2022కు దూరమైన మార్క్‌వుడ్ స్థానంలో ఆస్ట్రేలియా స్టార్ పేస్ బౌలర్ ఆండ్రూ టైని లక్నో సూపర్ జెయింట్స్ జట్టులోకి తీసుకుంది. ఈ మేరకు అతనితో ఒప్పందం కూడా కుదుర్చుకున్నట్లు సదరు ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది. ఆండ్రూ టై బైస్ ధర కోటి రూపాయలకు అతడిని లక్నో టీంలోకి తీసుకుంది. కాగా మెగా వేలంలో ఆండ్రూ టైని ఏ జట్టు కొనుగోలు చేయలేదు. మార్క్ వుడ్ స్థానంలో బంగ్లాదేశ్ పేసర్ తస్కిన్ అహ్మద్ లేదా జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజరబానిలో ఒకరిని జట్టులోకి తీసుకునే అవకాశాలున్నాయని వార్తలు వచ్చినప్పటికీ అది జరగలేదు.

మార్క్ వుడ్‌కు గాయం
మెగా వేలంలో మార్క్‌వుడ్‌ను లక్నో సూపర్ జెయింట్స్ భారీ ధరతో కొనుగోలు చేసింది. 2 కోట్ల రూపాయల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చిన అతడిని లక్నో 7 కోట్ల 50 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది. కానీ ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టు తరఫున వెస్టిండీస్ పర్యటనలో ఉన్న వుడ్ రెండో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా గాయపడ్డాడు. అతని మోచేతికి అయిన గాయం తీవ్రం కావడంతో కొంత కాలం క్రికెట్‌కు దూరంగా ఉంండనున్నాడు. ఈ క్రమంలోనే రానున్న ఐపీఎల్ సీజన్ మొత్తానికి వుడ్ దూరమయ్యాడు.

ఆండ్రూ టై రికార్డులు
35 ఏళ్ల ఆండ్రూ టై గతంలో ఐపీఎల్‌లో విజయవంతంగా రాణించాడు. 2018లో అత్యధిక వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ కూడా అందుకున్నాడు. ఆ సీజన్లో పంజాబ్ కింగ్స్ తరఫున బరిలోకి దిగన ఆండ్రూ టై 14 మ్యాచ్‌ల్లో 24 వికెట్లు తీసి సత్తా చాటాడు. మొత్తంగా ఐపీఎల్‌లో ఇప్పటివరకు 27 మ్యాచ్‌లాడిన ఆండ్రూ టై 40 వికెట్లు తీశాడు. అత్యుత్తమ గణాంకాలు 5/17గా ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్లో 7 వన్డేలు, 32 టీ20లు ఆడిన ఆండ్రూ టై.. వన్డేల్లో 12, టీ20ల్లో 47 వికెట్లు తీశాడు.

లక్నో సూపర్ జెయింట్స్ పూర్తి జట్టు
కేఎల్ రాహుల్ (17 కోట్లు), మార్కస్ స్టొయినిస్ (9.2 కోట్లు), రవి బిష్ణోయ్ (4 కోట్లు), అవేశ్ ఖాన్ (10 కోట్లు), జాసన్ హోల్డర్ (8.75 కోట్లు), కృనాల్ పాండ్య (8.25 కోట్లు), ఆండ్రూ టై (కోటి), క్వింటన్ డికాక్ ( 6.75 కోట్లు), దీపక్ హుడా (5.75 కోట్లు), మనీశ్ పాండే (4.60 కోట్లు), దుష్మాంత చమీరా (2 కోట్లు), ఎవిన్ లూయిస్ ( 2 కోట్లు), కృష్ణప్ప గౌతమ్ (90 లక్షలు), అంకిత్ సింగ్ రాజ్‌పుత్ (50 లక్షలు), షాబాజ్ నదీమ్ (50 లక్షలు), కేల్ మయేర్స్ (50 లక్షలు), మనన్ వోహ్రా, ఆయుష్ బదోని, కరణ్ శర్మ, మోన్‌సిన్ ఖాన్ ( వీరందరికీ 20 లక్షలు).
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications