
వేలంపాటలో పాల్గొనే ఫ్రాంఛైజీలు ఇవే..
ఐపీఎల్ 2022 మెగా టోర్నమెంట్‌లో పాల్గొనే ఫ్రాంఛైజీల సంఖ్య పెరిగిన విషయం తెలిసిందే. లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ కొత్తగా జాయిన్ అయ్యాయి. పాత ఫ్రాంఛైజీలు చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కత నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ కేపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వేలానికి హాజరు కానున్నాయి. రిటైనింగ్ పాలసీని ఇంప్లిమెంట్ చేసిన నేపథ్యంలో- ఒక్కో జట్టులో కొత్త ముఖాలు పెద్ద సంఖ్యలో వచ్చి చేరనున్నాయి.

వేలానికి ఎంతమంది..
మొత్తంగా ఈ వేలంపాటలో 590 మంది క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందులో 228 మంది క్యాప్డ్, 355 మంది అన్ క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారు. ఐపీఎల్‌తో అసోసియేట్ అయిన ఏడు దేశాలకు చెందిన క్రికెటర్లు ఐపీఎల్ 2022 మెగా ఆక్షన్ కోసం తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు. ఈ 590లో 370 మంది భారత క్రికెటర్లు ఉన్నారు. కాగా మిగిలిన 220 మంది విదేశీ ప్లేయర్లు. హయ్యెస్ట్ రిజర్వ్ ప్రైస్ రెండు కోట్ల రూపాయలు. ఈ రెండు కోట్ల రూపాయల మార్జిన్‌లో 48 క్రికెటర్లు ఉన్నారు. కోటిన్నర రూపాయల మార్జిన్‌లో 20, కోటి రూపాయల రిజర్వ్ ప్రైస్ కేటగిరీలో 34 మంది క్రికెటర్లు ఉన్నారు.

లైవ్ టెలికాస్ట్ ఛానల్ ఇదే..
రెండు రోజుల పాటు కొనసాగే ఈ మెగా వేలంపాటను స్టార్ స్పోర్ట్స్ ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. దీని పరిధిలోని ఎనిమిది నెట్‌వర్క్ ఛానల్స్, మూడు ప్రాంతీయ భాషల్లోనూ లైవ్ టెలికాస్ట్ అవుతుందీ పే-డే ప్రోగ్రామ్. హిందీ, ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ప్రత్యక్ష ప్రసారాన్ని చూడొచ్చు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్లాట్‌ఫామ్‌పైనా లైవ్ టెలికాస్ట్‌ను చూసే వీలు ఉంది. శనివారం ఉదయం 11 గంటలకు కవరేజ్ ఆరంభమౌతుంది. 12 గంటలకు వేలంపాట మొదలవుతుంది.

33 మంది ప్లేయర్లు రిటైన్..
అన్ని ఐపీఎల్ ఫ్రాంఛైజీలు మొత్తంగా 33 మంది ప్లేయర్లను రిటైన్ చేసుకున్నాయి. ఒక్కో ఫ్రాంఛైజీ 900 కోట్ల రూపాయల బడ్జెట్‌ను దీనికోసం కేటాయించుకున్నాయి. రిటైనింగ్ ప్లేయర్లకు చెల్లించాల్సిన మొత్తం పోగా.. 561.5 కోట్ల రూపాయలు బ్యాలెన్స్ ఉంది. ఈ మొత్తంతో మిగిలిన క్రికెటర్లందరినీ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీనికోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకున్నాయి. ఐపీఎల్ మెగా వేలానికి సన్నద్ధం అయ్యాయి.


Click it and Unblock the Notifications












