Ipl 2022 Auction: సన్‌రైజర్స్‌లోకి ఇషాన్ కిషన్.. పంజాబ్ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్?

ఐపీఎల్ మెగా వేలానికి సమయం దగ్గర పడుతుండడంతో ఏ ఆటగాడిని ఏ టీం కోనుగోలు చేయబోతుందనే ఆసక్తి కూడా పెరుగుతుంది. ఈ సమయంలో బయటికి వస్తున్న అనేక వార్తలు నెట్టింట వైరల్‌గా మారతున్నాయి. తాజాగా బయటికి వస్తున్న వార్తల ప్రకారం ఇప్పటివరకు ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన ఇషాన్ కిషన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ వేలంలో కొనుగోలు చేయబోతుందని సమాచారం. అలాగే ఇంతకాలం ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన శ్రేయస్ అయ్యర్‌ను పంజాబ్ కింగ్స్ వేలంలో దక్కించుకోనుందట.

సన్‌రైజర్స్‌లోకి కిషన్
ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఇషాన్ కిషన్ ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అయితే ఈ ఏడాది ముంబై రిటెన్షన్ ప్లేయర్ల జాబితాలో ఇషాన్ కిషన్‌కు చోటు దక్కలేదు. అతడిని జట్టు ఈ సారి వేలంలోకి వదిలేసింది. దీంతో మంచి బ్యాటింగ్ నైపుణ్యం కల్గిన 23 ఏళ్ల ఇషాన్ కిషన్‌పై అన్ని ఫ్యాంచైజీలు కన్నేశాయి. బ్యాటింగ్‌తోపాటు మంచి వికెట్ కీపింగ్ నైపుణ్యం ఉన్న ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా ఆడడమే కాకుండా ధాటిగా ఆడి ధారాళంగా పరుగులు రాబట్టగలడు.
అంతేకాకుండా భారీ షాట్లు ఆడడంలో దిట్ట. దీంతో ఈ సారి ఇషాన్‌ను ఎలాగైనా దక్కించుకోవాలని అన్ని ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇషాన్ కిషన్‌నపై కన్నేసిందట. కిషన్‌కు వేలంలో ఎన్ని డబ్బులైనా సరే వెచ్చించాలని రైజర్స్ యాజమాన్యం పట్టుదలగా ఉందని సమాచారం. దీన్ని బట్టి చూస్తుంటే ఈ సారి వేలంలో ఇషాన్ కిషన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇషాన్ కిషన్ రికార్డులు
ఇప్పటివరకు ఐపీఎల్‌లో 61 మ్యాచ్‌లు ఆడిన ఇషాన్ కిషన్ 28 సగటుతో 1452 పరుగులు చేశాడు. ఇందులో 9 హాఫ్ సెంచరీలు ఉండగా.. అత్యధిక స్కోర్ 99 పరుగులు. స్ట్రైక్ రేట్ 136 గా ఉంది. ఈ క్రమంలో కిషన్ 121 ఫోర్లు, 74 సిక్స్‌లు బాదాడు.

పంజాబ్ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
యువ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్‌లో ఇంతకాలం ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అయితే ఈ సారి ఢిల్లీ రిటెన్షన్ ప్లేయర్ల జాబితాలో అయ్యర్‌కు చోటు లభించలేదు. దీంతో ఈ సారి అయ్యర్ వేలంలో పాల్గొననున్నాడు. ఇంతకాలం అయ్యర్ కొత్త జట్లైనా లక్నో లేదా అహ్మదాబాద్‌లలో ఏదో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని వార్తలు వచ్చాయి.
కానీ తాజా సమాచారం ప్రకారం అయ్యర్‌ను వేలంలో పంజాబ్ కింగ్స్ జట్టు కోనుగోలు చేయనుందట. గతంలో ఆ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించన లోకేష్ రాహుల్ ఈ సీజన్‌కు పంజాబ్ నుంచి బయటికి వచ్చాడు. దీంతో అయ్యర్‌ను టీంలో చేర్చుకోని కెప్టెన్సీ బాధ్యతలు కూడా అతనికే అప్పగించాలని పంజాబ్ యాజమాన్యం భావిస్తోందట.

అయ్యర్ రికార్డులు
ఐపీఎల్‌లో ఇప్పటివరకు 87 మ్యాచ్‌లు ఆడిన శ్రేయస్ అయ్యర్ 31 సగటుతో 2375 పరుగులు చేశాడు. ఇందులో 16 హాఫ్ సెంచరీలు ఉండగా.. అత్యధిక స్కోర్ 96 పరుగులు. 124 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేసిన 27 ఏళ్ల అయ్యర్ 196 ఫోర్లు, 88 సిక్స్‌లు బాదాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications