IPL Auction: రూ.50 లక్షల బేస్‌ప్రైజ్ ఉన్న భారత ఆటగాళ్లు ఇదిగో.. అమ్ముడు పోయేదెవరు? పోనిదెవరు?

ఐపీఎల్ మెగా వేలానికి సమయం దగ్గర పడుతుంది. నేటి నుంచి వేలానికి సరిగ్గా 10 రోజులు మాత్రమే ఉంది. బెంగళూరు వేదికగా ఈ నెల 12, 13వ తేదీల్లో మెగా వేలం జరగనుంది. ఇందులో కోసం బీసీసీఐ తగిన ఏర్పాట్లు కూడా చేస్తుంది. ఈ నేపథ్యంలో మంగళవారం బీసీసీఐ మెగా వేలానికి ఆటగాళ్ల షార్ట్ లిస్ట్‌ను కూడా విడుదల చేసింది. మొత్తం 590 మంది ఆటగాళ్లు వేలంలో పాల్గొనున్నారు. అలాగే ఏ ఆటగాడు ఎంత బేస్ ప్రైజ్‌తో వేలంలోకి రాబోతున్నాడనే విషయంపై కూడా ఓ క్లారిటీ వచ్చింది. ఈ నేపథ్యంలో 50 లక్షల బేస్ ప్రైజ్‌తో ఉన్న ఇండియా ఆటగాళ్లను ఒక సారి పరిశీలిద్దాం. అంతేకాకుండా వీరిలో ఎవరెవరు అమ్ముడుపోతారు, ఎవరెవరు అమ్ముడు పోరని విషయాలు కూడా చర్చకు వస్తున్నాయి.

మొత్తం ఎంత మందంటే?
ఈ మెగా వేలంలో మొత్తం 24 మంది భారత ఆటగాళ్లు 50 లక్షల రూపాయల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది ప్రస్తుతం సరైనా ఫాంలో లేని వారే ఉన్నారు. అలాగే సీనియర్ ఆటగాళ్లు, ప్రస్తుతం దేశవాళీ లీగ్‌ల్లో ఆడుతున్న ఆటగాళ్లు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కాకుండా కేవలం టెస్టు క్రికెట్‌లోనే ఆడే ఆటగాళ్లతోపాటు గతంలో టీమిండియాకు ఆడి ప్రస్తుతం జట్టులో స్థానం కోల్పయిన వారు ఈ 50 లక్షల రూపాయల బేస్ ప్రైజ్ కింద ఉన్నారు.

రూ.50 లక్షల బేస్ ప్రైజ్ లిస్ట్
రూ.50 లక్షల బేస్‌ప్రైజ్ లిస్ట్‌లో చటేశ్వర్ పుజారా, మురళీ విజయ్, శ్రీశాంత్, మన్‌దీప్ సింగ్, సౌరబ్ తివారీ, శివమ్ దూబే, కృష్టప్ప గౌతమ్, కరుణ్ నయర్, విజయ్ శంకర్, చేతన్ సకారియా, నదీమ్, హనుమ విహారీ, బరీందర్ శ్రవణ్, మయాంక్ మార్కండే, మనోజ్ తివారీ, గురు కీరత్ సింగ్, పవన్ నెగి, రాహుల్ శర్మ, సందీప్ వారియర్, ఖలీల్ అహ్మద్, రిషీ ధావన్, కరణ్ శర్మ, వరుణ్ హారన్, మోహిత్ శర్మ ఉన్నారు.

ఆ ప్లేయర్లు డౌటే!
ఈ సారి మెగా వేలంలో టీమిండియా టెస్టు ప్లేయర్లు చటేశ్వర్ పుజారా, మురళీ విజయ్ 50 లక్షల బేస్ ప్రైజ్‌లో ఉన్నారు. వీరిలో విజయ్ ఫాంలో కోల్పోయి టీమిండియాకు ఎప్పుడో దూరమయ్యాడు. పుజారా చాలా కాలంగా పాంలో లేడు. దీంతో వీరిద్దరు ఈ సారి వేలంలో అమ్ముడుపోయేది డౌటే అని విశ్లేషకులు అంటున్నారు. పుజారాను గత ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసినప్పటికీ ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడించలేదు. అలాగే గతంలో మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో ఇరుక్కోని ఏడేళ్లపాటు క్రికెట్‌కు దూరమైన శ్రీశాంత్‌ను కూడా ఏ జట్టు కోనుగోలు చేయకపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వీరి వయసు ఎక్కువ కావడం కూడా వీరు అమ్ముడు పోకపోవడానికి కారణం అయ్యే అవకాశం ఉంది. వరుణ్ హారన్, మయాంక్ మార్కండే, గురు కీరత్ సింగ్, మోహిత్ శర్మ, రాహుల్ శర్మ వంటి తదితర ఆటగాళ్లు కూడా అమ్ముడు పోవడం కష్టమే అంటున్నారు.

అమ్ముడు పోయేది వీళ్లే!
ఇక హనుమ విహారీ, కరణ్ శర్మ, రిషిధావన్, ఖలీల్ అహ్మద్, సందీప్ వారియర్, పవన్ నేగి వేలంలో అమ్ముడు పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వీరు కొంత కాలంగా దేశవాలీ వంటి తదితర లీగ్‌ల్లో రాణిస్తుండడమే దీనికి కారణంగా చెబుతున్నారు. అలాగే విజయ్ శంకర్, శివమ్ దూబే, మనోజ్‌తివారీ, చేతన్ సకారియా తదితరులు అమ్ముడు పోతారని అంచనా వేస్తున్నారు. ఇక మిగతావాళ్లు అమ్ముడు పోయేడి, పోనిది వేలంలో తెలుస్తుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications