For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Arshdeep Singh: డెత్ ఓవర్లలో వాటే బౌలింగ్, ఒక్క సిక్స్ కూడా ఇవ్వలేదు... టీ20 ప్రపంచకప్‌లో చోటు దక్కేనా?

IPL 2022: Arshdeep Singh Never Conceded A Six At 20 Over, Will He Be In Indian Playing 11 For T20 World Cup

సోమవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై పంజాబ్ కింగ్స్ 11పరుగుల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. పంజాబ్ కింగ్స్‌కు అంతా సులువుగా విజయం దక్కలేదు. బౌలర్ సందీప్ శర్మ వేసిన 16వ ఓవర్లో చెన్నై బ్యాటర్ అంబటి రాయుడు చెలరేగిపోయాడు. వరుసగా మూడు సిక్సర్లు, ఒక ఫోర్ బాది విధ్వంసం రేపాడు. మొత్తం ఆ ఓవర్లో 23 పరుగులు వచ్చాయి. దీంతో సమీకరణం మారిపోయింది. 24బంతుల్లో 47పరుగులు చేయాల్సిన అవసరం నెలకొంది. రాయుడు, రవీంద్ర జడేజా, ధోనీ లాంటి మ్యాచ్ విన్నర్లు కలిగి ఉన్న చెన్నైకి 24బంతుల్లో 47పరుగులు చేయడం అంత పెద్ద టాస్కేం కాదు.

అప్పుడొచ్చాడు అర్షదీప్

అప్పుడొచ్చాడు అర్షదీప్

17వ ఓవర్‌ బౌలింగ్‌కు దిగిన పంజాబ్ బౌలర్ అర్షదీప్ ఆ ఓవర్లో కేవలం 6పరుగులే ఇచ్చి చెన్నైపై ప్రెషర్ పెంచాడు. అతను 1,1,1,0,1,2పరుగులతో ఓవర్ పూర్తి చేశాడు. తర్వాత ఓవర్లో రబాడా సైతం 6పరుగులే ఇచ్చి రాయుడును ఔట్ చేశాడు. అయినా ఇంకా ముప్పు తొలగలేదు. ఎందుకంటే క్రీజులో ఉన్నది ప్రపంచంలోనే అత్యుత్తమ ఫినిషర్ అయిన మహేంద్ర సింగ్ ధోనీ. చివరి 12బంతుల్లో 35పరుగులు చేయాలి.

ఈసారి 19ఓవర్లో బంతిని అందుకున్న అర్షదీప్.. మళ్లీ సత్తా చాటాడు. డెత్ ఓవర్‌లో.. అది కూడా అవతలి ఎండ్‌లో ధోనీ లాంటి ఫినిషర్ ఉండగా ఏ బౌలర్ అయినా టెన్షన్ పడుతాడు. కానీ అర్షదీప్ మాత్రం ప్రశాంతంగా బౌలింగ్ చేశాడు. ఆ ఓవర్లో కేవలం 8పరుగులే ఇచ్చాడు. దీంతో చెన్నైకి టార్గెట్ మరింత టఫ్ అయింది. 6బంతుల్లో 27పరుగులు చేయాల్సిన దశలో రిషి ధావన్ బౌలింగ్ చేయగా.. ధోనీ ఔటవ్వడంతో పాటు కేవలం 15పరుగులే వచ్చాయి. దీంతో 11పరుగుల తేడాతో పంజాబ్ గెలుపొందింది.

అన్‌క్యాప్డ్ ప్లేయర్లలో అతనే బెటర్

అన్‌క్యాప్డ్ ప్లేయర్లలో అతనే బెటర్

అన్‌క్యాప్డ్ ప్లేయర్లలో సమర్థంగా డెత్ ఓవర్లలో బౌలింగ్ చేస్తున్నవాళ్లలో అర్ష్‌దీప్ ముందుంటాడు. అతను వికెట్లు ఎక్కువగా తీయకపోయినప్పటికీ.. పరుగులు ఇవ్వకుండా ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టగలడు. వైడ్ యార్కర్లు వేయగలడు. ర్యాండమ్ స్లో బాల్స్ వేయగలడు. పేస్ వేరియన్స్ చూపించగలడు.

బ్యాటర్ మూమెంట్‌ను రీడ్ చేయగలడు. నిన్నటి మ్యాచ్‌లో డెత్ ఓవర్లలో బౌలింగ్ చేసిన అర్షదీప్.. 12బంతుల్లో కేవలం 14పరుగులే ఇచ్చి చెన్నై బ్యాటర్లను ఒత్తిడికి గురి చేసి వికెట్లు కోల్పోయేలా చేశాడు. అంతకుముందు చాలా మ్యాచ్‌ల్లోనూ డెత్ ఓవర్లలో అర్షదీప్ మంచి బౌలింగ్ వేశాడు.

టీమిండియాకు ఎంపికయ్యే ఛాన్స్

టీమిండియాకు ఎంపికయ్యే ఛాన్స్

అర్షదీప్‌ను ఆస్ట్రేలియాలో జరగబోయే టీ20వరల్డ్ కప్‌కు ఎంపికయ్యే టీమిండియా జట్టులో తీసుకోవాలనే చర్చ మొదలైంది. ఎందుకంటే ఇంత పక్కాగా డెత్ బౌలింగ్ చేసే లెఫ్టార్మ్ పేసర్ టీమిండియాకు ప్రస్తుతం లేడు. నటరాజన్ కూడా రాణిస్తున్నా.. డెత్ బౌలింగ్ పరంగా అర్షదీపే బెటర్. కాకపోతే నటరాజన్ వికెట్లు తీయగలడు.

అర్షదీప్ మాత్రం వికెట్లు తీయలేకపోతున్నాడు. ఇప్పుడున్న టీమిండియా బౌలర్లలో దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్ తదితర బౌలర్లందరు రైట్ ఆర్మ్ బౌలర్లే. అందువల్ల ఓ మంచి లెఫ్టార్మ్ టీమిండియాకు అవసరముంది. ఆ స్థానాన్ని అర్షదీప్ సమర్థంగా భర్తీ చేయగలడు. ఈ క్రమంలో టీమిండియాకు అర్షదీప్ ఎంపికయ్యే అవకాశాలున్నాయి.

ఒక్క సిక్సర్ కూడా ఇవ్వలేదు

ఒక్క సిక్సర్ కూడా ఇవ్వలేదు

డెత్ ఓవర్లలో బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగుతుంటారు. అలాంటిది ఈ సీజన్లో అర్షదీప్ డెత్ ఓవర్లలో బౌలింగ్ చేస్తున్నప్పుడు ఒక్క సిక్సర్ కూడా ఇవ్వలేదు. డెత్ ఓవర్లలో తక్కువ సిక్సులు ఇచ్చిన జాబితాలో అర్షదీప్ (0) తొలిస్థానంలో ఉండగా.. సునీల్ నరైన్ 1, బుమ్రా 1, షమీ 1 సిక్సర్లతో అతని తర్వాత ఉండడం గమనార్హం.

వాళ్లతో పోల్చితే అర్షదీప్ చాలా తక్కువ క్రికెట్ ఆడాడు. అతనో అన్ క్యాప్డ్ ప్లేయర్. కానీ వాళ్లకంటే బెటర్ డెత్ ఓవర్ బౌలింగ్ చేస్తున్నాడు. మ్యాచ్ అనంతరం పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ మాట్లాడుతూ.. అర్ష్‌దీప్ చాలా బాగా బౌలింగ్ చేశాడన్నాడు. 'ఈ మ్యాచ్‌ గెలుపులో అతనికి చాలా క్రెడిట్ దక్కుతుంది.

ఈ సీజన్లో అతను చాలా టఫ్ సిచ్యువేషన్లో బౌలింగ్ చేశాడు. మ్యాచ్ చేజారే పరిస్థితుల్లో తన మార్క్ బౌలింగ్‌తో పరుగులు రాకుండా చూశాడు. అతను ఎంత టఫ్ సిచ్యువేషన్ అయినా తన చేతిని పైకి లేపి.. నాకు బౌలింగ్ ఇవ్వు అంటాడు. అతను నిజంగా మా జట్టులో గొప్ప ప్లేయర్ అని పేర్కొన్నాడు.

Story first published: Tuesday, April 26, 2022, 12:16 [IST]
Other articles published on Apr 26, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+