Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2022: నీ బౌలింగ్ అద్భుతంగా ఉంది.. మహ్మ‌ద్ ష‌మీపై అమెరికా శృంగార తార కామెంట్స్‌

IPL 2022: American porn star Kendra Lust praises on Gujarat titans bowler Mohammed Shami bowling

ఐపీఎల్ 2022లో భాగంగా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో గుజ‌రాత్ టైటాన్స్ బౌల‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ చెల‌రేగాడు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ల‌క్నోను దెబ్బ కొట్టాడు. వ‌రుస ఓవ‌ర్ల‌లో కీల‌క‌మైన ఓపెన‌ర్ల వికెట్ల‌తోపాటు మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్ మ‌నీష్ పాండే వికెట్ కూడా తీశాడు. ష‌మీ దెబ్బ‌కు ల‌క్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ డ‌కౌట్ కాగా, వికెట్ కీప‌ర్ క్వింట‌న్ డికాక్ 7, మ‌నీష్ పాండే 6 ప‌రుగులు మాత్ర‌మే చేసి ఔట్ అయ్యారు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో 4 ఓవ‌ర్లు వేసి 25 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చిన ష‌మీ 3 కీల‌క వికెట్ల‌ను ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాకుండా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా కూడా ఎంపిక‌య్యాడు. ష‌మీ ఈ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌పై అంద‌రూ ప్ర‌శంసలు కూడా కురిపించారు.

తాజాగా మ‌హ్మ‌ద్ ష‌మీ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌ను అమెరికా తార కెండ్రా లస్ట్ కూడా ప్ర‌శంసించింది. ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆమె ష‌మీపై ప్ర‌శంస‌లు కురిపించింది. అద్భుత ప్రదర్శన చేశావ్ షమీ అంటూ లవ్, క్లాప్స్‌తో కూడిన‌ ఎమోజీలను త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్ర‌స్తుతం ఆమె చేసిన ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. అయితే కెండ్రా లస్ట్ చేసిన ట్వీట్‌పై నెటిజ‌న్లు ప‌లు ర‌కాలుగా స్పందిస్తున్నారు. కొంద‌రు ఆకాతాయిలైతే అస‌భ్య‌క‌ర కామెంట్లు చేస్తున్నారు.

IPL 2022: American porn star Kendra Lust praises on Gujarat titans bowler Mohammed Shami bowling

ష‌మీ భాయ్.. నీ ప్ర‌ద‌ర్శ‌న‌కు కెండ్రా నీ ప్రేమ‌లో ప‌డిపోయిందని వ్యాఖ్యానిస్తున్నారు. ఇంకొంద‌రైతే కెండ్రా లస్ట్‌తో ఎప్ప‌టి నుంచి ప‌రిచయం ఉంద‌ని ష‌మీని అడుగుతున్నారు. అలాగే కెండ్రా లస్ట్‌కు ష‌మీ బాగా గుర్తుస్తున్నాడేమోన‌ని వ్యాఖ్యానిస్తున్నారు. ప‌లువురు నెటిజన్లు చేసిన ఈ కామెంట్లు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

ఇక ఆ మ్యాచ్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌పై గుజ‌రాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. మొద‌ట బ్యాటింగ్ చేసిన ల‌క్నో 6 వికెట్ల న‌ష్టానికి 158 ప‌రుగులు చేసింది. ఇక ఆ ల‌క్ష్యాన్ని గుజ‌రాత్ టైటాన్స్ మ‌రో 2 బంతులు మిగిలి ఉండ‌గానే 5 వికెట్లు కోల్పోయి చేధించింది.

Story first published: Thursday, March 31, 2022, 17:24 [IST]
Other articles published on Mar 31, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+