IPL 2022: అంబటి రాయుడు ఖాతాలో చెత్త రికార్డు నమోదు.. ఆ జాబితాలో రెండో స్థానానికి..

వాంఖడే: ఐపీఎల్ 2022 ఆరంభ మ్యాచ్‌లో తెలుగు ఆటగాడు అంబటి రాయుడు ఓ చెత్త రికార్డును తన పేరు మీద లిఖించుకున్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నైసూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే తరఫున ఆడిన అంబటి రాయుడు రనౌట్ అయ్యాడు. కెప్టెన్ రవీంద్ర జడేజాతో సమన్వయ లోపం కారణంగా 9వ ఓవర్లో 15 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రాయుడ్ రనౌట్ అయ్యాడు. కాగా ఐపీఎల్‌లో రాయుడు రనౌట్ కావడం ఇదో 15వ సారి. దీంతో ఐపీఎల్‌లో అత్యధిక సార్లు రనౌట్ అయిన ఆటగాళ్ల జాబితాలో సురేష్ రైనాతో కలిసి అంబటి రాయుడు రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో అత్యధికంగా 16 సార్లు రనౌట్ అయిన గౌతం గంభీర్, శిఖర్ ధావన్ మెదటి స్థానంలో ఉన్నారు. ఇక 14 సార్లు రనౌట్ అయిన ఏబీ డివిల్లియర్స్ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు.

ఇక కేకేఆర్‌తో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నైసూపర్ కింగ్స్.. కోల్‌కతా బౌలర్లు కట్టడి చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 131 పరుగులు మాత్రమే చేసింది. ఓ దశలో 61 పరుగులకే 5 వికెట్లు కోల్పోయినప్పటికీ మహేంద్ర సింగ్ ధోని అజేయ హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. అతనికి కెప్టెన్ రవీంద్ర జడేజా కూడా సహకరించాడు. వీరిద్దరు ఆరో వికెట్‌కు అజేయంగా 70 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ధోని 50 పరుగులతో, జడేజా 26 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications