IPL 2022: అదృష్టమంటే రాయుడుదే.. బంతి స్టంప్స్‌కు తగిలిన బెయిల్స్ పడలేదు.. ఫోర్‌గా డిక్లేర్!


వాంఖడే: బహుషా అదృష్టమంటే తెలుగు బ్యాటర్ అంబటి రాయుడిదే కావొచ్చు. అలాగే దురదృష్టమంటే వరుణ్ చక్రవర్తిదే కావొచ్చు. ఎందుకంటే వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో అంబటి రాయుడు బ్యాటింగ్ చేస్తుండగా బాల్ స్టంప్స్‌కు తగిలినప్పటికీ బెయిల్స్ కిందపడలేదు. దీంతో రాయుడు ఔట్ కాకుండా బంతికి పోయాడు. అంతేకాకుండా ఆ బంతి బౌండరీ లైన్ దాటడంతో అంపైర్ ఫోర్‌గా కూడా ప్రకటించాడు. అసలు ఏం జరిగిందంటే.. ఐపీఎల్ 2022 ఆరంభ మ్యాచ్‌లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నైసూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో సీఎస్కే మొదట బ్యాటింగ్ చేసింది. ఆ సమయంలో అంబటి రాయుడు బ్యాటింగ్ చేస్తుండగా.. ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌ను కేకేఆర్ స్పిన్ బౌలర్ వరుణ్ చక్రవర్తి వేశాడు.
ఆ ఓవర్ ఐదో బంతి వరుణ్ చక్రవర్తి అద్భుతంగా వేశాడు. దీంతో ఆ బంతి క్లియర్‌గా స్టంప్స్‌ను తగిలింది. కానీ వరుణ్ చక్రవర్తి దురదృష్టం ఏమిటో కానీ బెయిల్స్ కింద పడలేదు. అంతేకాకుండా సదరు బంతి వికెట్ కీపర్‌ను తప్పించుకుని వెనుక భాగం వైపు బౌండరీ లైన్‌ను దాటింది. దీంతో వికెట్ దక్కలేదనే బాధలో ఉన్న కేకేఆర్‌ను మరింత నిరాశ పరుస్తూ అంపైర్ ఆ బాల్‌ను ఫోర్‌గా ప్రకటించాడు. దీంతో అంబటి రాయుడు ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. దీంతో రాయుడును లక్కి ప్లేయర్‌గా, చక్రవర్తిని ఆన్‌లక్కీ ప్లేయర్‌గా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
అయితే ఆ బంతికి లక్కీగా బయట పడినప్పటికీ ఆ తర్వాత రాయుడు ఎక్కువ పరుగులు చేయలేకపోయాడు. దురదృష్టవశాత్తూ అనవసర పరుగుకు ప్రయత్నించి ఆ కాసేపటికే రనౌట్ అయ్యాడు. ఇన్నింగ్స్ 9వ ఓవర్లో జడేజా, రాయుడు సమన్వయ లోపం కారణంగా రాయుడు రనౌట్ అయ్యాడు. అప్పటికీ రాయుడు 17 బంతుల్లో 15 పరుగులే చేశాడు. ఇందులో ఒక ఫోర్, సిక్స్ ఉన్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications