Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2022: కేకేఆర్ క్యాంపులో చేరిన స్టార్ ఆల్‌రౌండ‌ర్‌.. వైర‌ల్‌గా ఆండ్రూ ర‌సూల్ కొత్త‌ హెయిర్‌స్టైల్‌

IPL 2022: All rounder Andrew Rasool joins Kolkata Knight Riders Camp with new hairstyle

కోల్‌క‌తా: మ‌రో 10 రోజుల్లో ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2022 ప్రారంభం కానుంది. దీంతో జ‌ట్ల‌న్నీ ఇప్ప‌టికే ప్రాక్టీసు క్యాంపుల‌ను ఏర్పాటు చేశాయి. ఆట‌గాళ్లంతా ఒక్కొక్క‌రుగా ఆ క్యాంపుల్లో చేరుతున్నారు. ఇప్ప‌టికే భార‌త ఆట‌గాళ్లంతా దాదాపుగా వారి జ‌ట్ల‌ల్లో చేరిపోయారు. అలాగే ప‌లువురు విదేశీ ఆట‌గాళ్లు సైతం త‌మ త‌మ జ‌ట్ల‌ల్లో అడుగుపెట్టారు. ఈ నేప‌థ్యంలో కోల్‌క‌తానైట్ రైడ‌ర్స్ ఆల్‌రౌండ‌ర్ ఆండ్రీ ర‌సూల్ కూడా త‌మ జ‌ట్టు క్యాంపులో చేరాడు. ఈ విష‌యాన్ని కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ త‌మ అధికారిక ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా వెల్ల‌డించింది.

ఇందుకు సంబంధించిన ఒక వీడియోను విడుద‌ల చేసింది. భ‌యప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని, ర‌సూల్ ఇక్క‌డ ఉన్నాడ‌ని క్యాప్ష‌న్ పెట్టింది. అలాగే ఈ వీడియోలో ఆండ్రీ ర‌సూల్ కొత్త హెయిర్ స్టైల్‌తో క‌నిపిస్తున్నాడు. ఆ వీడియోలో త‌న గోల్డ్‌, ప‌ర్పుల్ హెయిర్ స్టైల్‌ను చూడ‌డండ‌ని ర‌సూల్ చెప్ప‌డం గ‌మ‌నార్హం. కాగా రంగు రంగుల‌ కొత్త హెయిర్ స్టైల్‌లో ర‌సూల్ ఆక‌ట్టుకుంటున్నాడు. దీంతో ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది.

ఐపీఎల్‌లో కోల్‌క‌తానైడ్ రైడ‌ర్స్ త‌మ తొలి మ్యాచ్‌ను చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో ఆడ‌నుంది. మార్చి 26న ఈ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. 30న రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో త‌ల‌ప‌డ‌నుంది. ఏప్రిల్‌ 1న పంజాబ్ కింగ్స్‌, 6న ముంబై ఇండియ‌న్స్‌తో, 10న ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో, 15న స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో, 18న రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో, 23న గుజ‌రాత్ టైటాన్స్‌తో, 28న ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో, మే 2న రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో, 7న పుణే సూప‌ర్ జెయింట్స్‌తో, 9న ముంబై ఇండియ‌న్స్‌తో, 14న స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో, చివ‌ర‌గా 18న పుణే సూప‌ర్ జెయింట్స్‌తో త‌ల‌ప‌డ‌నుంది.

IPL 2022: Point Deductions And Fine For Bio Bubble Breach - BCCI Strict Rules | Oneindia Telugu

కేకేఆర్ పూర్తి జ‌ట్టు ఇదే
శ్రేయస్‌ అయ్యర్(12.25 కోట్లు), ఆండ్రీ రసెల్‌ (12 కోట్లు), వరుణ్‌ చక్రవర్తి (8 కోట్లు), వెంకటేశ్‌ అయ్యర్‌ (8 కోట్లు) నితీశ్‌ రాణా ( 8 కోట్లు), శివమ్‌ మావి(7.25 కోట్లు), ప్యాట్‌ కమిన్స్‌(7.25 కోట్లు), ఉమేశ్‌ యాదవ్(2 కోట్లు), సామ్‌ బిల్లింగ్స్‌(2 కోట్లు), అలెక్స్‌ హేల్స్‌(1.50 కోట్లు), టిమ్‌ సౌథీ(1.50 కోట్లు), అజింక్య రహానె(కోటి), నబీ(కోటి), షెల్డన్‌ జాక్‌సన్‌(60 లక్షలు), రింకు సింగ్(55 లక్షలు), అశోక్‌ శర్మ( 55 లక్షలు), చమిక కరుణరత్నె(50 లక్షలు), అభిజిత్‌ తోమర్(40 లక్షలు), అమన్‌ఖాన్‌, అనుకుల్ రాయ్, ప్రతామ్‌ సింగ్, రసిఖ్ దార్‌, బాబా ఇంద్రజిత్(వీరంద‌రికీ 20 లక్షలు).

Story first published: Wednesday, March 16, 2022, 15:10 [IST]
Other articles published on Mar 16, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+