
రేపే మూడో మ్యాచ్..
ఈ ఆదివారం మూడో మ్యాచ్ ఆడబోతోంది. పంజాబ్ కింగ్స్‌తో ముంబై బ్రబౌర్న్ స్టేడియంలో తలపడనుంది. సాయంత్రం 7:30 గంటలకు ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ ఆరంభం కానుంది. చెన్నై సూపర్ కింగ్స్‌కు గెలిచి తీరాల్సిన మ్యాచ్.. అగ్నిపరీక్షలా మారిన మ్యాచ్. ఏ మాత్రం తేడా కొట్టినా టోర్నమెంట్‌లో పూర్తిగా వెనకపడిపోతుందనడంలో సందేహాలు అక్కర్లేదు. ఇప్పటికే రెండు వరుస అపజయాలతో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. వరుసగా రెండు మ్యాచ్‌లను కోల్పోయిన జట్టు ఈ సీజన్‌లో మరొకటి లేనే లేదు.

రవీంద్ర జడేజాపై ఒత్తిడి..
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కేప్టెన్‌గా కొత్తగా బాధ్యతలను స్వీకరించాడు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా. ఇదివరకు ఎప్పుడూ ఓ జట్టుకు సారథ్యాన్ని వహించిన అనుభవం అతనికి లేదు. అపారమైన క్రికెట్ ఆడిన అనుభవం ఉండటాన్ని దృష్టిలో పెట్టుకుని జడేజాను మహేంద్ర సింగ్ ధోనీ వారసుడిగా ఎన్నుకుంది చెన్నై ఫ్రాంచైజీ. ఆ నమ్మకాన్ని అతను నిలబెట్టుకోలేకపోతున్నాడనేది తొలి రెండు మ్యాచ్‌లతో తేలిపోయింది. కేప్టెన్‌గా తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కొంటోన్నాడు.

వ్యక్తిగతంగానూ ఫెయిల్యూర్..
కేప్టెన్‌గా పగ్గాలు అందుకున్న ప్లేయర్‌పై దానికి సంబంధించిన ఒత్తిడిని ఎదుర్కోవడం సాధారణం. దాని ప్రభావం వ్యక్తిగత ఆటతీరుపైనా కొద్దో, గొప్పో పడటం కూడా అంతే సాధారణం. రవీంద్ర జడేజా విషయంలోనూ అదే జరుగుతోంది. తొలి రెండు మ్యాచ్‌లల్లోనూ అతను వ్యక్తిగతంగా విఫలం అయ్యాడు. బ్యాటర్‌గా, బౌలర్‌గా రాణించలేకపోయాడు. కోల్‌కత నైట్ రైడర్స్‌పై జరిగిన మ్యాచ్‌లో నింపాదిగా బ్యాటింగ్ చేయడం విమర్శలకు కారణమైంది. చివరి ఓవర్ వరకూ క్రీజ్‌లో ఉన్నా భారీ షాట్లను ఆడలేకపోయాడు. జట్టుకు భారీ స్కోర్‌ను అందించలేకపోయాడు.

బౌలర్‌గా..మరింత ఘోరంగా..
బౌలర్‌గా రవీంద్ర జడేజా మరింత ఘోరంగా విఫలం అయ్యాడు. తొలి మ్యాచ్‌లో మూడు ఓవర్లను మాత్రమే వేయగలిగాడు. తన ఓవర్లలో బ్యాటర్లు భారీ షాట్లను ఆడుతుండటంతో కోటాను సైతం పూర్తి చేయలేదు. రెండో మ్యాచ్‌లో కూడా అదే పరిస్థితిని ఎదుర్కొన్నాడు. రెండు ఓవర్లల్లో 21 పరుగులు ఇచ్చుకున్నాడు. ఇక్కడా తన నాలుగు ఓవర్ల కోటాను పూర్తి చేయలేదు. 210 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకునేలా జట్టును నడిపించడంలో అతను విఫలం అయ్యాడు.

మూడో మ్యాచ్‌లో ఏం చేస్తాడు..?
చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా తొలి రెండు మ్యాచ్‌లల్లో ఓటమిపాలు కావడం ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి. ఇదివరకెప్పుడూ ఇలాంటి సందర్భాన్ని చవి చూడలేదు. ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయి.. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచిందీ టీమ్. తన తదుపరి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఎదుర్కొనబోతోంది. ఎల్లుండి సాయంత్రం 7:30 గంటలకు ముంబై బ్రబౌర్స్ స్టేడియంలో ఆరంభమౌతుంది. ప్రతికూల పరిస్థితుల మధ్య జడేజా ఈ మ్యాచ్‌కు సారథ్యాన్ని వహించాల్సి వస్తోంది. దీన్ని ఎలా అధిగమిస్తాడనేది ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications
