For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2022 Playoffs: ముంబై ఇండియన్స్ ఆశలు ఇంకా సజీవంగానే: ఇలా చేస్తే ప్లేఆఫ్స్ ఛాన్స్

IPL 2022: After lost 5 consecutive matches, Can Mumbai Indians still qualify for Playoffs?

ముంబై: ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్‌గా పేరున్న ముంబై ఇండియన్స్‌కు ఈ సీజన్ ఏ మాత్రం కలిసి రావట్లేదు. అన్నీ ఎదురుదెబ్బలే. సీజన్ ఆరంభం నుంచీ ఇదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఊరట అనేదే లేకుండా పోయిందా టీమ్‌కు. ఒక్క మ్యాచ్‌లోనూ గెలవలేని దుస్థితిలో పడింది. తన ప్లేఆఫ్స్ ఆశలను చేజేతులా పోగొట్టుకుంటోంది ముంబై ఇండియన్స్. బుధవారం రాత్రి పుణెలో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చేతిలో 12 పరుగుల తేడాతో పరాజయాన్ని చవి చూసింది ముంబై. ఈ సీజన్‌లో ఈ టీమ్‌కు ఇది వరుసగా అయిదో ఓటమి.

 వరుస పరాజయాలతో..

వరుస పరాజయాలతో..

తొలి మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్ చేతిలో ఓడింది రోహిత్ సేన. రెండో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌‌ను ఎదుర్కొనలేకపోయింది. అనంతరం కోల్‌కత నైట్‌రైడర్స్‌ మ్యాచ్‌లోనూ ఇదే పరిస్థితిని చవి చూసింది ముంబై ఇండియన్స్. నాలుగో మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్‌పై గెలవలేక చేతులెత్తేసింది. తాజా మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఇచ్చిన టార్గెట్‌ను ఛేదించలేకపోయింది. 12 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. చివరి వరకూ పోరాడినప్పటికీ లక్ష్యాన్ని అందుకోలేకపోయింది.

వరుసగా అయిదు మ్యాచ్‌లల్లో ఓడినా

వరుసగా అయిదు మ్యాచ్‌లల్లో ఓడినా

వరుసగా అయిదు మ్యాచ్‌లల్లో ఓడిన తరువాత కూడా ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్ ఆశలు సజీవంగానే ఉన్నాయి. దీనికి ఇంకా ఢోకా లేదు. ఎలాంటి ప్రమాదమూ రాలేదు. ప్లేఆఫ్స్ రేసులో నిల్చోవాలంటే రోహిత్ సేన చేయాల్సిందల్లా ఒక్కటే. ఇకపై ఎదుర్కొనబోయే ప్రతి మ్యాచ్‌నూ గెలవాల్సి ఉంటుంది. భారీ తేడాతో ప్రత్యర్థిని ఓడించగలిగితే- అది బోనస్ అవుతుంది. వరుసగా అయిదు మ్యాచ్‌లల్లో ఓడి.. ఆత్మ విశ్వాసాన్ని కోల్పోయిన ముంబై ఆటతీరు మళ్లీ గాడినపడుతుందా?.. వరుస విజయాలను అందుకుంటుందా? అనేదే ప్రశ్నార్థకం.

ఇంకా తొమ్మిది మ్యాచ్‌లు..

ఇంకా తొమ్మిది మ్యాచ్‌లు..

ముంబై ఇండియన్స్ చేతిలో ఇంకా తొమ్మిది మ్యాచ్‌లు ఉన్నాయి. అందులో ఎనిమిది గెలిచినా ప్లేఆఫ్స్ రేసులో ఉండగలుగుతుంది. తన తదుపరి మ్యాచ్‌లల్లో లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్‌లతో రెండు చొప్పున, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్, కోల్‌కత నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ కేపిటల్స్‌తో ఒక్కో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ లిస్ట్‌లో తన తదుపరి మ్యాచ్‌ను ఈ నెల 16వ తేదీన లక్నో సూపర్ జెయింట్స్‌ను ఎదుర్కొంటుంది. ముంబై బ్రబౌర్న్ స్టేడియంలో ఈ మ్యాచ్‌ మధ్యాహ్నం 3:30 గంటలకు ఆరంభమౌతుంది.

 ఇప్పుడూ అవే పరిస్థితులు..

ఇప్పుడూ అవే పరిస్థితులు..

ఐపీఎల్ టోర్నమెంట్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్ ఇదే. ఇప్పటిదాకా అయిదుసార్లు ట్రోఫీని గెలుచుకుంది. 2013, 2015, 2017, 2019, 2020 సీజన్ల ఛాంపియన్‌గా నిలిచింది. చివరి రెండు ట్రోఫీలను బ్యాక్ అండ్ బ్యాక్ గెలుచుకుంది. గత సీజన్ నుంచి ఈ టీమ్ ఆశించిన స్థాయిలో ఆడట్లేదు. ఏడు మ్యాచ్‌లల్లో ఓడింది. అవే పరిస్థితులు ఇప్పుడు కూడా పునరావృతం అవుతున్నాయి. ఫస్ట్ హాఫ్‌లోనే అయిదు మ్యాచ్‌లను కోల్పోయింది. ఇక ముందు ఆడబోయే తొమ్మిది మ్యాచులను గెలుచుకుంటే- ప్లేఆఫ్స్ రేసులో ఉండగలుగుతుంది.

Story first published: Thursday, April 14, 2022, 14:46 [IST]
Other articles published on Apr 14, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+