న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2022: గుజ‌రాత్ టైటాన్స్‌లోకి ఆఫ్ఘ‌నిస్థాన్ స్టార్ క్రికెట‌ర్‌.. జేస‌న్ రాయ్ స్థానంలో ఎంపిక‌

IPL 2022: Afghanistan wicket keeper-batter Rahmanullah Gurbaz joins Gujarat Titans to replace Jason Roy

ఐపీఎల్ 2022 ప్రారంభం కాక ముందే వ్య‌క్తిగ‌త కార‌ణాలతో లీగ్ నుంచి త‌ప్పుకున్న ఇంగ్లండ్ స్టార్ ఓపెన‌ర్ జేస‌న్ రాయ్ స్థానంలో ఆఫ్ఘ‌నిస్థాన్ స్టార్ వికెట్ కీప‌ర్, బ్యాట‌ర్ అయినా రహ్మానుల్లా గుర్బాజ్‌ను గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్టులో చేర్చుకుంది. ఈ విష‌యాన్ని ఓ అభిమాని సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా వైర‌ల్‌గా మారింది. అయితే దీనిని గుజ‌రాత్ టైటాన్స్ అధికారికంగా ధృవిక‌రించాల్సి ఉంది.

త‌ప్పుకున్న జేస‌న్ రాయ్‌

ఇంగ్లండ్ స్టార్ ఓపెన‌ర్ జేస‌న్ రాయ్‌ను గుజ‌రాత్ టైటాన్స్ బెంగ‌ళూరు వేదిక‌గా జ‌రిగిన మెగా వేలంలో కొనుగోలు చేసింది. అత‌ని బేస్ ప్రైజ్ 2 కోట్ల రూపాయ‌ల‌కు ద‌క్కించుకుంది. అయితే మ‌రో నెల రోజుల్లో ఐపీఎల్ 2022 ప్రారంభం కానుంద‌నే స‌మ‌యంలో గుజ‌రాత్‌కు రాయ్ షాకిచ్చాడు. బ‌యోబ‌బుల్‌లో ఉండ‌లేనంటూ మొత్తం టోర్నీ నుంచే త‌ప్పుకున్నాడు. చాలా కాలంగా బ‌యోబబుల్‌లో ఉంటున్నాన‌ని, అందుకే ప్ర‌స్తుతం త‌న కుటుంబంతో గ‌డ‌పాల‌నుకుంటున్నట్టు చెప్పుకొచ్చాడు. కాగా రాయ్ భార్య ఇటీవ‌ల రెండో సారి ప్ర‌స‌వించింది.

గుజ‌రాత్‌లోకి రహ్మానుల్లా గుర్బాజ్‌

గుజ‌రాత్‌లోకి రహ్మానుల్లా గుర్బాజ్‌

దీంతో జేస‌న్ రాయ్ స్థానంలో ఆఫ్ఘ‌నిస్థాన్ వికెట్ కీప‌ర్, బ్యాట‌ర్‌ రహ్మానుల్లా గుర్బాజ్‌ను గుజ‌రాత్ టైటాన్స్ త‌మ టీంలో చేర్చుకుంది. దీనిపై ఆ జ‌ట్టు త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌నుంది. 20 ఏళ్ల రహ్మానుల్లా గుర్బాజ్ 2017లో ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్ ఆడ‌డం ప్రారంభించాడు. ఇప్ప‌టివ‌ర‌కు రహ్మానుల్లా గుర్బాజ్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌లు లీగ్‌ల్లో అనేక జ‌ట్ల‌కు ప్రాతినిధ్యం వ‌హించాడు. ఈ క్ర‌మంలో ఖుల్నా టైటాన్స్, బార్బడోస్ ట్రైడెంట్స్, ముల్తాన్ సుల్తాన్స్, ఇస్లామాబాద్ యునైటెడ్, జాఫ్నా కింగ్స్ జ‌ట్ల‌కు ర‌హ్మానుల్లా గుర్జాజ్ ప్రాతినిధ్యం వ‌హించాడు.

రహ్మానుల్లా గుర్బాజ్ రికార్డులు

రహ్మానుల్లా గుర్బాజ్ రికార్డులు

20 ఏళ్ల రహ్మానుల్లా గుర్బాజ్ ఇప్పటివరకు అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఆఫ్ఘనిస్తాన్ తరపున 18 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 29.5 సగటుతో 534 పరుగులు చేశాడు. ఇందులో 3 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోరు 79 ప‌రుగులుగా ఉంది. ఇక 9 వ‌న్డే మ్యాచ్‌ల్లో 53 స‌గుటుతో 428 ప‌రుగులు చేశాడు. 3 సెంచ‌రీలు సాధించ‌గా అత్య‌ధిక స్కోర్ 127 ప‌రుగులుగా ఉంది.

ఇటీవ‌ల ముగిసిన పాకిస్థాన్ సూప‌ర్ లీగ్‌ 2022లో ఆరు గేమ్‌లలో 139 పరుగులతో ముగించాడు. సగటు 27.80గా ఉండ‌గా.. స్ట్రైక్‌రేట్‌ 180.51గా ఉంది. అత్యుత్తమ స్కోరు 46 ప‌రుగులు. కాగా ఐపీఎల్ 2022లో ఆల్‌రౌండ‌ర్ హార్ధిక్ పాండ్యా గుజ‌రాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. గుజ‌రాత్ టైటాన్స్ త‌మ తొలి మ్యాచ్‌ను ఈ నెల 28న ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో ఆడ‌నుంది.

గుజ‌రాత్ టైటాన్స్ పూర్తి స్క్వాడ్ 2022

గుజ‌రాత్ టైటాన్స్ పూర్తి స్క్వాడ్ 2022

హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), రషీద్ ఖాన్, శుభ్‌మన్ గిల్, మహ్మద్ షమీ, రహ్మానుల్లా గుర్బాజ్, లాకీ ఫెర్గూసన్, అభినవ్ సదరంగాని, రాహుల్ తెవాటియా, నూర్ అహ్మద్, సాయి కిషోర్, విజయ్ శంకర్, జయంత్ యాదవ్, డొమినిక్ డ్రేక్స్, దర్శన్ నల్కండే, ప్రదీప్ నల్కండే, ప్రదీప్ నల్కండే, యశ్‌ర్వాన్ దయాల్ , డేవిడ్ మిల్లర్, వృద్ధిమాన్ సాహా, మాథ్యూ వేడ్, వరుణ్ ఆరోన్, బి సాయి సుదర్శన్.

Story first published: Tuesday, March 8, 2022, 16:23 [IST]
Other articles published on Mar 8, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X