Aakash Chopra: ఐపీఎల్ వేలంలో శ్రేయస్ అయ్యర్‌ను రూ.20 కోట్లకు ఆర్సీబీ కొనుగోలు!

ఐపీఎల్‌లో 14 ఏళ్ల ప్రయాణం గడిచిపోయిన, హేమాహేమీ ఆటగాళ్లతో బరిలోకి దిగిన ట్రోఫీ గెలవాలనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కళ ఇంతవరకు ఒక్కసారి కూడా నెరవేరలేదు. టీమిండియా కింగ్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ సైతం సుదీర్ఘకాలంగా ఆర్సీబీ కెప్టెన్‌గా ఉన్నప్పటికీ ట్రోఫీ మాత్రం అందించలేకపోయాడు. అతని కెప్టెన్సీలో జట్టును విజయవంతంగా నడిపించాడు కానీ, ట్రోఫీ మాత్రం అందివ్వలేకపోయాడు. ఇక ఈ సారి అయితే కోహ్లీ ఏకంగా కెప్టెన్సీ బాధ్యతల నుంచే తప్పుకున్నాడు.
దీంతో ఈ సారి నూతన కెప్టెన్ కోసం ఆర్సీబీ యాజమాన్యం వేట మొదలు పెట్టింది. ఈ క్రమంలో ఈ సారి కెప్టెన్‌గా వచ్చే వాడు జట్టుకు ట్రోఫీ అందించేలా ఉండాలని ఆర్బీసీ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు.

శ్రేయస్ అయ్యర్‌పై కన్ను
ఈ క్రమంలో శ్రేయస్ అయ్యర్‌పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మెనేజ్‌మెంట్ కన్నేసిందని సమాచారం. మంచి బ్యాటింగ్‌తోపాటు కెప్టెన్సీ నైపుణ్యం ఉన్న శ్రేయస్ అయ్యర్‌ను ఈ సారి మెగా వేలంలో కొనుగోలు చేయాలని ఆర్బీసీ నిర్ణయించుకుందట. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విరాట్ కోహ్లీ స్థానాన్ని భర్తీ చేయడం అయ్యర్ వల్లే అవుతుందని ఆర్సీబీ భావిస్తోందట. అందుకే వేలంలో అయ్యర్ కోసం ఎంత ధర అయినా పెట్టడానికి ఆర్బీసీ సిద్ధంగా ఉందని సమాచారం.

ఆకాశ్ చోప్రా అంచనా
ఈ క్రమంలోనే ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తన యుట్యూబ్ చానెల్‌లో కీలక విషయాలు చెప్పాడు. అతను చెప్పిన దాని ప్రకారం ఈ సారి మెగా వేలంలో శ్రేయస్ అయ్యర్‌ను కొనుగోలు చేయడం కోసం ఆర్సీబీ దాదాపు 20 కోట్ల రూపాయలను సిద్ధంగా ఉంచింది. అంటే అయ్యర్‌ను ఈ సారి వేలంలో 20 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయడానికి ఆర్సీబీ సిద్ధంగా ఉందని చోప్రా అంచనా వేస్తున్నాడు.
ఒక వేళ ఆకాశ్ చోప్రా చెప్పినదే నిజమైతే అది ఐపీఎల్ మెగా వేలంలో అతి పెద్ద రికార్డు అవుతుంది. వేలంలో అత్యధికంగా 20 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిన ఆటగాడిగా శ్రేయర్ అయ్యర్ కొత్త చరిత్ర సృష్టిస్తాడు. కాగా గతేడాది శ్రేయస్ అయ్యర్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ 7 కోట్ల రూపాయలు చెల్లించింది. ఈ ఏడాది ఐపీఎల్ మెగా వేలంలో అయ్యర్ 2 కోట్ల రూపాయల బేస్ ప్రైజ్‌తో ఉన్నాడు.

ఆర్సీబీ రిటెన్షన్ జాబితా
మెగా వేలానికి ముందు ఈ సారి ఆర్సీబీ ముగ్గురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. ఆ జట్టు రిటైన్ చేసుకున్న వారిలో విరాట్ కోహ్లీతోపాటు సిరాజ్, మాక్స్‌వెల్ ఉన్నారు. ఇక గత సంవత్సరం శ్రేయస్ అయ్యర్ ప్రాతినిధ్యం వహించిన ఢిల్లీ క్యాపిటల్స్ నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. ఢిల్లీ రిటెన్షన్ జాబితాలో రిషబ్ పంత్, అక్షర్ పటేల్, పృథ్వీ షా, నోర్జే ఉన్నారు.

అయ్యర్ రికార్డులు
ఐపీఎల్‌లో ఇప్పటివరకు 87 మ్యాచ్‌లు ఆడిన శ్రేయస్ అయ్యర్ 31 సగటుతో 2,375 పరుగులు చేశాడు. ఇందులో 16 హాఫ్ సెంచరీలు ఉండగా.. అత్యధిక స్కోర్ 96 పరుగులు. 123 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో అయ్యర్ 196 ఫోర్లు, 88 సిక్స్‌లు బాదాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications