Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2022: విరాట్ కోహ్లీ ఆర్సీబీ కెప్టెన్‌గా ఇంకోక‌ సంవ‌త్సరం ఎందుకు ఉండ‌కూడ‌దు?

IPL 2022: Aakash Chopra Questions Virat kohli Why Not One More Year As RCB Captain
IPL 2022 : Virat Kohli Has No Chance Of Becoming RCB Captain Again | Oneindia Telugu

రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ ఇంకొక సంవ‌త్స‌రం ఎందుకు ఉండ‌కూడ‌ద‌ని భార‌త మాజీ క్రికెట‌ర్, ప్ర‌ముఖ కామేంటేట‌ర్ ఆకాశ్ చోప్రా ప్ర‌శ్నించాడు. రాబోయే ఐపీఎల్ 2022 కోసం రాయ‌ల్ చాలెంజ‌ర్స్ కెప్టెన్సీ రేసులో విరాట్ కోహ్లీ కూడా ఒక‌డ‌ని చెప్పుకొచ్చాడు. విరాట్ కోహ్లీ రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు కెప్టెన్సీ నుంచి త‌ప్పుకున్న‌ప్పుడు, టీమిండియా టీ20 కెప్టెన్సీ నుంచి కూడా త‌ప్పుకున్నాడ‌ని ఆయ‌న గుర్తు చేశాడు. ఆ సమ‌యంలో టీమిండియా టెస్టు, వ‌న్డే కెప్టెన్‌గా కొన‌సాగాల‌ని విరాట్ కోహ్లీ భావించాడ‌ని చెప్రా గుర్తు చేశాడు. కానీ అలా జ‌ర‌గ‌లేద‌ని విరాట్ కోహ్లీ టీమిండియా అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీకి దూర‌మ‌య్యాడ‌ని అన్నాడు. ప్ర‌స్తుతం అన్ని ఫార్మాట్ల‌లో కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ కొన‌సాగుతున్నాడ‌ని చోప్రా చెప్పుకొచ్చాడు.

ప్ర‌స్తుతం అన్ని ఫార్మాట్ల‌లో కెప్టెన్సీ నుంచి త‌ప్పుకున్న విరాట్ కోహ్లీని ఐపీఎల్ 2022లో కెప్టెన్‌గా ఉండ‌డానికి ఒప్పించాల‌ని రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు యాజ‌మాన్యానికి ఆకాశ్ చోప్రా సూచించాడు. ప్ర‌స్తుతం కోహ్లీ ఎక్క‌డ కూడా కెప్టెన్‌గా లేనందు వ‌ల్ల అత‌నిపై ప‌ని భారం కూడా లేద‌ని అన్నాడు. అందుకే కోహ్లీని మ‌ళ్లీ కెప్టెన్సీ చేప‌ట్టేలా అభ్య‌ర్థించాల‌న్నాడు. ప్ర‌స్తుతం ఆర్సీబీ కెప్టెన్సీ రేసులో ఫాఫ్ డుప్లిసెస్, దినేష్ కార్తీక్, గ్లెయిన్ మాక్స్‌వెల్‌తోపాటు విరాట్ కోహ్లీ కూడా ఉంటాడ‌ని ఆయ‌న చెప్పుకొచ్చాడు. ప్ర‌స్తుతం చెన్నైసూప‌ర్ కింగ్స్ కెప్టెన్‌గా ఉన్న మహేంద్ర‌సింగ్ ధోని భార‌త జ‌ట్టు కెప్టెన్‌గా త‌ప్పుకున్న‌ప్ప‌టికీ ఐపీఎల్‌లో మాత్రం కెప్టెన్‌గానే ఉన్నాడ‌ని చెప్పుకొచ్చాడు. అలాగే విరాట్ కోహ్లీ కూడా కెప్టెన్సీ చేప‌ట్టాల‌న్నాడు. ఇక గ‌త రెండు సీజ‌న్ల‌లో ఆర్సీబీ ప్లేఆఫ్ వ‌ర‌కు చేరుకుంద‌ని గుర్తు చేశాడు. చివ‌రి రెండు సీజ‌న్ల‌లో ఆ జ‌ట్టు ఎలిమినేట‌ర్ ద‌శ‌లోనే ఇంటి దారి ప‌ట్టింద‌ని చెప్పుకొచ్చాడు. కాగా యూఏఈ వేదిక‌గా జ‌రిగిన గ‌త ఐపీఎల్‌లో కోల్‌క‌తానైట్ రైడ‌ర్స్ చేతిలో ఆర్సీబీ ఓట‌మిపాలైంది.

రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు పూర్తి జ‌ట్టు
విరాట్ కోహ్లీ(15 కోట్లు), మ్యాక్స్‌వెల్‌తో(11 కోట్లు), మహమ్మద్ సిరాజ్‌(7 కోట్లు), వానిందు హసరంగ (10.75 కోట్లు), హర్షల్‌ పటేల్‌(10.75 కోట్లు), డుప్లెసిస్ ( 7 కోట్లు), దినేశ్‌ కార్తీక్‌(5.5 కోట్లు), జోష్‌ హేజిల్ వుడ్ (7.75 కోట్లు), షాబాజ్‌ అహ్మద్‌(2.4 కోట్లు), అనుజ్‌ రావత్‌(3.4 కోట్లు), డేవిడ్‌ విల్లే ( 2 కోట్లు), షెర్ఫానే రూథర్‌ఫోర్డ్ (కోటి) మహిపాల్‌ లామ్రోర్‌(95 లక్షలు), ఫిన్‌ అలెన్ ( 80 లక్షలు), జేసన్‌ బెహ్‌రెండోర్ఫ్ ( 75 లక్షలు), సిద్ధార్థ్‌ కౌల్‌(75 లక్షలు), కర్ణ్‌ శర్మ(50 లక్షలు), చామ మిలింద్‌(25 లక్షలు), సుయాశ్‌ ప్రభుదేశాయ్‌(30 లక్షలు), ఆకాశ్‌ దీప్‌, అనీశ్వర్‌ గౌతమ్‌, లువ్‌నిత్‌ సిసోడియా(వీరంద‌రికీ 20 లక్షలు).

Story first published: Wednesday, March 9, 2022, 18:26 [IST]
Other articles published on Mar 9, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+