
డేవిడ్ వార్నర్, రోవ్‌మన్ పావెల్‌ల అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో ఢిల్లీ క్యాపిటల్స్ గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 21 పరుగుల తేడాతో ఓడించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం లీగ్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో సన్‌రైజర్స్ ఉంది. ఇక ఈ మ్యాచ్‌లో బౌలర్ ఉమ్రాన్ మాలిక్ భారీగా పరుగులిచ్చాడు. అయినప్పటికీ ఉమ్రాన్ మాలిక్ తన థండర్‌బోల్ట్ స్పీడ్ డెలివరీలతో బౌలింగ్ చేశాడు. జమ్మూకి చెందిన 22ఏళ్ల ఈ యువ బౌలర్ సాధారణంగా 150కి.మీల వేగంతో బౌలింగ్ వేస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఇక ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో 157 కి.మీల వేగవంతమైన డెలివరీ వేసి.. ఈ ఐపీఎల్ సీజన్లో అత్యంత వేగవంతమైన డెలివరీ వేసిన ప్లేయర్‌గా నిలిచాడు. ఐపీఎల్ సీజన్‌లో వేగవంతమైన డెలివరీని బౌలింగ్ చేసినందుకు ప్రముఖుల ప్రశంసలు అందుకున్నాడు. కానీ అతను ఈ మ్యాచ్‌లో తన నాలుగు ఓవర్ల స్పెల్‌లో 0/52ప్రదర్శన కనబరిచాడు. వికెట్లేం తీయకుండా 52పరుగులివ్వడం అతనికి కొంత మైనస్ అవుతుంది.
ఇంత వేగవంతమైన డెలివరీలు వేస్తున్న ఉమ్రాన్ మాలిక్‌ను టీ20 ప్రపంచకప్ కోసం టీమిండియా జట్టులోకి తీసుకోవాలంటూ సర్వత్రా కామెంట్లు వస్తుండగా దీనిపై భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా స్పందించాడు. ఉమ్రాన్ తన చివరి రెండు ఐపీఎల్ మ్యాచ్‌లలో 100పరుగులు ఇచ్చాడు. అతన్ని టీమిండియాలోకి ఎంపిక చేయాలని తొందరపెట్టొద్దన్నాడు. గంటకు 150కి.మీ వేగంతో బౌలింగ్ చేస్తే దేశం తరఫున ఆడాలనే రూల్ భారత్‌లో ఉందన్నాడు. అతను గత రెండు మ్యాచ్‌లలో తన చివరి ఎనిమిది ఓవర్లలో వంద పరుగులు ఇచ్చాడు. అతనికి కొంత సమయం ఇవ్వాలని.. అతను టీమిండియాకు ఆడాలని తాను కోరుకుంటున్నాను.. కానీ అంతర్జాతీయ క్రికెట్ ఆడటానికి అతన్ని తొందరపెట్టవద్దని తన యూట్యూబ్ ఛానెల్‌లో పేర్కొన్నాడు.
గత నెలలో వాంఖడే స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తన అద్భుతమైన బౌలింగ్‌తో ఐదు వికెట్లు తీసిన తర్వాత అతను వరుసగా రెండు మ్యాచుల్లో ఒక్క వికెట్ కూడా తీయలేదు. వేగవంతమైన బౌలింగ్‌తో అద్భుతమైన రికార్డులు సాధిస్తున్నప్పటికీ ఉమ్రాన్ భారీగా పరుగులిచ్చేస్తున్నాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో మాలిక్ తన నాలుగు ఓవర్లలో 52పరుగులు ఇచ్చాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను నాలుగు ఓవర్లలో వికెట్ లేకుండా 48పరుగులు ఇచ్చాడు. మొత్తం 8ఓవర్లలో వికెట్లేం తీయకుండా 100పరుగులు ఇచ్చేశాడు. అంటే 48బంతుల్లో 100 పరుగులన్న మాట. అతని ఎకానమీ 12కంటే ఎక్కువగా నమోదైంది.