IPL 2022: కేకేఆర్ దారుణ ఓటమికి 5 తప్పిదాలు ఇవే

ఐపీఎల్ 2022 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో శనివారం లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో 75 పరుగుల భారీ తేడాతో ఓటమిని చవిచూసింది. ఈ ఘోర పరాజయంతో కేకేఆర్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. టోర్నీలో మిగిలిన మూడు మ్యాచ్‌లకు మూడు గెలిచినా ఆ జట్టు ముందడుగు వేయలేని పరిస్థితి తెచ్చుకుంది. ప్రస్తుతం 8పాయింట్లతో 8వ స్థానంలో ఉన్న ఆ జట్టు.. చివరి మూడు గెలిచినా 14పాయింట్లకే పరిమితమవుతుంది. కనీసం 16పాయింట్లు సాధిస్తేనే ప్లేఆఫ్ చేరే అవకాశముంటుంది.
కాగా ఈ మ్యాచ్‌లో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులు చేయగా.. అనంతరం లక్ష్యచేధనకు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 14.3 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలింది. కేకేఆర్ బ్యాటర్లలో ఆండ్రీ రస్సెల్(19 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 45), సునీల్ నరైన్(12 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 22) మినహా అంతా విఫలమయ్యారు. ఈ మ్యాచ్ విషయానికొస్తే కేకేఆర్ చేసిన 5తప్పిదాలు ఆ జట్టు కొంపముంచాయి.

25పరుగులకే 4వికెట్లు కోల్పోయి..
భారీ లక్ష్యచేధనకు దిగిన కేకేఆర్ 25పరుగులకే 4కీలక వికెట్లు కోల్పోయింది. బాబా ఇంద్రజీత్(0)తో పాటు, శ్రేయస్ అయ్యర్ (6), ఆరోన్ ఫించ్(14), నితీశ్ రాణా(2) వరుసగా పెవిలియన్ చేరడంతో ఆ జట్టుకు కోలుకోలేని దెబ్బపడింది. 177పరుగుల టార్గెట్ ఛేదించాలంటే ఓపెనింగ్, గానీ వన్ డౌన్ భాగస్వామ్యం గానీ మినిమం 50కి మించి ఉంటే.. మిడిలార్డర్, లోయర్ ఆర్డర్ బ్యాటర్లపై ప్రెషర్ పడకుండా ఉంటుంది.

ఆండ్రీ రస్సెల్‌కు మద్దతు ఇచ్చే బ్యాటర్లేరి
25పరుగులకే 4వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ఆ జట్టుకు ఉన్న ఏకైక హోప్ ఆండ్రీ రస్సెల్. నలుగురు టాపార్డర్ బ్యాటర్లు ఔటయినా.. రస్సెల్ ఉన్నాడన్న ధీమా కోల్ కతా జట్టులో ఉంటుంది. ఎందుకంటే ఒంటి చేత్తో గెలిపించే సత్తా రస్సెల్ సొంతం. ఇక ఓ వైపు రస్సెల్ (19బంతుల్లో 45) లక్నో బౌలర్లను చెడుగుడు ఆడుకుంటుంటే.. మరోవైపు క్రీజులో ఉన్న బ్యాటర్లు టెస్ట్ మ్యాచ్‌లాగా ఆడారు. రస్సెల్ కు సరైన మద్దతు దొరకకపోవడంతో రన్ రేట్ వల్ల అతను హిట్టింగ్ కోసమే చూసి ఔటయ్యాడు. మరో ఎండ్‌లో ఉన్న బ్యాటర్లు కాస్త దూకుడు ప్రదర్శించినా.. రస్సెల్ పై అంత ఒత్తిడి పెరిగేది కాదు.

ప్రభావం చూపని బౌలర్లు
ఇక కేకేఆర్ బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. బౌలింగ్ భారాన్ని కూడా సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్ మోశారు. ఇక అనుకూల్ రాయ్, హర్షిత్ లాంటి కొత్త బౌలర్లు లక్నో బ్యాటర్ల ధాటికి తేలిపోయారు. ఇక శివమ్ మావి అయితే ఏకంగా 4ఓవర్లలో 50పరుగులిచ్చి మ్యాచ్ గమనాన్నే మార్చేశాడు. చివరి ఓవర్‌కు ముందు ఓవర్లో 30పరుగులిచ్చి మావి పెద్దతప్పే చేశాడు.

మార్కస్ స్టాయినిస్, జాసన్ హోల్డర్ రాపిడ్ ఫైర్
లక్నో స్కోరు 150 దాటిందంటే దానికి కారణం.. ఆ జట్టు ఆల్ రౌండర్లు మార్కస్ స్టాయినిస్, జాసన్ హోల్డర్‌లదే. స్టాయినిస్ శివమ్ మావి వేసిన 19వ ఓవర్లో 3సిక్సర్లు బాది ఔటవ్వగా.. తర్వాత వచ్చిన హోల్డర్ రెండు సిక్సర్లు బాది ఆ ఓవర్లో 30పరుగులు పిండుకున్నారు. దీంతో స్కోరు 150కి పరిమితం కావాల్సింది.. 176కు చేరుకుంది

తుది జట్టు ఎంపికలో లోపం
ఇక కేకేఆర్ తన తుది జట్టు ఎంపికలో లోపం కన్పించింది. ఆ జట్టు దేశవాళీ ప్లేయర్ల ఎంపికలో సరైన వ్యూహం అమలుపర్చలేదు. ఇక ఓపెనర్ గా బాబా ఇంద్రజిత్‌ను పంపడం ఇంతటి కీలక మ్యాచ్‌లో దెబ్బతీసింది. నితీష్ రానాను ఓపెనింగ్ పంపి ఉంటే ఓ మోస్తరు స్టార్టింగ్ అయినా దక్కేది. ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ కమ్మిన్స్ ను పక్కన పెడుతుంది. సౌతీతో పోల్చితే కమ్మిన్స్ మంచి ప్లేయర్. హిట్టింగ్ చేయగల సమర్థుడు. అతన్ని ఎందుకు పక్కన పెడుతుందో అర్థం కావట్లేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications