Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సోయి లేకుండా ఆడితే రిజల్ట్ ఇట్లనే ఉంటది: వరుసగా అయిదో మ్యాచ్‌లో ఓటమికి 5 కారణాలివే

IPL 2022: 5 reasons why KKR lost the 5th consecutive match against DC

ముంబై: ఐపీఎల్‌ 2022 సీజన్‌ సెకెండ్ హాఫ్‌లోనూ కోల్‌కత నైట్‌రైడర్స్ పుంజుకోవట్లేదు. మరో మ్యాచ్‌లోనూ ఓడింది. ఈ టోర్నమెంట్‌లో వరుసగా అయిదో ఓటమి ఇది. ఆరంభంలో ఫర్వాలేదనిపించుకుంటూ వచ్చిన కేకేఆర్ పరిస్థితి ఇప్పుడు దయనీయంగా తయారైంది. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌కు తోడుగా నిలిచింది. గురువారం రాత్రి ముంబై వాంఖెడె స్టేడియంలో ఢిల్లీ కేపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చిత్తుగా ఓడింది.

1
53650
1
4-2022
ప్యాకప్ తప్పనట్టే..

ప్యాకప్ తప్పనట్టే..

ఇప్పటివరకు ఆడిన తొమ్మిది మ్యాచ్‌లల్లో శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలోని ఈ జట్టు గెలిచింది ముచ్చటగా మూడే. ప్లే ఆఫ్ అవకాశాలను పోగొట్టుకున్నట్టే కనిపిస్తోంది. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఇంకో అయిదు మ్యాచ్‌లను ఆడాల్సి ఉందీ జట్టు. తన తదుపరి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను ఢీ కొట్టనుంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో రెండు, ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఒక్కొక్క మ్యాచ్‌ను ఆడుతుంది.

పేకమేడలా బ్యాటింగ్..

పేకమేడలా బ్యాటింగ్..

ఢిల్లీ కేపిటల్స్‌తో మ్యాచ్ నాటికే వరుసగా నాలుగింట్లో ఓడింది కోల్‌కత. ఆ మాత్రం సోయి కూడా లేకుండా ఆడారు బ్యాటర్లు. బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం పేకమేడలా కుప్పకూలింది. ముగ్గురు బ్యాటర్లు మాత్రమే డబుల్ డిజిట్స్ స్కోర్ చేశారంటే- ఎంత అధ్వాన్నంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆరోన్ ఫించ్-3, వెంకటేష్ అయ్యర్-6, బాబా ఇంద్రజిత్-6, సునీల్ నరైన్-0, ఆండ్రీ రస్సెల్-0, టిమ్ సౌథీ-0 పరుగులు చేశారు. టాప్ ఆర్డర్‌లో కేప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 37 బంతుల్లో 42, మిడిల్ ఆర్డర్‌లో నితీష్ రాణా-57, లోయర్ ఆర్డర్‌లో రింకూ సింగ్-23 దయ వల్ల కోల్‌కత ఆ మాత్రం పరుగులు చేయగలిగింది.

 ఓపెనర్లు మళ్లీ విఫలం..

ఓపెనర్లు మళ్లీ విఫలం..

కోల్‌కత నైట్‌రైడర్స్ ఓపెనర్ల పరిస్థితి పేరు గొప్ప.. ఊరు దిబ్బలా తయారయ్యారు. వెంకటేష్ అయ్యర్ మళ్లీ మళ్లీ విఫలమౌతూనే ఉన్నాడు. ఎనిమిది కోట్ల రూపాయలతో అతణ్ని జట్టులోనే అట్టి పెట్టుకుంది కేకేఆర్ ఫ్రాంఛైజీ. ఆ నమ్మకానికి తగ్గట్టుగా ఆడట్లేదు. తొమ్మిది మ్యాచ్‌లల్లో అతను చేసింది 132 పరుగులే. ఇందులో ఒకే ఒక్క అర్ధసెంచరీ ఉంది. 16.50 స్ట్రైక్ రేట్‌‌తో సాగిందని బ్యాటింగ్ సగటు. మరో ఓపెనర్ ఆరోన్ ఫించ్ ఇంకా గాడినపడలేదు. ఇది అతనికి మూడో మ్యాచ్.

35 పరుగులకే నాలుగు వికెట్ల డౌన్

35 పరుగులకే నాలుగు వికెట్ల డౌన్

35 పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయిన జట్టు 146 పరుగుల వరకు వెళ్లగలిగిందంటే శ్రేయాస్ అయ్యర్-నితీష్ రాణా చలవే. ఇద్దరు క్రీజ్‌లో కుదురుకున్నారు. జట్టుకు చెప్పుకోదగ్గ భాగస్వామ్యాన్ని అందించారు. 34 బంతుల్లో రాణా 57 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సిక్సర్లు, మూడు ఫోర్లు ఉన్నాయి. చివర్లో రింకూ సింగ్ మూడు ఫోర్లు బాదేయడంతో ఆ మాత్రం స్కోరయినా చేయగలిగింది కోల్‌కత నైట్ రైడర్స్.

రెండు రన్లకే మూడు వికెట్లు..

రెండు రన్లకే మూడు వికెట్లు..

చివరి ఓవర్‌లో మూడు వికెట్లు పడటం కూడా దెబ్బకొట్టింది. చివరి ఓవర్‌లో రెండు పరుగులు మాత్రమే చేసింది కోల్‌కత. ఇందులో ఒకటి లెగ్‌బై. మూడు వికెట్లను కోల్పోయింది. ముస్తాఫిజుర్ రెహ్మాన్ వేసిన చివరి ఓవర్‌లో నితీష్ రాణా భారీ షాట్లు ఆడలేకపోయాడు. తొలి బంతికి సింగిల్ తీసి నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌లోకి వెళ్లడం పొరపాటే. ఆ తరువాతి బంతికే రింకూ సింగ్ అవుట్ అయ్యాడు. మూడో బంతి లెగ్‌బై. నాలుగో బంతిని భారీ షాట్ ఆడబోయి అవుట్ అయ్యాడు. అయిదో బంతికి వికెట్ పడటంతో రెండు పరుగులకే మూడు వికెట్లను కోల్పోయినట్టయింది.

 కుల్‌దీప్ మాయాజాలం..

కుల్‌దీప్ మాయాజాలం..

కుల్‌దీప్ యాదవ్ మాయాజాలంలో చిక్కుకుంది కోల్‌కత. మూడు ఓవర్లల్లో 14 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. శ్రేయాస్ అయ్యర్, బాబా ఇంద్రజిత్, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్ అతనికి బలి అయ్యారు. ముస్తాఫిజుర్ రెహ్మాన్, చేతన్ సకారియా బౌలింగ్‌ను ఎదుర్కొనలేక చేతులెత్తేశారు. శార్దుల్ ఠాకూర్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్ బౌలింగ్‌లో మాత్రమే పరుగులను రాబట్టుకోగలిగారు.

Story first published: Friday, April 29, 2022, 8:06 [IST]
Other articles published on Apr 29, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+