Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2022: మెగా వేలంలో రూ.15 కోట్ల‌కు పైగా ధ‌ర‌కు అమ్ముడుపోనున్న ఐదుగురు ఆట‌గాళ్లు వీళ్లే!

IPL 2022: 5 Players Who Will Be Sold For More Than 15 Crores In The Auction

బెంగ‌ళూరు: క్రికెట్ అభిమానులంతా చాలా కాలంగా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న‌ ఐపీఎల్ మెగా వేలానికి స‌మ‌యం ఆస‌న్న‌మైంది. మ‌రి కొన్ని గంట‌ల్లోనే మెగా వేలం ప్రారంభం కాబోతుంది. ఈ నేప‌థ్యంలో మెగా వేలంలో అత్య‌ధిక ధ‌ర‌కు అమ్ముడుపోయే ఆట‌గాళ్లు ఎవ‌ర‌నే చ‌ర్చ నడుస్తుంది. ఈ క్ర‌మంలో క్రికెట్ విశ్లేష‌కులు అత్య‌ధిక ధ‌ర‌కు అమ్ముడుపోయే ప‌లువురు ఆట‌గాళ్ల గురించి చ‌ర్చిస్తున్నారు.

ఐదుగురికి అత్య‌ధిక ధ‌ర‌

ఐదుగురికి అత్య‌ధిక ధ‌ర‌

మెగా వేలంలో ఐదుగురు ఆట‌గాళ్లు భారీ ధ‌ర‌కు అమ్ముడుపోతార‌ని క్రికెట్ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఆ ఐదుగురు టోర్నీ చ‌రిత్ర‌లోనే ఎన్న‌డూ లేని విధంగా కోట్ల రూపాయ‌ల ధ‌ర ప‌లుకుతార‌ని వారు అంచ‌నా వేస్తున్నారు. ఆ ఐదుగురిని టీమిండియా యువ ఆట‌గాళ్లు శ్రేయ‌స్ అయ్య‌ర్‌, ఇషాన్ కిష‌న్‌తోపాటు ఆస్ట్రేలియా డ్యాషింగ్ ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్‌, ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ పాట్ క‌మిన్స్‌, సౌతాఫ్రికా పేస‌ర్ క‌గిసో ర‌బాడ‌గా పేర్కొంటున్నారు. ఈ ఐదుగురు మెగా వేలంలో రికార్డు స్థాయిలో 15 కోట్ల రూపాయ‌ల‌కు పైగా ధ‌ర‌కు అమ్ముడుపోతార‌ని క్రికెట్ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

గ‌తంలో వార్న‌ర్, క‌మిన్స్‌కు ఎంతంటే?

గ‌తంలో వార్న‌ర్, క‌మిన్స్‌కు ఎంతంటే?

ఐపీఎల్‌లో గ‌త సీజ‌న్లో ఆస్ట్రేలియా ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హించాడు. ఇందుకుగాను స‌న్‌రైజ‌ర్స్ అత‌నికి 12 కోట్ల రూపాయ‌లు చెల్లించింది. అయితే ఈ సారి స‌న్‌రైజ‌ర్స్ రిటెన్ష‌న్ జాబితాలో వార్న‌ర్‌కు చోటు ద‌క్కలేదు. దీంతో మెగా వేలంలో పాల్టొంటున్నాడు. ఈ వేలంలో డేవిడ్ వార్నర్ 2 కోట్ల రూపాయ‌ల బేస్ ప్రైజ్‌తో ఉన్నాడు. ఇక మ‌రో ఆస్ట్రేలియా ఆట‌గాడు పాట్ క‌మిన్స్ ఐపీఎల్‌లో గ‌త సీజ‌న్లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌కు ప్రాతినిధ్యం వ‌హించాడు. ఇందుకుగాను క‌మిన్స్‌కు ఆ జ‌ట్టు రికార్డు స్థాయిలో 15.5 కోట్ల రూపాయ‌లు చెల్లించింది. అయితే ఈ సారి ఆ జ‌ట్టు రిటెన్ష‌న్ జాబితాలో చోటు ద‌క్క‌క‌పోవ‌డంతో 2 కోట్ల రూపాయ‌ల బేస్ ప్రైజ్‌తో వేలంలో ఉన్నాడు.

గ‌తంలో కిష‌న్‌, శ్రేయ‌స్‌కు ఎంతంటే?

గ‌తంలో కిష‌న్‌, శ్రేయ‌స్‌కు ఎంతంటే?

గ‌తంలో శ్రేయ‌స్ అయ్య‌ర్ ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు ప్రాతినిధ్యం వ‌హించాడు. అయ్య‌ర్‌కు ఆ జ‌ట్టు 7 కోట్ల రూపాయ‌లు చెల్లించింది. కానీ ఈ సారి 2 కోట్ల రూపాయ‌ల బేస్ ప్రైజ్‌తో అయ్య‌ర్ మెగా వేలంలోకి వ‌చ్చాడు. ఇక ఇషాన్ కిష‌న్ విష‌యానికొస్తే అత‌ను గ‌తంలో ముంబై ఇండియ‌న్స్‌కు ప్రాతినిధ్యం వ‌హించాడు. ఆ స‌మ‌యంలో ముంబై అత‌నికి 6.20 కోట్ల రూపాయ‌లు చెల్లించింది. కానీ ఈ సారి ముంబై రిటెన్ష‌న్ జాబితాలో కిష‌న్‌కు చోటు ద‌క్క‌లేదు. దీంతో 2 కోట్ల రూపాయ‌ల బేస్ ప్రైజ్‌తో మెగా వేలంలో ఉన్నాడు.

ర‌బాడ‌కు ఎంతంటే?

ర‌బాడ‌కు ఎంతంటే?

గ‌తంలో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు ప్రాతినిధ్యం వ‌హించిన క‌గిసో ర‌బాడ‌కు ఆ జ‌ట్టు 4.20 కోట్ల రూపాయ‌లు చెల్లించింది. అయితే ఈ సారి ఆ జ‌ట్టు రిటెన్ష‌న్ జాబితాలో ర‌బాడ‌కు చోటు ద‌క్క‌లేదు. దీంతో 2 కోట్ల రూపాయ‌ల బేస్ ప్రైజ్‌తో ర‌బాడ మెగా వేలంలోకి వ‌చ్చాడు. అయితే వీరంతా మెగా వేలంలో 15 కోట్ల‌కుపైగా ధ‌ర పలుకుతార‌ని క్రికెట్ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. వారి అంచ‌నా ఎంత వ‌ర‌కు నిజం అవుతుందో తెలియాలంటే మ‌రికొన్ని గంట‌లు ఆగాల్సిందే.

Story first published: Friday, February 11, 2022, 20:51 [IST]
Other articles published on Feb 11, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+