IPL 2022: లక్నో సూపర్ జెయింట్స్‌ను ముంచిన నాలుగు ఘోర తప్పిదాలు!

హైదరాబాద్: ఐపీఎల్ 2022 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ కథ ముగిసింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో బుధవారం జరిగిన కీలక ఎలమినేటర్ మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన లక్నో.. 14 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సునాయసంగా గెలిచే మ్యాచ్‌ను లక్నో చేజేతులా చేజార్చుకుంది. ముందుగా చెత్త ఫీల్డింగ్‌తో భారీ స్కోర్ ఇచ్చిన లక్నో.. ఆ తర్వాత గజిబిజి బ్యాటింగ్ ఆర్డర్‌తో ఓటమికి తల వంచింది. మొత్తానికి ఓ నాలుగు తప్పిదాలు రాహుల్ సేన పతనాన్ని శాసించాయి. ఈ నాలుగు తప్పిదాలు చేయకుండా ఉంటే లక్నో క్వాలిఫయర్ 2కు సిద్దమయ్యేది.

 చెత్త ఫీల్డింగ్..

చెత్త ఫీల్డింగ్..

లక్నో సూపర్ జెయింట్స్ ఓటమికి ప్రధాన కారణం చెత్త ఫీల్డింగ్. నిన్న జరిగిన మ్యాచ్‌లో ఇరు జట్లకు ఉన్న తేడా కూడా ఇదే. లక్నో ఫీల్డింగ్‌లో తడబడితే.. ఆర్‌సీబీ అద్భుతమైన ఫీల్డింగ్‌తో అదరగొట్టింది. అసాధారణ ప్రదర్శనతో అనేక పరుగులను ఆపింది. ఇక లక్నో మాత్రం నాలుగు కీలక క్యాచ్‌లతో పాటు రనౌట్ చేసే అవకాశాన్ని చేజార్చుకుంది. 2 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద దినేశ్ కార్తీక్ ఇచ్చిన క్యాచ్‌ను కేఎల్ రాహుల్ నేలపాలు చేశాడు. నాలుగు బంతుల అనంతరం రజత్ పటీదార్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను దీపక్ హుడా విడిచిపెట్టాడు. క్యాచ్ వదిలేయడమే కాకుండా బౌండరీ ఇచ్చాడు. ఇన్నింగ్స్ చివర్లో కూడా పటీదార్ ఇచ్చిన రెండు క్యాచ్‌లను వదిలేసారు. ఈ అవకాశాలతో ఆర్‌సీబీ బ్యాటర్లు చెలరేగారు. వీరి ఇచ్చిన క్యాచ్‌లు పట్టి ఉంటే.. ఆర్‌సీబీ 180 పరుగుల లోపే పరిమితమయ్యేది. అప్పుడు లక్నో విజయానికి సులువయ్యేది.

 చివరి 5 ఓవర్లలో 84 పరుగులు...

చివరి 5 ఓవర్లలో 84 పరుగులు...

డుప్లెసిస్‌ను గోల్డెన్ డక్ చేసి ఆర్‌సీబీకి ఆరంభంలోనే షాకిచ్చిన లక్నో.. ఆ తర్వాత కోహ్లీ(25), మహిపాల్ లోమ్రోర్, గ్లేన్ మ్యాక్స్(9)లను త్వరగా పెవిలియన్ చేర్చింది. 15 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసిన ఆర్‌సీబీ 180 పరుగులు కూడా చేస్తుందో లేదో అనిపించింది. కానీ దినేశ్ కార్తీక్(37 నాటౌట్), రజత్ పటిదార్(112 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో జట్టు స్కోర్‌ను 200 ధాటించారు. వీరిద్దరి విధ్వంసంతో లక్నో బౌలర్లు చివరి 5 ఓవర్లలో 84 పరుగులు సమర్పించుకున్నారు. క్యాచ్‌లు నేలపాలు చేయడంతో బౌలర్లు ఏం చేయలేకపోయారు. బిష్ణోయ్ అయితే తన చివరి ఓవర్‌లో పటీదార్ దెబ్బకు 27 పరుగులు ఇచ్చుకున్నాడు. దాంతో లక్నో డెత్ ఓవర్లలో అదనంగా 20-25 పరుగులు సమర్పించుకుంది. ఈ పరుగులు ఇవ్వకుండా కట్టడి చేసుంటే ఆర్‌సీబీ 175 పరుగులకే పరిమితమయ్యేది. అప్పుడు విజయానికి అవకాశం ఉండేది.

 గజిబిజి బ్యాటింగ్ ఆర్డర్..

గజిబిజి బ్యాటింగ్ ఆర్డర్..

భారీ లక్ష్యచేధనకు లక్నో సరైన ప్రణాళికలతో బరిలోకి దిగలేదు. అసలు ఆ జట్టు సరైన బ్యాటింగ్ ఆర్డర్‌నే సెట్ చేసుకోలేదు. రాహుల్, డికాక్, వోహ్రా, ఎవిన్ లూయిస్ రూపంలో నలుగురు ఓపెనర్లు ఉండటం ఆ జట్టుకు చేటు చేసింది. ఆరంభంలోనే డికాక్ ఔట్ అవ్వడంతో వోహ్రాను బరిలోకి దించింది. అయితే ఇక్కడ వోహ్రాకు బదులు లూయిస్‌ను పంపిస్తే ఫలితం మరోలా ఉండేదని విశ్లేషకులు అంచనా. ఆ తర్వాత హుడా, మార్కస్ స్టోయినిస్‌ను పంపించిన లక్నో టీమ్‌మేనేజ్‌‌మెంట్ లూయిస్‌ను 6వ స్థానంలో బ్యాటింగ్‌కు పంపింది. ఇదే ఆ జట్టు చేసిన ఘోర తప్పిదం. స్టోయినిస్ స్థానంలో లూయిస్ వచ్చి ఉన్నా.. జట్టుకు అడ్వాంటేజ్‌గా మారేది. సరైన బ్యాటింగ్ ప్రణాళికలు లేకుండా లక్నో ఓటమికి తలవంచింది.

 కేఎల్ రాహుల్ స్లో బ్యాటింగ్..

కేఎల్ రాహుల్ స్లో బ్యాటింగ్..

ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్( 58 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 79) హాఫ్ సెంచరీతో రాణించినా జట్టుకు విజయాన్నందించలేకపోయాడు. డికాక్ ఆరంభంలోనే ఔటవ్వడంతో తన శైలికి తగ్గట్లు నెమ్మదిగా ఆడిన రాహుల్.. కీలక సమయంలో వేగంగా పరుగులు చేయలేకపోయాడు. బ్యాటింగ్‌కు అనుకూలమైన వికెట్‌పై క్రీజులో సెట్ అయిన తర్వాత కూడా రాహుల్.. భారీ షాట్లకు ప్రయత్నించలేదు. దాంతో చేధించాల్సిన రన్ రేట్ పెరిగి బ్యాటర్లపై ఒత్తిడి నెలకొంది. అయితే రాహుల్ ముందు నుంచే వేగంగా ఆడి ఉంటే ఇతర బ్యాటర్లు కూడా స్వేచ్చగా ఆడేవారు.

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Thursday, May 26, 2022, 10:11 [IST]
Other articles published on May 26, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X