For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

శివ..శివా: కొంపముంచితివి కదయ్యా: చెన్నై ఓటమికి కారణాలివే: కేప్టెన్‌గా జడేజా అట్టర్ ఫ్లాప్

Here is the Four Reasons for Why Chennai Super King Lost There second Match Against Lucknow Super Giants.

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్పై సూపర్ కింగ్స్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓడిపోయింది. తొలి రెండు మ్యాచ్‌లల్లో ఈ టీమ్ పరాజయం పాలవడం ఇదే తొలిసారి. ఇప్పటిదాకా ఆడిన తొలి రెండింట్లో ఓడిన సందర్భాలు లేవు. ఆరంభ మ్యాచ్‌లో కోల్‌కత నైట్ రైడర్స్ , తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో పరాభవాన్ని చవి చూసింది. భారీ స్కోర్ సాధించినప్పటికీ- దాన్ని విజయంగా మలచుకోలేకపోయిందీ టైటిల్ హాట్ ఫేవరెట్ టీమ్.

 మ్యాచ్‌ల మధ్య తేడా ఇదీ..

మ్యాచ్‌ల మధ్య తేడా ఇదీ..

చెన్నై సూపర్ కింగ్స్.. తొలి, రెండో మ్యాచ్‌ మధ్య చాలా వ్యత్యాసం కనిపించింది. తొలి మ్యాచ్‌లో అన్ని విభాగాల్లోనూ విఫలమైంది. ప్రత్యర్థికి లోయెస్ట్ స్కోర్‌ను లక్ష్యంగా నిర్దేశించింది. రెండో మ్యాచ్ మాత్రం అలాక్కాదు. స్కోర్ బోర్డ్ ఏకంగా 200 మార్క్‌ను దాటింది. ప్రత్యర్థికి 211 పరుగులను టార్గెట్‌గా పెట్టింది. బ్యాటర్లు చెలరేగి ఆడారు. పక్కా ఐపీఎల్ ఫార్మట్‌లో దుమ్ము లేపారు. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్, కేప్టెన్ రవీంద్ర జడేజా మినహా ప్రతి బ్యాటర్ కూడా బౌలర్లపై ప్రతాపం చూపారు.

ముంచిన బౌలర్లు..

ముంచిన బౌలర్లు..

రెండో మ్యాచ్‌లో బ్యాటర్లు రాణించినప్పటికీ.. వారికి బౌలర్ల సహకారం లేకుండా పోయింది. ఏ ఒక్క బౌలర్ కూడా ప్రత్యర్థిపై ఒత్తిడిని తీసుకుని రాలేకపోయాడు. ఉన్నంతలో డ్వేన్ ప్రిటోరియస్ ఫర్వాలేదనిపించుకున్నాడు. నాలుగు ఓవర్లల్లో 31 పరుగులు ఇచ్చి రెండు వికెట్ల పడగొట్టాడు. సీనియర్ బౌలర్ డ్వేన్ బ్రావో సైతం పరిస్థితిని చక్కదిద్దలేకపోయాడు. మొయిన్ అలీ, శివమ్ దుబే, రవీంద్ర జడేజా ఓవర్లల్లో బ్యాటర్లు పరుగులు పిండుకున్నారు.

కేప్టెన్‌గా ఫ్లాప్

కేప్టెన్‌గా రవీంద్ర జడేజా అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. తొలి రెండు మ్యాచ్‌లల్లో అతను ఏ మాత్రం ప్రభావాన్ని చూపలేకపోయాడు. కోల్‌కతపై మ్యాచ్‌లో నింపాదిగా బ్యాటింగ్ చేశాడు. బౌలింగ్‌లో విఫలం అయ్యాడు. ఇక్కడా అదే పరిస్థితి. బ్యాటర్‌గా పరుగులు రాబట్టుకోలేకపోయాడు. క్రీజ్‌లో ఎక్కువ సేపు కుదురుకోలేకపోయాడు. తొమ్మిది బంతుల్లో 17 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. లక్నో బ్యాటర్లపై ఒత్తిళ్లను తీసుకొచ్చేలా వ్యూహాలను రూపొందించుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. ఫీల్డింగ్‌ను మోహరించడంలో గానీ, బౌలర్లను మార్చడంలో గానీ అంచాలను ఏ మాత్రం అందుకోలేకపోయాడు.

కొంపముంచిన శివం దూబే

కొంపముంచిన శివం దూబే

చెన్నై సూపర్ కింగ్స్‌ గెలుపుపై కొద్దో గొప్పో ఆశలు ఉన్నప్పటికీ.. దాన్ని మొత్తం తుడిచి పెట్టేలా చేసింది ఇన్నింగ్ 19వ ఓవర్. శివం దూబే వేసిన ఆ ఓవర్‌లో ఏకంగా 25 పరుగులు రాబట్టుకున్నారు బ్యాటర్లు. రెండు ఎక్స్‌ట్రాలతో మొత్తంగా ఎనిమిది బంతులు విసిరాడా ఓవర్‌లో. రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు, రెండు వైడ్స్ ఇచ్చుకున్నాడు. అంతకుముందు- మొయిన్ అలీ వేసిన ఓవర్‌లోనూ ఇదే పరిస్థితి. అతనూ ఒకే ఒక్క ఓవర్ వేసి 14 ఇచ్చాడు.

శివం దుబే చేతికి బంతి ఇవ్వడం..

శివం దుబే చేతికి బంతి ఇవ్వడం..

కీలకమైన 19వ ఓవర్‌ను వేసే అవకాశం శివం దుబేకు ఇవ్వడం కూడా రవీంద్ర జడేజా చేసిన ఘోర తప్పిదాల్లో ఒకటి. 12 బంతుల్లో 34 పరుగులు చేయాల్సిన దశలో డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌కు బదులుగా దుబేకు బంతిని ఇవ్వడం శాపంగా మారింది. ఈ ఓవర్ ముగిసే సమయానికి సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. చివరి ఓవర్‌ను ముఖేష్ చౌదరి ఇచ్చి మరో తప్పు చేశాడు జడేజా. ఆ ఓవర్‌ను ఉత్కంఠభరితంగా మార్చే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ముఖేష్ చౌదరి తొలి రెండు బంతులను వైడ్‌గా విసరడంతో గెలుపెవరితో తేలిపోయింది.

Story first published: Friday, April 1, 2022, 9:28 [IST]
Other articles published on Apr 1, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+