For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కొంపముంచిన రవీంద్ర జడేజా: చెన్నై సూపర్ ఓటమికి కారణాలివే

IPL 2022: 4 Reasons Why CSK Lost There 1st Match Against KKR

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022, 15వ ఎడిషన్ క్రికెట్ ప్రేమికుల ముందుకొచ్చేసింది. 65 రోజుల పాటు ఉర్రూతలూగించనుంది. ముంబైలోని వాంఖెడే స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్-కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య జరిగిన తొలి మ్యాచ్‌పై ఉన్న అంచనాలు తప్పాయి. గ్రౌండ్‌లో పరుగుల వరద పారుతుందని భావించిన అభిమానులకు నిరాశ పరిచిందీ మ్యాచ్. బౌలర్ల ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడలేకపోయారు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో వారి దూకుడుకు అడ్డుకట్ట వేయగలిగారు.

ధోనీ మెరుపులు..

ధోనీ మెరుపులు..

టాస్ ఓడిపోయి.. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్- నిర్ణీత 20 ఓవర్లలో 131 పరుగులే చేయగలిగింది. లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగిన మహేంద్రసింగ్ ధోనీ మెరుపులు మెరిపించకపోతే.. ఆ స్కోర్ కూడా కష్టం అయ్యేదే. తన శైలికి భిన్నంగా తొలి మ్యాచ్‌లోనే ధోనీ చెలరేగిపోయాడు. 38 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్స్‌తో 50 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో ఇదే మొదటిది. రాబిన్ ఊతప్ప, కేప్టెన్ రవీంద్ర జడేజా మినహా మరెవరూ రాణించలేకపోయారు.

బౌలర్ల ఆధిపత్యం..

బౌలర్ల ఆధిపత్యం..

ఛేదించాల్సిన లక్ష్యం స్వల్పమే అయినప్పటికీ.. కోల్‌కత సైతం తడబడింది. చెన్నై బౌలర్ల ధాటికి బెంబేలెత్తింది. అజింక్య రహానె సత్తా చాటగలిగాడు. 34 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్స్‌తో 44 పరుగులు చేశాడు. 131 పరుగుల టార్గెట్‌ను ఛేదించడానికి నాలుగు వికెట్లను కోల్పోయిన కోల్‌కత 19 ఓవర్ల పాటు ఆడాల్సి వచ్చిందంటే.. చెన్నై బౌలర్ల పట్టు ఏ స్థాయిలో ఉంతో అర్థం చేసుకోవచ్చు. 38 సంవత్సరాల వయస్సులో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం.. హైలైట్. నాలుగు ఓవర్లలో 20 పరుగులు ఇచ్చి.. మూడు వికెట్లు పడగొట్టాడు.

దమ్‌దార్ బ్యాటర్లు ఉన్నా

దమ్‌దార్ బ్యాటర్లు ఉన్నా

తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పరాజయం పాలవడానికి కారణాలు లేకపోలేదు. దమ్‌దార్ బ్యాటర్లు ఉన్నప్పటికీ.. చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోర్ చేయలేక చేతులెత్తేశారు. ఓపెనర్లు ఇద్దరూ విఫలం అయ్యారు. ఓపెనింగ్ జంట భారీ భాగస్వామ్యాన్ని అందించకపోవడం మైనస్ పాయింట్. రుతురాజ్ గైక్వాడ్ ఘోరంగా విఫలం అయ్యాడు. డకౌట్ అయ్యాడు. ఉమేష్ యాదవ్ నుంచి వెలువడిన షార్ట్ అండ్ వైడ్ డెలివరీని ఆడలేకపోయాడు. డెవాన్ కాన్వేదీ అదే పరిస్థితి.

ఆ స్టంపౌట్..

ఆ స్టంపౌట్..

టాప్ ఆర్డర్‌లో ధాటిగా ఆడుతున్నా రాబిన్ ఊతప్ప స్టంపౌట్ కావడం.. చెన్నై బ్యాటర్ల దూకుడుకు కళ్లెం వేసింది. రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 21 బంతుల్లో 28 పరుగులు చేసి.. జోరు మీదున్న సమయంలో అతను అవుట్ కావడం.. ఆ వెంటనే అంబటి రాయుడు పెవిలియన్ దారి పట్టడం.. చెన్నై ఇన్నింగ్ పరుగుల వేగానికి బ్రేక్ వేశాయి. ప్రత్యర్థి జట్టు బౌలింగ్ భయపెట్టనంతగా లేనప్పటికీ.. బ్యాటర్ల అతి జాగ్రత్తకు పోయినట్టే కనిపించింది.

జడేజా క్రీజ్‌లో ఉన్నా..

జడేజా క్రీజ్‌లో ఉన్నా..

పించ్ హిట్టర్‌గా పేరున్న రవీంద్ర జడేజా తన స్టైల్‌లో ఆడలేకపోయాడు. ఐపీఎల్ ఫార్మట్‌కు ఏ మాత్రం తగిన విధంగా అతని బ్యాటింగ్ తీరు కనిపించింది. ఇన్నింగ్ చివరి బంతిని ఫెన్సింగ్ దాటించడం ఒక్కటే- అతని బ్యాటింగ్‌లో కనిపించిన ఒకే ఒక్క హైలైట్. అప్పటి వరకూ అతను అతి జాగ్రత్తగా ఆడాడు. చివరి బంతికి సిక్స్ సాధించడాన్ని పక్కన పెడితే- 27 బంతుల్లో రవీంద్ర జడేజా చేసింది 20 పరుగులే. అతను ఎంత నెమ్మదిగా బ్యాటింగ్ చేశాడనేది ఇక్కడే తేలిపోయింది.

స్పిన్నర్ల వల..

స్పిన్నర్ల వల..

కోల్‌కత్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేశారు. ఏస్ స్పిన్నర్లు సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి చెన్నై బ్యాటర్లను కట్టిపడేశారు. సునీల్ నరైన్ తన నాలుగు ఓవర్ల కోటాలో ఇచ్చింది 15 పరుగులే. వరుణ్ చక్రవర్తి నాలుగు ఓవర్లలో 23 పరుగులు ఇఛ్చి ఓ వికెట్ పడగొట్టాడు. ఉమేష్ యాదవ్..పొదుపుగా బౌలింగ్ చేశాడు.. రెండు వికెట్లు తీసుకున్నాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అతనే. చెన్నై బ్యాటర్లు చేసిన ఆ కాసిన్ని పరుగులు కూడా శివం మావి, ఆండ్రీ రస్సెల్ బౌలింగ్ నుంచి పిండుకున్నవే.

Story first published: Sunday, March 27, 2022, 8:47 [IST]
Other articles published on Mar 27, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+