Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2022: ముంబై, బెంగ‌ళూరు కొంప ముంచిన 18వ ఓవ‌ర్‌.. ఒకే ఓవ‌ర్‌తో మ్యాచ్ ఫలితం తారుమారు

IPL 2022: 18th over played a key role in the Delhi vs Mumbai and Punjab vs Bangalore match.

ఆదివారం జ‌రిగిన రెండు మ్యాచ్‌ల్లో 18వ ఓవ‌ర్ కీల‌కంగా మారింది. ఈ ఓవ‌ర్‌తోనే ఆయా మ్యాచ్‌లు కీల‌క మ‌లుపు తిరిగాయి. ముంబై ఇండ‌య‌న్స్ వ‌ర్సెస్ ఢిల్లీ క్యాపిట‌ల్స్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో 18వ ఓవ‌ర్లో డేనియ‌ల్ సామ్స్ ఏకంగా 24 ప‌రుగులు ఇవ్వ‌డంతో అప్ప‌టివ‌ర‌కు ముంబై చేతుల్లో ఉన్న మ్యాచ్ కాస్త ఢిల్లీ చేతుల్లోకి వెళ్లిపోయింది. అలాగే పంజాబ్ కింగ్స్ వ‌ర్సెస్ రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లోనూ ఇలాగే జ‌రిగింది. 18వ ఓవ‌ర్లో మ‌హ్మ‌ద్ సిరాజ్ 25 ప‌రుగులివ్వ‌డంతో మ్యాచ్ బెంగ‌ళూరు చేతుల్లో నుంచి పంజాబ్ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇలా ఒకే రోజు రెండు మ్యాచ్‌ల్లో ఒకే విధంగా జ‌ర‌గ‌డం ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

కొంప ముంచిన డేనియ‌ల్ స్లామ్స్

కొంప ముంచిన డేనియ‌ల్ స్లామ్స్

ముంబై ఇండియ‌న్స్ వ‌ర్సెస్ ఢిల్లీ క్యాపిట‌ల్స్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో ఓ ద‌శ‌లో రోహిత్ సేన విజ‌యం ఖాయంగా కనిపించింది. కానీ ల‌లిత్ యాద‌వ్, అక్ష‌ర్ పటేల్ చెల‌రేగ‌డంతో ఢిల్లీ గెలిచింది. 104 ప‌రుగుల‌కు 6 వికెట్లు కోల్పోయిన స్థితి నుంచి వీరిద్ద‌రు అద్భుతంగా ఆడి జ‌ట్టుకు విజ‌యాన్ని అందించారు. మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ గెల‌వాలంటే మ‌రో 3 ఓవ‌ర్ల‌లో 28 ప‌రుగులు చేయాల్సిన స‌మ‌యంలో 18వ ఓవ‌ర్ వేయ‌మ‌ని డేనియల్ సామ్స్‌కు ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ బాల్ ఇచ్చాడు. అప్పుడు క్రీజులో లలిత్ యాద‌వ్, అక్ష‌ర్ పటేల్ ఉన్నారు.

ఏకంగా 24 ప‌రుగులు ఇచ్చేశాడు

ఏకంగా 24 ప‌రుగులు ఇచ్చేశాడు

ఇక డేనియల్ సామ్స్ వేసిన 18వ ఓవ‌ర్ తొలి బంతిని అక్ష‌ర్ ప‌టేల్ సిక్సు బాదాడు. రెండో బంతికి సింగిల్ తీయ‌గా.. ల‌లిత్ యాద‌వ్ స్ట్రైకింగ్‌కు వ‌చ్చాడు. ఆ ఓవ‌ర్ మూడో బంతిని సిక్సు బాదిన ల‌లిత్ యాద‌వ్.. నాలుగో బంతిని ఫోర్ బాదాడు. ఐదో బంతికి సింగిల్ తీశాడు. ఇక ఆరో బంతిని అక్ష‌ర్ పటేల్ సిక్సు బాదేశాడు. ఆ ఓవ‌ర్లో వ‌రుస‌గా 6 1 6 4 1 6 ప‌రుగులు వ‌చ్చాయి. అంటే ఆ ఒక్క ఓవ‌ర్లోనే 24 ప‌రుగులు రావ‌డంతో మ్యాచ్ ముంబై చేయి జారిపోయింది. ఈ మ్యాచ్‌లో 4 ఓవ‌ర్ల‌లోనే డేనియ‌ల్ సామ్స్ 57 ప‌రుగులిచ్చి ముంబై ఓట‌మికి కార‌ణ‌మ‌య్యాడు. ఢిల్లీ విజ‌యానికి మ‌రో 4 ర‌న్స్ మాత్ర‌మే కావ‌డంతో 19వ ఓవ‌ర్లో ఢిల్లీ విజ‌యాన్ని అందుకుంది.

భారీగా ప‌రుగులిచ్చి సిరాజ్‌

భారీగా ప‌రుగులిచ్చి సిరాజ్‌

పంజాబ్ కింగ్స్‌, రాయ‌ల్ చాలెంజ‌ర్స్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లోనూ అచ్చం ఇదే మాదిరిగా జ‌రిగింది. పంజాబ్ విజ‌యానికి 18 బంతుల్లో 36 ప‌రుగులు కావాల్సిన స‌మ‌యంలో మ‌హ్మ‌ద్ సిరాజ్ వేసిన 18వ ఓవ‌ర్‌తో మ్యాచ్ మ‌లుపు తిరిగింది. ఆ ఓవ‌ర్ తొలి 3 బంతులను ఓడియ‌న్ స్మిత్ 6, 4, 6 బాదాడు. ఆ త‌ర్వాత ఓ సింగిల్ రాగా, చివ‌రి బంతిని ఓడియ‌న్ స్మిత్ మ‌ళ్లీ సిక్స్ బాదాడు. మొత్తంగా ఆ ఓవ‌ర్లో 25 ప‌రుగులు రావ‌డంతో మ్యాచ్ పంజాబ్ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఆ త‌ర్వాత ఓవ‌ర్లో విజ‌యాన్ని అందుకుంది. కాగా ఈ రెండు ఓవ‌ర్ల‌లో మొద‌టి, మూడో, చివ‌రి బంతులను కామ‌న్‌గా సిక్సులు బాద‌డం గ‌మ‌నార్హం. ఇలా ఒకే రోజు ఒకే విధంగా జ‌ర‌గ‌డం ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Story first published: Monday, March 28, 2022, 14:08 [IST]
Other articles published on Mar 28, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+