IPL 2021: కేవలం ఫోన్ కోసమే.. మ్యాక్స్‌వెల్ అంత బిల్డప్ ఇచ్చాడు: చహల్

ముంబై: ఐపీఎల్ 2021లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాంచి ఊపు మీద ఉంది. ఎన్నడూలేని విధంగా వరుసగా నాలుగు విజయాలు అందుకుని పాయింట్ల పట్టికలో దూసుకుపోతోంది. మరోవైపు విజయాలను ప్లేయర్స్ కూడా బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. గురువారం రాత్రి రాజస్థాన్ రాయల్స్‌పై 10 వికెట్లతో గెలిచిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో మణికట్టు స్పిన్నర్ యజువేంద్ర చహల్ చేసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను లక్ష్యంగా చేసుకొని చహల్ ఈ ఫన్నీ వీడియో చేశాడు. అంతేకాదు అతడిపై ఫన్నీ కామెంట్స్ కూడా చేశాడు.
చిన్న డిబేట్
రాజస్థాన్ రాయల్స్‌తో మ్యచ్ ముగిసిన తర్వాత బెంగళూరు డ్రెస్సింగ్ రూమ్‌లో యజువేంద్ర చహల్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ మధ్య చిన్న డిబేట్ నడిచింది. బోల్డ్ డైరీస్‌లో భాగంగా ఆర్‌సీబీ యాజమాన్యం నిర్వహించిన ఫన్నీ షోలో వీరిద్దరు పాల్గొన్నారు. చహల్, మ్యాక్స్‌వెల్‌తో పాటు దేశవాళీ ఆటగాడు షాబాజ్ అహ్మద్, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ కూడా ఉన్నారు. రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎవరు ఎన్ని క్యాచ్‌లు పట్టారనేదానిపై వీరిద్దరి మధ్య పెద్ద డిబేట్ జరిగింది. అసలే ట్రోల్ చేయడంలో ముందు వరుసలో ఉండే చహల్.. అవకాశం దొరికితే ఊరుకుంటాడా?. ఇదే సమయం అని మ్యాక్స్‌వెల్‌ను టార్గెట్ చేస్తూ రెచ్చిపోయాడు.

ఈజీగా అందుకోవాల్సిన క్యాచ్‌ను:
'మ్యాచ్‌లో నేను రెండు కష్టతరమైన క్యాచ్‌లు అందుకున్నా. మ్యాక్స్‌వెల్ ఒకటి మాత్రమే అందుకున్నాడు. నేను పట్టిన రెండు క్యాచ్‌లు కష్టంగా అనిపించినా.. చూసేవాళ్లకు అవి సింపుల్‌గా ఉన్నాయి. కానీ మ్యాక్సీ మాత్రం ఈజీగా అందుకోవాల్సిన క్యాచ్‌ను కావాలనే డైవ్ క్యాచ్‌గా మార్చుకున్నాడు. కేవలం ఓ ఫోన్ కోసం' అంటూ చహల్ కామెంట్ చేశాడు. అంతేకాదు టీమిండియా అల్లరి పిల్లడు తన బాధను డ్రెస్సింగ్ రూమ్‌లోని ప్రతి ఒక్కరి దగ్గరికీ వెళ్లి చెప్పుకున్నాడు. కోచ్‌తో పాటు డివిలియర్స్, షాబాజ్‌కు తన వైఖరి విపించాడు. చివరికి మ్యాక్స్‌వెల్ దగ్గరికి కూడా వెళ్లి తన గోడు వెల్లబోసుకున్నాడు.

గిఫ్ట్‌గా పొందడానికే:
యజువేంద్ర చహల్ వ్యాఖ్యలపై షాబాజ్ అహ్మద్ స్పందిస్తూ... 'కేవలం ఒక ఫోన్‌ను గిఫ్ట్‌గా పొందడానికి మ్యాక్సీ ఈ పని చేశాడు. చహల్ టీం కోసం ఆడుతాడు కాబట్టి క్యాచ్‌లు కష్టంగా అనిపించినా ఈజీగా అందుకుంటాడు. కొందరు మాత్రం ఫోన్ ఆశించి ఈజీగా అందుకోవాల్సిన క్యాచ్‌లను కష్టతరం చేసుకుంటారు' అంటూ ఫన్నీగా పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'బోల్డ్ డైరీస్.. యజువేంద్ర చహల్ షో' అంటూ బెంగళూరు ప్రాంచైజీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. వీడియో చూసిన ఫాన్స్ కూడా తమదైన శైలిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఓపెనర్ర్లే బాదారు:
రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 178 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు ఓపెనర్ర్లే బాదారు. యువ ఓపెనర్ దేవదత్ పడిక్కల్ మెరుపు సెంచరీ (101 నాటౌట్)కి కెప్టెన్ విరాట్ కోహ్లీ ( 72 నాటౌట్) సూపర్ ఇన్నింగ్స్ తోడవడంతో బెంగళూరు ఘన విజయాన్ని అందుకుంది. కాగా ఆర్‌సీబీ తన తర్వాతి మ్యాచ్‌ను రేపు (ఏప్రిల్ 25) సీఎస్‌కేతో ఆడనుంది. రెండు జట్లు వరుస విజయాలతో మంచి ఊపులో ఉన్నాయి కాబట్టి మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications